"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

లెవెల్ క్రాసింగ్

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Manned level crossing.jpg
కరీంనగర్ జిల్లాలో ఒక రైల్వే క్రాసింగ్

లెవెల్ క్రాసింగ్ లేక రైల్వే రోడ్ క్రాసింగ్ అనగా రైలుమార్గం దాటే ఒక కూడలి. ఇక్కడ ఒకే స్థాయిలో రైల్వే లైన్‌కు అడ్డంగా రహదారి లేదా కాలిబాట ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా రైల్వే లైన్ ను దాటేందుకు ఓవర్ బ్రిడ్జి లేదా అండర్ బ్రిడ్జి లేదా సొరంగ మార్గాన్ని ఉపయోగిస్తారు. లెవెల్ క్రాసింగ్ కు ఇతర పేర్లు రైల్వే క్రాసింగ్, గ్రేడ్ క్రాసింగ్, రోడ్ త్రో రైల్‌రోడ్, రైల్‌రోడ్ క్రాసింగ్, ట్రైన్ క్రాసింగ్.

అవలోకనం

ప్రారంభ లెవెల్ క్రాసింగ్స్ రైలు విధానంలో మొత్తం ట్రాఫిక్ ను ఆపడానికి, ట్రాక్లను క్లియర్ చేయడానికి బూత్ కి సమీపంలో ఒక ప్లాగ్‌మెన్ ఉంటాడు, అతను ఎరుపు జెండాను లేదా లాంతరు ఊపటం ద్వారా ట్రాఫిక్ ను ఆపి ట్రాక్స్ క్లియర్ చేస్తాడు. తరువాత మానవీయంగా లేదా విద్యుత్ ద్వారా ట్రాఫిన్ ను నిర్వహించే బారికేడ్లు ప్రవేశపెట్టబడ్డాయి. వీటి ద్వారా సందర్భాన్ని బట్టి దారిని మూసివేయడం లేక తెరవడం ద్వారా ట్రాఫిక్ ను నియంత్రిస్తారు. రైల్వేల ప్రారంభ రోజుల్లో పశువులతో రోడ్డు ట్రాఫిక్ అధికంగా ఉండేది. ఈ అడ్డంకిని అధిగమించడానికి బారియర్ అవసరమయింది. బారికేడ్ల ద్వారా ట్రాఫిక్ ను కంట్రోలు చేయడం ప్రారంభమయింది. ఇటువంటి క్రాసింగ్ గేట్ల కొరకు మొదటి యు.ఎస్ పేటెంట్ బోస్టన్ కు చెందిన జె.నాసన్, జె.ఎఫ్.విల్సన్ ఇద్దరికి 27-08-1867 న ప్రదానం చేశారు.