"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

లావాసో డ్వార్ఫ్ లెమర్

From tewiki
Jump to navigation Jump to search

లావాసో డ్వార్ఫ్ లెమర్ (Lavasoa dwarf lemur)
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
C. lavasoensis
Binomial name
Cheirogaleus lavasoensis
Thiele et al., 2013

మూస:Taxonbar/candidate

లావాసో డ్వార్ఫ్ లెమర్ లెమర్ జాతికి చెందిన ఒక వానరము.

విశేశాలు

 • గుడ్లగూబ లాంటి కళ్లు, పిడికెడు శరీరం, నక్కలాంటి లావాటి తోక. ఇది కొత్తగా బయటపడ్డ ఓ పొట్టి వానరం.
 • ఇది ఎప్పుడో 12 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తల కంటబడింది. అయితే అసలు ఇది ఏ జాతికి చెందుతుందని చెప్పడానికి ఇన్నేళ్లు పరీక్షలు గట్రా జరిపి ఇప్పుడు ఇది లెమర్ జాతిదేనని తేల్చారు.
 • లెమర్లు మొత్తం సుమారు వంద జాతులు. వాటిల్లో అయిదు పొట్టి జాతివి ఉన్నాయి. ఈ పొట్టివాటిల్లో ఈ కొత్తదీ చేరిపోయింది.
 • లెమర్లు ఆఫ్రికా దగ్గరలోని మడగాస్కర్ దీవిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి.
 • ఈ కొత్త వానరాన్ని లావాసో పర్వతాల్లో గుర్తించారు కనుక 'లావాసో డ్వార్ఫ్ లెమర్' అనే పేరుపెట్టారు!
 • ఇది కేవలం పావుకిలో బరువు, 20 అంగుళాల పొడవుంటుంది. గుండ్రని కళ్లు, చిక్కని బొచ్చు, పెద్ద పెద్ద చెవులతో ఉండే వీటి శరీరం ముదురు ఎరుపురంగులో ఉంటుంది.
 • ఇవి రాత్రిళ్లు మాత్రమే తిరుగుతాయి. అడవిలో దట్టమైన పొదలపై వీటి కాపురం. చలికాలంలో సోమరిగా నెలలకొద్దీ చెట్లపైనే గడుపుతాయి. మిగితా కాలాల్లో మాత్రం చాలా చురుగ్గా ఉంటాయి!
 • వీటి పోలికలు మిగతా లెమర్ల పోలికలకు దగ్గరగానే ఉన్నా, ఓ పట్టాన మనుషుల కంట పడవు. తప్పించుకుపోయే తత్వం ఎక్కువ. అందుకే ఇవి ఎలా జీవిస్తాయో ఎక్కువగా తెలుసుకోవడానికి వీలు కాలేదు.
 • ఈ బుల్లి జీవులకు ఇప్పుడు ముప్పువాటిల్లింది. వీటి సంఖ్య చాలా తక్కువ. దాదాపు 50 వరకే ఉన్నాయి! అంతరించిపోయే దశకు చేరాయి.
 • మడగాస్కర్ దీవిలో స్థానిక భాషలో 'లెమర్' అంటే దెయ్యం అని అర్థం.
 • వీటిల్లో అతిపెద్దది ఇంద్రి. ఏడున్నర కిలోల వరకు బరువు పెరుగుతుంది.
 • చిన్నది డ్వార్ఫ్ మౌస్. ఇది కేవలం 10 గ్రాముల బరువుంటుంది.

బయటి లంలెకు