"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
లోకనాథం నందికేశ్వరరావు
లోకనాధం నందికేశ్వరరావు LOKANADAM NANDIKESWARARAO | |
---|---|
![]() లోకనాధం నందికేశ్వరరావు | |
జననం | లోకనాధం నందికేశ్వరరావు 1952 జులై 25 బాదులపేట,కలెక్టరు బంగ్లా దరి శ్రీకాకుళంపట్టణం, శ్రీకాకుళం జిల్లా |
నివాస ప్రాంతం | బాదులపేట,కలెక్టరు బంగ్లా దరి శ్రీకాకుళంపట్టణం, శ్రీకాకుళం జిల్లా |
ఇతర పేర్లు | మిమిక్రీ నందికేశ్వరరావు |
వృత్తి | చిత్రలేఖనోపాధ్యాయుడు |
ఉద్యోగం | విశ్రాంత చిత్రలేఖనోపాధ్యాయుడు |
ప్రసిద్ధి | మిమిక్రీ కళాకారుడు వెంట్రిలాక్విజం కళాకారుడు |
మతం | హిందూ |
పిల్లలు | లేరు |
తండ్రి | రామలింగేశ్వరస్వామి |
తల్లి | అన్నపూర్ణ |
లోకనాథం నందికేశ్వరరావు ఉత్తారాంధ్ర కు చెందిన మిమిక్రీ కళాకారుడు. [1] సంప్రదాయ కళల్లో మిమిక్రీ ఒకటి. ధ్వని అనుకరణ ద్వారా ప్రేక్షకులను నవ్వించి పరవశులను చేసింది ఈ కళ. ఉత్తరాంధ్రలో ఈ కళలో రాణించిన మొదటి వ్యక్తి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన .నాలుగు దశాబ్దాలుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలలో తనదైన గుర్తింపును స్వంతం చేసుకున్నాడు. దేశంలో ఆయన యిప్పటి వరకు సుమారు ఐదు వేల ప్రదర్శనలిచ్చాడు. తన విజయాల వెనుక తన భార్య హిమాలయ కుమారి సహకారం ఎంతో ఉందని చెప్పుకునే ఆయన వృత్తి రీత్యా చిత్రలేఖనోపాధ్యాయుడు. 1979 లో వీరఘట్టం ఉన్నత పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఆయన కింతలి, కోటబొమ్మాళి, లోలుగు, కింతలి, తొగరాం ఉన్నతపాఠశాలలలో పనిచేసి 2009 లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దూసిపేట నందు పదవీవిరమణ చేసాడు.
Contents
బాల్యం,విద్యాభ్యాసం '
శ్రీకాకుళం పట్టణంలో లోకనాథం రామలింగేశ్వర స్వామి, అన్నపూర్ణ దంపతులకు 1952 జూలై 25న జన్మించాడు. తన తండ్రి నాటక రంగంలో ఉండేవాడు. ప్రాథమిక విద్య స్థానిక బాదుల పేటలోను, ఉన్నత విద్య శ్రీకాకుళం మ్యునిసిపల్ ఉన్నత పాఠశాలలోను, బి.కాం డిగ్రీని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు అభ్యసించి కాకినాడ నందు డ్రాయింగ్ నందు శిక్షణ పొందాడు.
మిమిక్రీ కళాకారునిగా
పాఠశాల వయస్సు నుండే నందికేశ్వర రావుకు మిమిక్రీ పట్ల ఆసక్తి కలిగింది. రక్తకన్నీరు నాటకంలో ప్రముఖ నటుడు నాగభూషణం డైలాగులను అనుకరించటం ద్వారా తన కళాప్రస్థానాన్ని ప్రారంభించాడు. పాఠశాలలో పక్షులు, జంతువులు, వాహనాల శబ్దాలను అనుకరిస్తూ ఉపాద్యాయుల మన్ననలు పొందాడు. 1971 లో విశాఖకు చెందిన గణపతి రాజు రామరాజు సలహా మేరకు ఆయన మిమిక్రీ కళపై పూర్తి స్థాయి దృష్టి సారించాడు. సినిమా థియేటర్లకు వెళ్ళి డైలాగులు వినటం, అనుకరించటం అలవాటుగా మార్చుకున్నాడు. తెలుగు భాషపై పట్టు ఉంటే మరింత రాణించవచ్చనే మిత్రుల సలహా మేరకు ఆయన తెలుగు భాషపై పట్టు సాధించాడు. అలాగే వెంట్రిలాక్విజం నేర్చుకొని కృష్ణా జిల్లావరకు ప్రదర్శనలిచ్చాడు. రచయితగా, నటుడిగా, చిత్రకళోపాధ్యాయునిగా, ప్రసిద్ధ ధ్వన్యనుకరణ కళాకారునిగా పేరు పొందిన అతను డా.నేరెళ్ళ వేణుమాధవ్ స్ఫూర్తితో స్వర మాంత్రికుని ఏకలవ్య శిష్యునిగా పదిహేనేళ్ళ ప్రాయంలోనే ధ్వనులను అనుకరించటం ప్రారంభించాడు. పాత శ్రీకాకుళంలో తన యింటి దరి చెట్లపై పొద్దున్నే పక్షుల కిలకిల రావాలను పరిశీలన చేసేవాడు. నిరంతర సాధనతో మిమిక్రీ కళాకారునిగా పేరుపొంది ఎందరో శిష్యులను తయారు చేసాడు. ఆయనకు మిమిక్రీ శ్రీనివాస్, సూర్యారావు లతో బాటు అనేక మంది శిష్యులున్నారు.
