లలిత్ మోడి

From tewiki
Jump to navigation Jump to search
లలిత్ కుమార్ మోడి
జననం (1963-11-29) 1963 నవంబరు 29 (వయస్సు 57)
వృత్తివ్యాపారవేత్త, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకుడు, భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఉపాధ్యక్షుడు.
సుపరిచితుడుఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభకుడుగా

లలిత్ కుమార్ మోడి, (మూస:Lang-gu, హిందీ: ललित कुमार मोदी; 1963 నవంబరు 29 న, భారతదేశం లోని ఢిల్లీలో జన్మించాడు)[1] ఒక భారత క్రికెట్ కార్యనిర్వాహకుడు మరియు వ్యాపారవేత్త. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ మరియు కమీషనర్, చాంపియన్స్ లీగ్ ఛైర్మన్ (సెప్టెంబరు 2008 నుండి), 2005 నుండి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వైస్ ప్రెసిడెంట్ మరియు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కు వైస్ ప్రెసిడెంట్[2]. అతని కుటుంబంచే స్థాపించబడి మరియు నిర్వహించబడుతున్న పరిశ్రమల సమూహం మోడి ఎంటర్ప్రైజెస్కు కూడా అతను ప్రెసిడెంట్ మరియు మానేజింగ్ డైరెక్టర్, మరియు మోడి ఎంటర్ప్రైజెస్ వ్యాపార సామ్రాజ్యంలో భాగమైన గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.

నేపథ్యం మరియు వ్యక్తిగత జీవితం

లలిత్ మోడి సంపన్నమైన మరియు సఫలమైన వ్యాపార కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి, క్రిషన్ కుమార్ మోడి, 4 బిలియన్ రూపాయల వ్యాపార సామ్రాజ్యం అయిన మోడి ఎంటర్‌ప్రైజెస్కు యజమాని, దీనిని అతని తాత రాజ్ బహదూర్ గుజర్మల్ మోడి స్థాపించాడు.[3] అతను సిమ్లా మరియు నైనిటాల్ లోని పాఠశాలలలో చదువుకున్నాడు. అతనికి పాఠశాల చదువు నచ్చేదికాదు, ఎక్కువగా పారిపోతూ ఉండేవాడు. పాఠశాల చదువు తర్వాత, అతను యునైటెడ్ స్టేట్స్లో విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అతను SAT (ఒక US కళాశాల లేదా యూనివర్సిటీలో ప్రవేశానికి ఇది తప్పనిసరి) లో మంచి మార్కులు పొందాడు, మరియు భారతదేశంలోని కళాశాలలు మరియు విశ్వవిద్యాలయములలో ప్రవేశానికి అవసరమైన పాఠశాల ఆఖరి పరీక్ష రాయవద్దనుకున్నాడు. తదుపరి, అతను నార్త్ కరోలిన, యునైటెడ్ స్టేట్స్ లోని డర్హామ్లో ఉన్న డ్యూక్ యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు.[4]

1985 లో, డ్యూక్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో, అతనిపై 500 గ్రాముల కొకైన్ (మాదక ద్రవ్యం) కలిగి ఉండటం, కిడ్నాపింగ్ (దొంగతనంగా మనుష్యులను ఎత్తుకు పోవటం) మరియు దౌర్జన్యము వంటి నేరాలు మోపబడ్డాయి. అతను నేరాన్ని అంగీకరించాడు మరియు శిక్షను తగ్గించమని వేడుకున్నాడు, దాని ఫలితంగా అతని శిక్షను సడలించి, $10,000 జరిమానా విధించి, 100 గంటల సమాజ సేవ చేయాల్సిందిగా ఆదేశించారు.[5] అతను డ్యూక్ యూనివర్సిటీలో ఉన్న సమయంలోనే అతను తన భార్య, మినాల్ ను కలుసుకున్నాడు. ఆమె అతని తల్లికి స్నేహితురాలు మరియు వివాహిత, ఆమె లండన్ లో తన కుటుంబంతో కలిసి జీవిస్తుండేది. తదనంతరం ఆమె విడాకులు తీసుకుని లలిత్ ని ముంబైలో వివాహం చేసుకున్నది. వారు ఇప్పుడు జుహూ, ముంబై లోని ఒక విలాసవంతమైన బంగళాలో, వారి ముగ్గురు పిల్లలు - రుచిర్, అలియ మరియు కరిష్మా (మినాల్ కు మొదటి వివాహంలో పుట్టిన కుమార్తె) లతో కలిసి ఉంటున్నారు.[4]

