"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వక్తృత్వం

From tewiki
Jump to navigation Jump to search

వక్తృత్వం అనగా ఏదైనా విషయము గురించి ఆసక్తికరంగా మాట్లాడటం లేక ఉపన్యాసము చేయడం. తోటివారిపై ప్రభావం చూపడంలో, ఇది చాలా ఉపయోగం. చర్చ లాంటి కార్యక్రమాలలో కూడా ఈ కళ తెలిసినవారు చాలా సులభంగా ఇతరులను ఆకట్టుకుంటారు. అందువలన, పాఠశాల స్థాయినుండే విద్యార్థులలో వేదిక భయము పోగొట్టటానికి, వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తారు.

సాధారణ భావ ప్రసరణ కంటే ఈ విషయంలో ఉపన్యాసకులు పదాలను సరిగా పలకడం, సరిగా బట్టలు వేసుకోవడం, నిలబడడం, సంజ్ఞలు వాడడంపై ధ్యాసపెడతారు. ప్రతి సంవత్సరం జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పోటీలు జరుగుతాయి.

నైపుణ్యతని పెంచుకోవటానికి సూచనలు

  • విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవటం.
  • ఉపన్యాసాన్ని తయారుచేసుకోవడం
  • సమయపాలనకి, పొరపాట్లు దొర్లకుండా వుండటానికి, ముందుగా ప్రాక్టీస్ చేయడం.
  • టోస్ట్ మాస్టర్ సంఘంలో సభ్యులుగా చేరటం

ఇవీచూడండి

వనరులు