"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వంగర వెంకటసుబ్బయ్య
వంగర వెంకటసుబ్బయ్య | |
---|---|
200px వంగర వెంకటసుబ్బయ్య | |
జననం | నవంబరు 24, 1897 సంగం జాగర్లమూడి, ఒంగోలు తాలూకా |
మరణం | 1975 దుగ్గిరాల |
మరణ కారణము | పక్షవాతం |
ప్రసిద్ధి | రంగస్థల, చలనచిత్ర హాస్య నటుడు |
భార్య / భర్త | అధిసేషమ్మ |
తండ్రి | కోటయ్య |
తల్లి | వెర్రెమ్మ = |
వంగర వెంకట సుబ్బయ్య (నవంబరు 24, 1897 - 1975) (Vangara Venkata Subbaiah), తెలుగు సినిమా, నాటక రంగాలలో వంగర గా ప్రసిద్ధుడైన హాస్యనటుడు .
Contents
జననం
ఈయన ఒంగోలు తాలూకా సంగం జాగర్లమూడిలో 1897, నవంబరు 24 న జన్మించాడు.
రంగస్థల ప్రస్థానం
తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకుని, స్థానం వారితో చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నాడు. ఈయన ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించాడు.
చలనచిత్రరంగ ప్రస్థానం
1937లో విప్రనారాయణ చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. తరువాత బాలయోగిని చిత్రంలో ప్రధాన భూమికను పోషించాడు. ఈయన ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించాడు. వీటిలో పెద్దమనుషులు, కన్యాశుల్కం, లక్ష్మమ్మ, ప్రియురాలు, లక్ష్మి, చక్రపాణి, పల్నాటి యుద్ధం, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ తులాభారం, గీతాంజలి, మంత్రదండం, పేరంటాలు, శాంతి, సక్కుబాయి ముఖ్యమైనవి.
మరణం
1975లో మరణించారు.
చిత్రసమాహారం
- పరమానందయ్య శిష్యుల కథ (1966)
- బభృవాహన (1964)
- నర్తనశాల (1963)
- తిరుపతమ్మ కథ (1963)
- భీష్మ (1962)
- మహాకవి కాళిదాసు (1960)
- శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
- చెంచులక్ష్మి (1958)
- మాంగల్యబలం (1958)
- మాయాబజార్ (1957) .... శాస్త్రి
- పాండురంగ మహాత్మ్యం (1957)
- తెనాలి రామకృష్ణ (1956)
- ఏది నిజం (1956) ....పూజారి
- కన్యాశుల్కం (1955) .... కరటక శాస్త్రి
- పెద్దమనుషులు (1954)
- ధర్మదేవత (1952) .... దువ్వ
- మల్లీశ్వరి (1951)
- షావుకారు (1950)
- లక్ష్మమ్మ (1950)
- మనదేశం (1949)
- రక్షరేఖ (1949)
- పల్నాటి యుద్ధం (1947) .... సుబ్బన్న
- రైతుబిడ్డ (1939)
- మాలపిల్ల (1938)
- బాలయోగిని (1936)
మూలాలు
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 2005.
- నటరత్నాలు, డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, సీతారత్నం గ్రంథమాల, విజయవాడ, 2002, పేజీలు: 434-436.
బయటి లింకులు
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- All articles with dead external links
- Articles with dead external links from జూలై 2020
- Articles with permanently dead external links
- తెలుగు సినిమా హాస్యనటులు
- తెలుగు రంగస్థల నటులు
- 1897 జననాలు
- 1976 మరణాలు
- నటులు
- కళాకారులు
- తెలుగు నటులు
- తెలుగు కళాకారులు
- తెలుగు సినిమా నటులు
- తెలుగు రంగస్థల కళాకారులు