వృత్తి

1983 మరియు 1986 మధ్య పేస్ యూనివర్సిటీ మరియు డ్యూక్ యూనివర్సిటీ లలో చదువుకుంటున్నప్పుడు, అతను 1985 లో ఫిలిప్ మోరిస్ లోను మరియు 1986 లో ఎస్టీ లాడర్ లోను కొంతకాలం పనిచేసాడు. అతను 1987 నుండి 1991 వరకు ఇంటర్నేషనల్ టుబాకో కంపెనీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, మరియు 1992 లో గాడ్ ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నాడు.[6] సుమారు అదే సమయంలో, అతను వినోద పరిశ్రమలో ప్రథమ ప్రయత్నాలు చేయటం ప్రారంభించాడు. ESPN (అప్పుడు డిస్నీ సొంతమైన) ను ఇండియాలో పంపిణీ చేస్తూ, అతను డిస్నీతో ఉమ్మడి ఒడంబడిక చేసుకున్నాడు, మరియు ESPN క్రికెట్ మ్యాచ్ లను చూపించేటట్లు ఒప్పించాడు.[4] అతను "పరిమిత ఓవర్" క్రికెట్ లీగ్ కొరకు ప్రతిపాదనలు చేసాడు, ఇది దూరదర్శన్ కు ఎక్కువ అనుకూలంగా ఉంటుందని అతను భావించాడు, కానీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వాటిని త్రోసిపుచ్చింది. విసుగెత్తిపోయి, అతను దానిని లోపలి నుండి ప్రభావితం చేయటానికి BCCI యొక్క బోర్డ్ లో స్థానం సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. తన ఆఖరి పేరును దాచిపెట్టడం ద్వారా అతను రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్లో సభ్యత్వం పొందాడు. చిట్టచివరకు అతను రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడు, తద్వారా అతనికి BCCI లో స్థానం దొరికింది. 2005 లో, పదవి కోసం జరిగిన పోరాటంలో మోడి పాత్ర ఉంది, దాని ఫలితంగా ఒక ప్రముఖ రాజకీయవేత్త మరియు జాతీయ మంత్రిమండలి మంత్రి అయిన శరద్ పవార్, BCCI ఎన్నికలలో ఇండియన్ క్రికెట్ కు మాజీ అధ్యక్షుడు మరియు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధిపతి అయిన జగ్మోహన్ దాల్మియాను పదవి నుండి తొలగించాడు. మోడి అప్పుడు BCCI కి వైస్ ప్రెసిడెంట్ గా నియమించబడ్డాడు. బోర్డ్ కార్యకలాపాల యొక్క వాణిజ్య పార్శ్వంలో అధికంగా పాల్గొంటూ, 2005 మరియు 2008 మధ్య అతను వారి రాబడిని ఏడు రెట్లు పెంచినట్లు నివేదించబడింది, అప్పుడు BCCI వార్షిక రాబడి 1 బిలియన్ USD కన్నా అధికంగా ఉండేది.[7] చివరకు, 2008 లో అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను ప్రారంభించాడు, ఈ లీగ్ ప్రతి జట్టు బ్యాటింగును గరిష్ఠంగా 20 ఓవర్లకు పరిమితం చేసే ట్వంటీ20 క్రికెట్ చుట్టూ ఆధారపడి ఉంది.

కుటుంబానికి బెదిరింపు మరియు రక్షణ

మార్చి 2009 లో ముంబై పోలీసులు చీకటి ప్రపంచానికి అధిపతి ఛోటా షకీల్ యొక్క కిరాయి హంతకుడు రషిద్ మలబారిని పట్టుకున్నారు మరియు అతనిని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు వారి వార్గం క్రికెట్ అధిపతి లలిత మోడి, అతని భార్య మినాల్ మరియు కుమారుడు రుచిర్ లను హతమార్చాలని యోచిస్తున్నట్లు అతను తెలియజేసాడు. మోడిని మరియు అతని కుటుంబ సభ్యులను దక్షిణ ఆఫ్రికాలో కానీ లేదా ఇండియాలో కానీ హతమార్చటానికి నలుగురు ఖూనీకోరులను అద్దెకు తీసుకోవలసినదిగా ఆదేశిస్తున్న దావూద్ ఇబ్రహీం మరియు ఛోటా షకీల్ మధ్య టెలిఫోన్ సంభాషణను ఆలకించటం ద్వారా ఒక ప్రభుత్వ గూఢచార ఏజెన్సీ దీనిని ధ్రువీకరించింది. ఇంటలిజెన్స్ బ్యూరో వారు స్వాధీన పరుచుకున్న ఎలక్ట్రానిక్ సర్వీలేన్స్ (కాపలాదారీ) రికార్డులు ఛోటా షకీల్ తన కిరాయి హంతకులతో మోడిని ముంబైలో కానీ దక్షిణ ఆఫ్రికాలో కానీ హతమార్చవలసిందిగా చెపుతున్నట్లు సూచించాయి. "ఉస్కో ఖతం కర్ దో ఇండియా యా సౌత్ ఆఫ్రికా మే," ఇది అతని ఆదేశం. ఈ బెదిరింపుకు కారణం మోడి పాకిస్తానీ క్రికెట్ ఆటగాళ్లను IPL 2 నుండి బహిష్కరించటమే. లలిత్ మోడి ఇంట్లో ఉన్నా లేకపోయినా సాయుధ పోలీసు దళాలు అతని ఇంటి చుట్టూ కాపలాగా ఉండే సదుపాయం కల్పించబడింది, మరియు అతను తన ఇంటి బయట ఉన్నప్పుడు 24 గంటల సాయుధ పోలీసు దళాలు మరియు అతనిని అనుసరించే ఒక ప్రభుత్వ రక్షణ వాహనము వంటి పోలీసు రక్షణ అతనికి అందించబడింది. కానీ అతని భార్య మినాల్ మరియు కుమారుడు రుచిర్ వారి ఇంటి బయట ఉన్నప్పుడు వారితో కేవలం ఒక సాయుధ పోలీసు మాత్రమే ఉంటాడు. మోడికి 24 గంటలూ అతని ఇంటికి కాపలా కాసే సొంత వ్యక్తిగత రక్షకులు మరియు అతనిని, అతని భార్యను మరియు అతని కుమారుడిని ఎల్లవేళలా సంరక్షించటానికి మోడి తనకు తానే నియమించుకున్న అంగరక్షకులు ఉన్నారు. IPL యొక్క రక్షణ దళాలు ఎల్లవేళలా మోడి చుట్టూ రక్షణను అధికం చేసాయి. IPL యొక్క సెక్యూరిటీ ఏజెన్సీ నికోల్స్ అండ్ స్టైన్ సహ-యజమాని బాబ్ నికోల్స్ మోడి చుట్టూ వ్యక్తిగత రక్షణ పెంచబడి పటిష్ఠం చేయబడింది అని స్పష్టం చేసాడు. మోడి ఇండియా బయట ఉన్నప్పుడు కూడా భారత ప్రభుత్వం మోడి చుట్టూ అత్యధిక పోలీసు రక్షణను అందిస్తోందని కూడా అతను స్పష్టం చేసాడు. లలిత్ మోడి పిల్లలు, రుచిర్ మరియు అలియ ఒకే సమయంలో 2-4 కార్ల కాపలాతో ప్రయాణిస్తూ ఉంటారని కూడా తెలిసిందే, ఇది బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబే వద్ద గమనించబడింది. రుచిర్ బడిలోకి ప్రవేశించేటప్పుడు లేదా బయటకు వచ్చేటప్పుడు 5 మంది అంగరక్షకులు అతనిని అనుసరిస్తారు, వారిలో ఇద్దరు సాయుధ పోలీసు అధికారులు మరియు ముగ్గురు వ్యక్తిగత అంగరక్షకులు - వారిలో ఇద్దరు నల్ల దుస్తులు ధరించి ఉండగా వేరేరకపు దుస్తులు ధరించిన ఇంకొకడు అతనితో పాటు లోనికి వెళతాడు. జుహూలోని లలిత్ మోడి బంగళా అత్యధిక రక్షణలో ఉంటుందని తెలిసింది. ఆధారాల ప్రకారం 10-15 రక్షణదారులు అతని ఇంటి చుట్టూ 24 గంటలూ తిరుగుతూ ఉంటారు. మోడి ఇంటి ముఖద్వారం బయట ఆ ప్రదేశాన్ని నిశితంగా పరీక్షిస్తూ మరియు 24 గంటలూ ఆ దారిన పోయే ప్రతి ఒక్కరిని ప్రశ్నించేందుకు ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తిగత సంరక్షుకులు ఉంటారు. 2009 డిసెంబరు 19 న ముంబై లోని మోడి ఇల్లు అగ్నిప్రమాదానికి గురై కాలిపోయింది, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇది జరిగిందని అధికారికంగా నివేదించారు. ఈ పెద్ద అగ్నిప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా అని పోలీసులు ఇంకా పరిశోధిస్తున్నారు.[8][9][10][11][12][13]

