"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

లింగాల (మండవల్లి)

From tewiki
Jump to navigation Jump to search
లింగాల (మండవల్లి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మండవల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషులు 1,155
 - స్త్రీలు 1,186
 - గృహాల సంఖ్య 722
పిన్ కోడ్ 521325
ఎస్.టి.డి కోడ్ 08674

లింగాల కృష్ణా జిల్లా, మండవల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 325 ., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

లింగాల గ్రామం 214వ నెంబర్ జాతీయ రహదారిలో ముదినేపల్లి నుంచి భీమవరం వెళ్ళు మార్గమును ఆనుకొని ఉంది. ముదినేపల్లికి సుమారు ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది.

సమీప గ్రామాలు

గుడివాడ, హనుమాన్ జంక్షన్, ఏలూరు పెడన

సమీప మండలాలు

కైకలూరు, ముదినేపల్లి, కలిదిండి, నందివాడ

గ్రామానికి రవాణా సౌకర్యాలు

విజయవాడ - భీమవరము రాష్ట్ర రహదారి ముఖ్య రవాణా మార్గము. రైలు మార్గము ద్వారా కైకలూరు చేరి అటుపై రోడ్డు ద్వారా ఈ ఊరు చేరవచ్చు. మొఖాసాకలవపూడి లేదా పుట్లచెరువు రైల్వే స్టేషన్లలో దిగినా దగ్గరగానే ఉంటుంది. మండవల్లి, అల్లూరు నుండి రోడ్దువరాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు

  1. కంటి పరీక్షా కేంద్రo:- ఈ గ్రామంలో, 18 నెలల క్రితం, మల్లవరపు వెంకటప్పయ్య, మాణిక్యమ్మల ఙాపకార్ధం, ఆశ్రమ ఫౌండేషన్ మరియూ ఎల్.వి.ప్రసాద్ నేత్రసంస్థ సహకారంతో, గ్రామీణ కంటి పరీక్షా కేంద్రాన్ని స్థాపించారు. ఈ కేంద్రములో ఇప్పటివరకు, ఈ గ్రామస్తులకేకాక, చుట్టుపక్కల 3,000 మంది గ్రామస్తులకు చికిత్స అందించారు. దీనికి సహకారం అందించిన శ్రీ జి.ఎన్.రావుకు, 2014,డిసెంబరు-27వ తేదీనాడు గ్రామంలో సన్మానం నిర్వహించెదరు. [6]
  2. పోస్టాఫీసు.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

గ్రామంలో రాజకీయాలు

ఈ గ్రామం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గము, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గమునకు చెందినది.

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. ఈ గ్రామ ప్రాశస్త్యము, అక్కడి "దేవీతల్లి" అమ్మవారి దసరా ఉత్సవములు. సుమారు 65 సంవత్సరముల నుండి ఈ ఊరిలో దసరా నవరాత్రులు అత్యంత వైభవముగా జరుగుతున్నవి. ఊరి లోని వైశ్యులు, కాపులు నాయకత్వము వహించి, నిర్వహించు ఈ ఉత్సవములు వీక్షించుటకు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు వచ్చెదరు.ఇందులో ముఖ్య ఆకర్షణ హరికథ,బుర్రకథ, కోలాటము వంటి సాంసృతిక కార్యక్రమాలు జరుపుతారు.
  2. ఈ ఊరిలో కృష్ణ జయంతి ఉత్సవములు యాదవులు జరుపుతారు.

ఈ గ్రామంలో రు.10 లక్షలతో పునర్నిర్మించిన శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, 2013 నవంబరు 20, బుధవారం నాడు, వైభవోపేతంగా నిర్వహించారు. నాగసుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, రాహువు, కేతువు, నాగబంధం విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. తరువాత 5 వేలమందికి అన్నసమారాధన జరిగింది. [2]

  1. శ్రీ గంగా విశాలక్ష్మీ సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం.- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం, 2016,మే-20వ తేదీ శుక్రవారం, వైశాఖ శుద్ధచతుర్దశి రాత్రి, నయనానందకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండియే ప్రత్యేకపూజలు, అభిషేకాలు, లింగార్చనలను నిర్వహించారు. స్వామి, అమ్మవారలను ప్రత్యేకంగా అలంకరించారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించి, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. రాత్రి 8 గంటల్కు కళ్యాణం ప్రారంభమై, అర్ధరాత్రి వరకు ప్రత్యేకపూజలతో కళ్యాణ మహోత్సవం సాగినది. ఈ కార్యక్రమానికి లింగాల గ్రామం చుట్టుప్రక్కల గ్రామాలనుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవారలను దర్శించుకొని తీర్ధప్రసాదాలను స్వీకరించారు. 22వ తేదీ ఆదివారంనాడు, కళ్యాణ దంపతులకు పుష్పోత్సవం అనంతరం గ్రామోత్సవం, రాత్రికి పవళింపుసేవ తదితర కార్యక్రమాలు నిర్వహించెదరు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు

పూర్తిగా వ్యవసాయము పై ఆధారపడిన ఈ ఊరి ప్రజల ముఖ్య ఎగుమతి వరి. కృష్ణా నది పై విజయవాడ వద్ద గల ప్రకాశం వంతెన నుండి ప్రారంభమైన ఎడమ కాలువ ఈ ఊరి రైతులకు అన్నపూర్ణగా వారి అభివృద్ధికి తోడ్పడుతున్నది.చేపలు ఇక్కడి నుంచి కలకత్తా వంటి నగరాలకు ఎగుమతి అవుతాయి.

గ్రామంలో ప్రధాన వృత్తులు

ఈ గ్రామంలో చాలా ప్రదేశములలో ఆయిల్ దొరుకుతుంది. దీనిని ఆధారము చేసుకోని చాలా వ్యవస్థలు నడుపుతున్నారు.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2442.[2] ఇందులో పురుషుల సంఖ్య 1237, స్త్రీల సంఖ్య 1205, గ్రామంలో నివాస గృహాలు 623 ఉన్నాయి.
జనాభా (2011) - మొత్తం 2,341 - పురుషుల సంఖ్య 1,155 - స్త్రీల సంఖ్య 1,186 - గృహాల సంఖ్య 722

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mandavalli/Lingala". Archived from the original on 5 సెప్టెంబర్ 2017. Retrieved 4 July 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.

వెలుపలి లింకులు

[2] ఈనాడు కృష్ణా, 2013,నవంబరు-21;. 6వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-26; 7వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2016,మే-22; 3వపేజీ.