వచన కవిత్వం

From tewiki
Jump to navigation Jump to search

పాతకాలం పద్యమైతే వర్తమానం వచనగేయం అని ఎలుగెత్తి చాటిన వచన కవితోద్యమకారుడు కుందుర్తి ఆంజనేయులు గారు అన్నారు.పద్యానిదే పై చేయిగా ఉన్నరోజుల్లో ఛందస్సు పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు కుందుర్తి. వచన కవిత అనేది పాశ్చ్యాత్య కవితా ప్రభావం వల్ల వచ్చింది.దీనిని ఫ్రీ వర్స్ అంటారు. ఫ్రీ అంటే అన్ని సంకెళ్ళను తెంచుకుని, స్వేచ్చగా భావాన్ని వెల్లదించే ధోరణి.వచన కవిత ప్రజలకి చెప్పడానికి చాలా అనువైన రూపం.

తెలుగు కవిత్వానికి పద్యమే దిక్కు అన్న మాటను అంగీకరించకుండా, కొత్త ధోరణుల్లో తెలుగు కవితా ప్రక్రియలకు శ్రీకారం చుట్టాలన్న తపనతో యువ కవులు చేసిన ప్రయోగమే వచన కవిత.


కుందుర్తి ఆంజనేయులు వచన కవితా పితామహుడుగా ప్రసిద్దుడయ్యాడు. పద్యమే కవిత్వమని అపోహ పడేవారికి ఆధునిక కాలానికి వచనమే తగినదని నిరూపించే దశలో కుందుర్తి 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ ను స్థాపించాడు.

వచన కవిత్వ లక్షణాలు

 • వచన కవితలో గేయ కవిత లాగా మాత్ర చందస్సు కూడా నిబద్దం కాదు.
 • కాలం మారిన దశలో పాత కవి సంప్రదాయలను, అలంకారాలను వచన కవిత తిరస్కరించింది
 • సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితా వస్తు నిర్మాణం వచన కవితకు ప్రత్యేకం.
 • చందో విముఖతను ప్రాణంగా కలిగిన వచన కవిత భావుకతకు ప్రాధాన్యత నిచ్చింది.
 • ఆకర్షణీయమైన అంత్య ప్రాసలు వచన కవితకు అలంకారాలయ్యాయి.
 • చమత్కారమైన అధిక్షేపణ వచన కవుల సొత్తు.
 • గతులు, యతి, ప్రాస మొదలైన చందస్సుకి సంబందించిన నియమాల్ని విడిచి పెట్టడం.
 • పూర్తిగా ప్రజలు వాడుకునే వ్యావహారిక భాషకు ప్రాధాన్యం ఇవ్వడం.
 • వాక్యాల్ని మాట్లాడుకునే క్రమంలోనే రాయడానికి అవకాశం రావడం.
 • ఎటువంటి శిల్పానికైనా ఏ కష్టం లేకుండా ప్రయోగించడం
 • పాదాలుగా విరవడంలో ఒక్కొక్క సంపూర్ణ భావానికి ప్రాధాన్యమివ్వడం[1].

వచనకవితలో అనవసర పదాలు, పదాడంబరం ఉండవు. జనజీవితంలోని అలంకారాలకు ప్రాధాన్యత ఇవ్వడం వచన కవుల ప్రత్యేకత. ఆధునిక కవుల్లో అద్భుతమైన వచన కవితలు రాస్తున్నవారిలో కె.శివారెడ్డి, నందినీ సిధారెడ్డి, ప్రేంచంద్, అఫ్సర్ వంటి కవులు వచన కవితా ప్రక్రియకు వన్నెలు తెస్తున్నవారు. ఇప్పుడు అందరూ వచన కవిత రాయదానికే ఇష్టపడుతున్నారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ వచన కావ్యానికి పురస్కారాన్ని ప్రకటించి వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేస్తోంది.

మరింత సమాచారం

వచన కవితా ఖండికలే కాక, దీర్ఘ కవిత కూడా వచన కవితా పరిణామంలో ఒక ముఖ్య భాగమయింది[2].


కుందురి దృష్ఠి పూర్తిగా సామాజిక వస్తుపరమైనది. సమాజం లోని సమస్యల్ని మాత్రమే వచన కవితలో చెప్పాలని కుందుర్తి వాదం. 'వచన గేయం ఒక ఉద్యమం' అనే వ్యాసంలో ఆయన ఇలా అంటారు

'ప్రజా జీవితాలను సర్వసమగ్రంగా చిత్రించే ప్రయత్నించడం ఆధునిక కవితా లక్షణం. అందుకే వచన గేయాన్ని ఆశ్రయించవలసివచ్చింది. సంఘంలో పై అంతస్తులంకు మాత్రమే పరిమితం కాకుండా, కిందికిదిగి సామాన్య ప్రజల మధ్య నిలబడి చిత్ర విచిత్ర మైన, బహు క్లిష్టమైన, ఆధునిక జీవితంలోని వివిధ ఘట్టాలను వర్ణిచాలంటే, అది ఒక వచన గేయమే చేయగలదు!


వచన కవితలో ఉన్న మరో అభివ్యక్తి అవకాశాన్ని కూడా కుందుర్తి చెప్పాడు. అది 'విసురూ' అనే లక్షణం. భావాన్ని తీవ్రతతో చెప్పవలసి వచ్చినప్పుడు, దీర్ఘ వాక్యాల విరుపులు, పాదాల చివర క్రియా పదాలు కుండ పోతగా వచ్చే ఉపమానాలు మొదలైన వాటి వరుసలు ఈ విసురును ప్రతిబింబిస్తాయి[3] [4].


విసురూ కాకుండా 'భావలయా' అనే మరో లక్ష్ణాన్ని కూడా వచన కవితలో ఉండాలని కుందుర్తి చెప్తాడు.' చందస్సుకి సంబంధించిన లయలో కాకుండా, భావాలు తీర్చడంలో, లయ' భావలయా. దీని కుదాహరణగా కుందుర్తి చెప్పిన నాలుగు పాదాలు

'నాకీలోకం మీద అంతగా మమకారం లేకపోయినా

ఇదిమాత్రం నన్నొదిలేట్లులేదు

లోప్పలు ఎత్తి చూపితే ప్రయోజనం లేకపోయినా

ఈ కవిత్వపు పాటలవాటుతో మనసేఊరుకోదూ

మూలాలు