$975 మిలియన్ల ESPN ఒప్పందం

ది ఎకనామిక్ టైమ్స్ ఉదహరించింది:

Cricket economics has once again hit the roof. Sports broadcaster ESPN Star Sports (ESS) has paid a staggering $975 million for exclusive global commercial rights for the Twenty20 Champions League for a 10-year period, starting with the inaugural tournament between October 8–23 this year (2009).

The deal, which gives ESS rights for all T20 Champions League seasons until 2017, makes it the highest cricket tournament by value on a per game basis. Earlier this year, the World Sports Group-Sony Entertainment consortium had paid BCCI $918 million for 10-year global rights for the India Premier League (IPL).

Apart from ESS, bids were received from Abu Dhabi Sports Club and Dubai International Capital (DIC). While the DIC bid was for $751.3 million, Abu Dhabi Sports Club’s bid, being a conditional one, was disqualified. ESS had bid $900 million for the deal and an additional $75 million for marketing.

Twenty20 Champions League, modelled after the football champions league, would feature the best teams of the domestic Twenty20 tournaments in various countries. It is being jointly organised by the Indian, Australian and South African cricket boards. The inaugural league, with $6-million prize money, will feature eight teams — two each from India, Australia and South Africa and the champions from the England and Pakistan domestic leagues. The prize money will be shared between the teams and their players.

“This deal will cement our relationship with BCCI, Cricket Australia and Cricket South Africa and we are committed to setting new benchmarks in broadcast and distribution,” ESS MD Manu Sawhney said in a statement. IPL chairman and commissioner Lalit Modi said: “We believe this is the best commercial deal for Champions League.”

[14]

బిజినెస్ స్టాండర్డ్[15] మరియు అనేక ఇతర వార్తా-మూలాలు కూడా ఈ ఒప్పందమును నివేదించాయి.[16][17]

పన్ను చెల్లింపుదారుడు

2009 అక్టోబరు 31 నాటికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధిపతి, లలిత్ మోడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అత్యధిక పన్ను చెల్లింపుదారుడుగా మొదటి స్థానం పొందాడు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క ప్రథమార్ధంలో అతను ఇప్పటికే 8 కోట్ల రూపాయలు చెల్లించాడు.[18]

అవార్డులు మరియు గుర్తింపులు

 • BCCI ని భారతదేశంలో అత్యంత ఆధునికమైన కంపెనీగా తీర్చి దిద్దినందుకు 2008 వ సంవత్సరానికి అతనికి "ది బిజినెస్ స్టాండర్డ్ అవార్డు" వచ్చింది.[19]
 • 2008 సెప్టెంబరు 25 న ఆసియా బ్రాండ్ కాన్ఫరెన్స్ అతనికి "బ్రాండ్ బిల్డర్ ఆఫ్ ది ఇయర్" పురస్కారాన్ని అందజేసింది.
 • 2008 సెప్టెంబరు 26 న CNBC ఆవాజ్ అతనికి "ది కన్జ్యూమర్ అవార్డ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ క్రికెట్ ఇన్ ఇండియా" పురస్కారాన్ని అందజేసింది.
 • 2008 అక్టోబరు 6 న NDTV ప్రాఫిట్ "ది మోస్ట్ ఇన్నోవేటివ్ బిజినెస్ లీడర్ ఇన్ ఇండియా" పురస్కారాన్ని అందజేసింది.
 • 2008 అక్టోబరు 24 న ఫ్రాస్ట్ & సల్లివన్ గ్రోత్ ఎక్సలెన్స్ అవార్డ్స్ "ఎక్సలెన్స్ ఇన్ ఇన్నోవేషన్" అవార్డును ఇచ్చింది.
 • 2008 నవంబరు 8 న అతను "టీచర్స్ అచీవ్మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు.
 • నవంబర్ 12, 2008 న అతను "స్పోర్ట్స్ బిజినెస్- రష్మాన్స్ అవార్డ్ ఫర్ స్పోర్ట్స్ ఈవెంట్ ఇన్నొవేషన్" పురస్కారం అందుకున్నాడు.
 • 2009 జనవరి 22 న అతను "CNBC బిజినెస్ లీడర్" అవార్డు అందుకున్నాడు.
 • 2009 సెప్టెంబరు 26 న బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ నిర్మాణానికి - ఇండియా లీడర్షిప్ కాన్క్లేవ్ అవార్డు గెలుచుకున్నాడు.