సాధించిన విజయాలు, సన్మానాలు, సత్కారాలు
- 1984 లో తొలిసారి జాతీయ కళాకారునిగా గుర్తింపు పొందాడు.
- సిమ్లాలో ప్రదర్శన నిస్తుండగా అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు జాతీయ కల్చరల్ అసోషియేషన్ సభ్యునిగా నియమించాడు.
- ఉత్తమ మిమిక్రీ కళాకారునిగా ఎనిమిది సార్లు పురస్కారాలు, రాష్ట్ర స్థాయిలో మూడు బంగారు పతకాలు అందుకున్నాడు.
- మిమిక్రీ కళను క్యాసెట్ల ద్వారా ప్రజలకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి ఆయన. 22 క్యాసెట్లను వివిధ ప్రక్రియలలో చేసి విడుదల చేసాడు.
- ఆంధ్ర, ఒడిషా, తమిళనాడు, కేరళ, భూపాల్, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హిమాచల ప్రదేశ్ లలో తన ప్రదర్శనలిచ్చాడు.
- మాజీ ముఖ్య మంత్రి.ఎన్.టి.రామారావు చే ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర కళాకారునిగా సత్కారం పొందాడు.
- జిల్లాలో పలు సంస్థలు ఆయనకు అనేక సార్లు అవార్డులనిచ్చి సత్కరించాయి.
- ఆలిండియా రేడియోలో అనేక ప్రదర్శనలిచ్చాడు.
- క్లియోపాత్రా నాటకంలోని ఏంటొని స్పీచ్ ను తన అనుకరణ ద్వారా ప్రేక్షకులకు వినిపించటమే కాక క్యాసేట్ కూడా తయారు చేసాడు.
- పలు సాంఘిక నాటకాలలో నటించి తన ప్రతిభను చాటుకున్నాడు.
- ఎనిమిదవ తరగతి లో ఉండగానే 'విముక్తులు ' అనే నాటకంలో నటించి ఉత్తమ బాల నటుని అవార్డును స్వతం చేసుకున్నాడు.
- ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులైన జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, ఎన్.టి.రామారావు, నారా చంద్రబాబునాయుడుల ద్వారా అనేక సార్లు సన్మానించ బడ్డాడు.
- అప్పటి రాష్ట్ర గవర్నర్ కుముదబెన్ జోషి చేతుల మీదుగా సన్మానించ బడ్డాడు.
- అప్పటి కేంద్ర మంత్రి కె.యర్రంనాయుదు చెతుల మీదుగా సన్మానించ బడ్డాడు.
- అనకాపల్లి, రాజమండ్రి, పొద్దుటూరు, హైదరాబాద్ సభలలో ఆయనకు బంగారు పతకాలు వచ్చాయి.
- తన ప్రదర్శనలలో జాతర, ట్రిపుల్ మ్యూజిక్, ఓంకారం, రుద్రవీణ, రామాయణ మహాభారత యుద్దాల ప్రక్రియలు అనేక అవార్డులు తెచ్చి పెట్టాయి.
- ఆయన 'నవ్వుల పల్లకి ' అనే టెలిఫిలిం ను రచించి, నిర్మించి నటించారు. ఇది స్థానిక సిటి కేబుల్ ద్వారా ప్రదర్శించ బడింది.
- ఆయన రచించిన ' అక్షరం శరణం గచ్చామి" అనే టెలి ఫిలిం డి.డి.1 ద్వరా ప్రదర్శించబడింది.
- ఆయన నిర్మించిన 'ప్రగతికి పంచ సూత్రాలు ' అనే టెలిఫిలిం స్థానిక సిటి కేబుల్ ద్వారా ప్రదర్శించ బడింది.
- ఆయనకు పిల్లలంటే ఎంతో యిష్టం. ఆ మమకారంతోనే పిల్లలను నవ్వించి వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి 2003 లో స్థానిక రివర్ వ్యూ పార్క్ వద్ద చిల్డ్రన్ లాఫింగ్ క్లబ్ ను ఏర్పాటు చేసారు.
- 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఉగాది పురస్కారం.[2]
మూలాలు
ఇతర లింకులు
- All articles with dead external links
- Articles with dead external links from ఏప్రిల్ 2020
- Articles with permanently dead external links
- Articles with dead external links from మార్చి 2020
- కళాకారులు
- మిమిక్రీ కళాకారులు
- 1952 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- శ్రీకాకుళం జిల్లా మిమిక్రీ కళాకారులు
- శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయులు