"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

లీలావతి గణితంలో వివిధ మానాలు

From tewiki
Jump to navigation Jump to search

లీలావతి గణితంలో వివిధ ప్రాచీన మానాలను రెండవ ప్రకరణంలో ఈ విధంగా వివరించటం జరిగింది.

రాజముద్రా పరిభాషా

వరాటకానాం దశక ద్వయం యత్ సా కాకిణీ తాశ్చ పణశ్చ తస్రః
తే షోడశద్రమ్మ ఇహావహమ్యో, ద్రమ్మ్తె స్తదా షోడశ భిశ్చ నిషః||
తాత్పర్యం:
అంశం అర్థం
20 గవ్వలు =1 కాకిణీ
4 కాకిణులు =1 పణం
16 పణాలు =1 ద్రమ్మం
16 ద్రమ్మాలు =1 నిష్కం (స్వర్ణముద్ర)
వ్యాఖ్య:

కొలతలు, తూనికలు, తదితర మానాలు గణితానికి ఆధారభూతమైనవి. ఇవి దేశ కాలాల్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ కాలంలో వివిధ ప్రాంతాలలో ప్రచారంలో ఉన్న వేర్వేరు మానాల్ని లీలావతి గణితంలో వివరించటం జరిగింది. ముందుగా ద్రవ్యమానం. ఆనాడు చలామణిలో ఉన్న నాణాల సంగతి ఈ శ్లోకం తెలియజేస్తుంది.

తౌల పరిభాషా

తుల్యా యవాభ్యాం కథితా ఽ త్ర గు ఞ్జా వల్లస్త్రి గుఞ్జో ధరణంచ, తే ఽష్టౌ
గద్యాణక స్తద్ ద్వయ మిన్దృతుల్యై, ర్వల్లై స్తధైకో ధటక ప్రదిష్టః ||
తూకాలకు మానం:
అంశం అర్థం
2 యవలు =1 గుంజ (రత్తి) *
3 గింజలు =1 వల్ల**
8 వల్లలు =1 ధరణం
2 ధరణాలు =1 గద్యాణకం
14 వల్లలు =1 థటకం
  • యవ=బార్లీధాన్యం వంటిది; గుంజ = గురువింద గింజ; **వల్ల శబ్దం కాలక్రమేణా బల్ల గా రూపొంది ఉండవచ్చు.

సువర్ణాది తౌల పరిభాషా

దశాద్దగుంజం ప్రవదన్తిమాషం మాషాహ్యయైః షోడశబిశ్చ కర్షమ్
కర్షైశ్చ తుర్బిశ్చ పలం తులాజ్ఞాః కర్షం సువర్ణస్య సంజ్ఞమ్||
అంశం అర్థం
5 గుంజలు =1 మాష
16 మాషలు =1 కర్షం
4 కర్షలు =1 పలం
  • "సువర్ణం" అనేది ఒక కర్షం బంగారానికి సంజ్ఞ. (యిటీవల దాకా " కాసు " అని వ్యవహారంలో ఉండేది)

దైర్ఘ్య మాన పరిభాషా

యవోదరై రంగుళ మష్ట సంఖై ర్హస్తోంగులైః షడ్గుణీ తైశ్చతుర్భిః
హస్తైశ్చతుర్భి ర్భవతీహ దణ్ణః క్రోశః సహస్ర ద్వితయెన తేషామ్||
పొడవులకు కొలమానం:
అంశం అర్థం
8 యవోదరాలు =1 అంగుళం
24 అంగుళాలు =1 హస్తం
4 హస్తాలు =1 దండం
2000 దండాలు =1 క్రోసు (1 కోసు)
  • " హస్తం" ఈనాటి సుమారు 20" కు లేదా 50 సెం.మీ. లకు సమానం.
  • "క్రోశం" రెండు మైళ్ల కన్న ఎక్కువ అంటే సుమారు 4 కిలో మీటర్లు.
  • 8 బార్లీ గింజల వెడల్పు లేదా 3 వడ్ల గింజల పొడవు ఒక అంగుళమని గణేశుడు తన వ్యాఖ్యానంలో ఉటంకించాడు.

పెద్ద పొడవులు - విస్తీర్ణాలు

స్యాద్యోజనం క్రోశ చతుష్ట యేన తథా కరాణాం దశ కేన వంశః
నివర్తనం వింశతి వంశ సంఖైః క్షేత్రం చతుర్భిశ్చ భుజైర్నిబద్ధమ్||
పెద్ద పొడవులు - విస్తీర్ణాలు:
అంశం అర్థం
4 కోసులు =1 యోజనం
10 హస్తాలు =1 వంశం (వెదురు)
20 వంశాలు భుజం కలిగిన తతురస్ర వైశాల్యం
అనగా 400 చదరపు వంశాలు
=1 నివర్తనం

ఘన హస్తాది పరిభాషా

హస్తోన్మిత్తైర్విస్తృతి దైర్ఘ్యపిండై
ర్యద్ ద్వాదశాస్త్రం ఘనహస్తసంజ్ఞమ్
ధాన్యాదికే యద్ ఘనగస్తమానం
శాస్త్రోదితా మాగధ ఖారికా సా||

12 అంచులతో, పొడవు, వెడల్పు, ఎత్తు ఒక్కొక్క హస్తం చొప్పున ఉంటే ఆయతనాన్ని ఒక ఘనహస్తం అంటారు. దీన్ని ధాన్యాదులు కొలిచేందుకు ఉపయోగిస్తారు. మగధ దేశంలో (యిప్పటి దక్షిణ బీహార్ ప్రాంతం) శాస్త్రోక్తంగా వాడుకలో ఉన్న ఈ కొలతకు " ఖారీ " అని పేరు.

1 ఘన హస్తం = 1 ఖారీ