మార్చి 2008 లో, అతను ఇండియా టుడే పత్రిక యొక్క భారతదేశపు 30 మంది అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చోటుచేసుకున్నాడు.[20]

ప్రముఖ క్రీడా పత్రిక స్పోర్ట్స్ ప్రో యొక్క 2008 ఆగస్టు సంచికలో క్రీడలతో సంబంధం ఉన్న ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల పవర్ లిస్టు (శక్తివంతమైన వ్యక్తుల జాబితా) లో అతను 17 స్థానంలో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా క్రీడా చరిత్రలో ఏ క్రీడా వర్గానికైనా అతను అద్భుత ఫలితాలు సాధించేవాడుగా (అధిక లాభాలు తెచ్చిపెట్టేవాడు) కూడా ప్రశంసలు అందుకున్నాడు. ఒక క్రీడా పాలకుడిగా ఉన్న కొద్ది సమయంలోనే అతను తన సంస్థ కొరకు ఎనిమిది మిలియన్ల U.S. డాలర్లు సమీకరించాడు. ఇదంతా అతను గౌరవప్రథమైన సామర్ధ్యంతో చేసాడు. మైక్ అథెర్టన్, టెలిగ్రాఫ్ లోని తన వ్యాసంలో అతనిని క్రికెట్ లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అభివర్ణించాడు. టైం మాగజైన్ యొక్క జూలై 2008 సంచిక 2008 కి ప్రపంచంలో ఉత్తమ క్రీడా నిర్వాహకుల జాబితాలో ఇతనికి 16 వ స్థానం ఇచ్చింది. అంతర్జాతీయ వ్యాపార పత్రిక బిజినెస్ వీక్ యొక్క అక్టోబరు 2008 సంచికలో - 25 మంది అత్యంత శక్తివంతమైన ప్రపంచవ్యాప్త క్రీడా ప్రముఖుల జాబితాలో లలిత్ మోడి 19 వ స్థానానికి ఎంపికయ్యాడు. లలిత్ మోడి మోస్ట్ ఇన్నోవేటివ్ బిజినెస్ లీడర్ ఆఫ్ ఇండియా (భారతదేశంలో అత్యంత వినూత్నమైన వ్యాపార నాయకుడు) గా NDTV అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇండియా యొక్క ప్రముఖ వ్యాపార పత్రిక బిజినెస్ టుడే యొక్క నవంబరు సంచిక మోడిని తన కవరు పేజీపై ముద్రించింది మరియు అతనిని ఇండియా యొక్క ఉత్తమ మార్కెటర్ (వ్యాపారవేత్త) గా పేర్కొంది. డిసెంబరు 31 న 2008 వార్షిక స్పోర్ట్స్ పవర్ లిస్ట్ అతనికి మొదటి స్థానాన్ని ఇవ్వగా DNA వార్తాపత్రిక వారి భారతదేశంలోని 50 మంది అత్యంత ప్రబలమైన వ్యక్తుల జాబితాలో అతనికి 17 వ స్థానాన్ని ఇచ్చింది. ఇండియా నుండి దానిని వేరే చోటుకి తరలించాలని కేవలం మూడు వారాల నోటీసుతో 2009 లో దక్షిణ ఆఫ్రికాలో IPL-2 ను విజయవంతంగా నిర్వహించారు. ఫోర్బ్స్ పత్రిక సెప్టెంబరు 2009 సంచికలో IPL "ప్రపంచం యొక్క హాటెస్ట్ (ఎక్కువ మంది ఇష్టపడే) క్రీడా సమితి"గా వర్ణించబడింది. కేవలం ఒకటిన్నర సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఒక సమితికి ఈ ఘనత చాలా అసాధారణమైనది మరియు ఆ గొప్పతనమంతా అద్భుతమైన తెలివితేటలు కలిగిన లలిత్ మోడికి చెందుతుంది. డిసెంబరు 28 న బిజినెస్ స్టాండర్డ్ లలిత్ మోడిని గేమ్ చేంజర్స్ ఆఫ్ ది డికేడ్ లో ఒకడిగా పేర్కొంది మరియు ఫోర్బ్స్ సంవత్సరాంత ప్రత్యేక సంచిక పర్సన్స్ ఆఫ్ ది ఇయర్ 2009 లో ఒకడిగా పేర్కొంది. ఫిబ్రవరి 2010 లో స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ మోడిని క్రీడలలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో రెండవ వాడిగా పేర్కొంది. 2009 సంవత్సరానికి స్పోర్ట్స్ బిజినెస్ పోల్ ఫిబ్రవరి 2010 సంచిక దాని క్రీడా ప్రపంచంలో ప్రపంచం యొక్క మిక్కిలి ప్రబలమైన 20 మంది వ్యక్తుల జాబితాలో ఇతనికి 14 వ స్థానం ఇచ్చింది. స్పోర్ట్స్ ప్రో దాని ఫిబ్రవరి 2010 సంచికలో 2009 లో మోడి చేసిన IPL యొక్క మార్పు మరియు నిర్వహణను 2009 సంవత్సరానికి అత్యంత విజయవంతమైన కథగా పేర్కొంది. నూతనత్వాన్ని వెతికే ఫాస్ట్ కంపెనీ - IPL ను క్రీడాప్రపంచంలో వినూత్నమైన వ్యాపార సంస్థలలో రెండవదిగా మరియు ప్రపంచంలోని అన్ని వ్యాపార సంస్థలలోనూ అత్యంత వినూత్నమైన వాటిలో ఇరవైరెండవది గానూ ఎన్నుకుంది.

ఇతర ఒప్పందాలు

మోడి BCCI లో చేరినప్పటినుండి అతను BCCI కొరకు విజయవంతంగా ఈ క్రింది ఒడంబడికలు చేసాడు:

 • సహారా గ్రూప్ తో టీం ఇండియాకు 4 సంవత్సరాల టీం స్పాన్సర్షిప్ డీల్ - 103 మిలియన్ డాలర్లు (415 కోట్లు) on 20.12.05
 • 24.12.05 న టీమ్ ఇండియా కొరకు నైకీతో 4 సంవత్సరాల దుస్తుల ప్రాయోజిత ఒప్పందం - 53 మిలియన్ డాలర్లు (215 కోట్లు).
 • 18.2.06 నింబస్ తో 4 సంవత్సరములు ప్రచార హక్కుల ఒప్పందం - 612 మిలియన్ డాలర్లు
 • 7.4.06 న విదేశీ మ్యాచ్ ల కొరకు జీతో 4 సంవత్సరాల ప్రచార హక్కుల ఒప్పందం - 219 మిలియన్ డాలర్లు
 • 27.8.07 న WSG తో BCCI ప్రాయోజిత ఒప్పందం - 46 మిలియన్ డాలర్లు (173 కోట్లు)
 • 15.1.08 న సోనీతో IPL ప్రచార హక్కుల ఒప్పందం - 1.26 బిలియన్ డాలర్లు
 • 25.01.08 న వివిధ పార్టీలతో IPL టీమ్స్ సేల్ -723.6 మిలియన్ డాలర్లు
 • 18.4.08 న లైవ్ కరెంటు మీడియాకు వెబ్ ప్రచార హక్కులు - 50 మిలియన్ డాలర్లు
 • IPL టైటిల్ ప్రాయోజితం మరియు గ్రౌండ్ ప్రాయోజితులు - 220 మిలియన్ డాలర్లు - మార్చి-ఏప్రిల్ 2008
 • 25.3.2009 న IPL ప్రచార హక్కులను 1.26 బిలియన్ డాలర్ల నుండి 2.3 బిలియన్ డాలర్లు చేయటానికి సోనీ WSG తో తిరిగి సంప్రదింపులు
 • 2009 అక్టోబరు 15 న 2000 కోట్ల కొరకు 4 సంవత్సరాలకు నింబస్ మీడియా రైట్స్ పునఃసంప్రదింపులు
 • 2009 నవంబరు 12 న UFO మరియు ESD తో 300 కోట్ల రూపాయలకు పైగా IPL నాటకరంగానికి సంబంధించిన హక్కుల ఒప్పందం
 • 2010 జనవరి 23 న 30 మిలియన్ డాలర్లకు పైగా వయాకాంతో IPL వినోద ప్రసారాల ఒప్పందం
 • 2010 జనవరి 22 న గూగుల్ మరియు యూ ట్యూబ్ తో IPL ఎంత మొత్తమో బయటపెట్టని ఒప్పందం

కొత్త జట్లు

2009 ఆగస్టు 26 న మోడి 2010 ప్రారంభంలో తను రెండు లేదా అంతకన్నా ఎక్కువ జట్లను 200-300 మిలియన్ US డాలర్ల మూల ధరకు వేలం వేయబోతున్నట్లు ప్రకటించాడు, ఈ ధర 2008 ప్రారంభంలో అతను అమ్మిన రేటు కన్నా 2 -3 రెట్లు పెరిగింది. 2011 సీజన్లో జతచేరే కొత్త జట్టుల మూల ధరను $225 మిలియన్ US డాలర్లుగా 2009 డిసెంబరు 17 న మోడి ప్రకటించాడు.

వివాదాలు

ట్విటర్లో లలిత్ మోడి రాసిన ఒక సంక్షిప్త సందేశం వివాదాలకు తెర లేపి, చివరికి ఐపియల్ లో అతని స్థానానికి ఎసరు పెట్టింది.

ఇవి కూడా చూడండి

సూచనలు

 1. "Lalit Modi - Cricinfo profile". Cricinfo. Retrieved 2009-08-30.
 2. "Bindra remains Punjab Cricket Association president". Cricinfo. August 18, 2008. Retrieved 2009-08-30.
 3. "Modi Enterprises - About Us - Founder". Modi Enterprises. Retrieved 5 February 2010.
 4. 4.0 4.1 4.2 Bhattacharya, Debaashis (19 April 2009). "Who's this man?". The Telegraph. Retrieved 5 February 2010.
 5. Sharma, Nagendar; Gupta, Varun (28 May 2008). "Drug rap returns to haunt IPL boss Modi". Hindustan Times. Archived from the original on 3 January 2013. Retrieved 25 January 2010.
 6. "Business Week profile - Lalit Modi". Business Week. Retrieved 2010-02-25.
 7. Wade, Matt (8 March 2008). "The tycoon who changed cricket". The Age. Retrieved 2010-02-25.
 8. "IPL beefs up security for Lalit Modi following reports of threat to his life". Thaindian News. 14 April 2009. Retrieved 25 January 2010.
 9. "IPL security agency moves on threat to Modi". Mid DAY. 13 April 2009. Retrieved 25 January 2010.
 10. Menon, Vinod Kumar (2 April 2009). "Lalit Modi and family live under threat". Mid DAY. Retrieved 25 January 2010.
 11. Dey, J (12 April 2009). "Bhai sets fielding for Modi". Mid DAY. Retrieved 25 January 2010.
 12. "Lalit Modi loses Rajasthan election again". Cricinfo. 7 December 2009. Retrieved 25 January 2010.
 13. Acharya, Preety; Thakur, Pramod (20 December 2009). "Lalit Modi's Juhu home catches fire, no one hurt". DNA. Retrieved 25 January 2010.
 14. "ESPN strikes $975m deal for T20 league". The Economic Times. 12 September 2008. Retrieved 25 January 2010.
 15. "ESPN-Star bags Champions League T20 rights for $975m". Business Standard. 12 September 2008. Retrieved 25 January 2010.
 16. Ramamurthy, Ramya (12 September 2008). "ESPN-Star Sports bags $975-m T20 deal for 10 yrs". moneycontrol.com. Retrieved 25 January 2010.
 17. "T20 Champs rights sold for $900m". The Saudi Gazette. Retrieved 25 January 2010.
 18. Thakur, Pradeep (31 October 2009). "Lalit Modi, Jagan among top taxpayers". The Times of India. Retrieved 25 January 2010.
 19. "Advani snubs Ranbaxy deal". rediff.com. June 23, 2008. Retrieved 2009-08-30.
 20. Wade, Matt (8 March 2008). "The tycoon who changed cricket". The Age. Retrieved 25 January 2010.

బాహ్య సంబంధాలు