"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వత్సనాభి

From tewiki
Jump to navigation Jump to search

వత్సనాభి
Aconitum ferox - Köhler–s Medizinal-Pflanzen-005.jpg
ఎకోనిటమ్‌ ఫెరాక్స్
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
A. ferox
Binomial name
Aconitum ferox

మూస:Taxonbar/candidate

వత్సనాభి

వత్సనాభి,Indian Aconite

మానసికోల్లాసాన్ని సాధించడం ఎంతో సులువు. సక్రమ జీవనానికి మార్గాలైన శారీరక, మానసిక ఆరోగ్యాలకు మూలం... ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన ఔషధమొక్కలు. ఆ కోవకి చెందిందే వత్సనాభి.

ఇది రానంకులేసీ కుటుంబానికి చెందింది. దీని శాస్త్రీయ నామం అకోనిటమ్‌ ఫెరొక్స వాల్‌. ఇది బహు వార్షిక గుల్మం. దీనిని ఒక్కొక్క భాషలో ఒక్కో రకంగా పిలుస్తారు. ఆంగ్లంలో ఇండియన్‌ అకోనైట్‌, హిందీలో మీటావిష్‌, బచ్నాగ్‌, మళయాళంలో వత్సనాభి, సంస్కృతంలో ప్రాణహర, హాలాహల అని పిలుస్తారు. 2000-3000 మీటర్ల ఎత్తైన ప్రాంతాలలోనూ వత్సనాభి పెరుగుతుంది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాంచల్‌, జమ్మూకాశ్మీర్‌, సిక్కిం, పంజాబ్‌ రాష్ట్రాలలోని పర్వత ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ చెట్టు పొడవు 90 సెం.మీలు ఉంటుంది. ఆకులు అర్ధవర్తులాకారంలో ఉంటాయి. పువ్వులు నీలి రంగులో ఉంటాయి. వేర్లు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఫిబ్రవరి - మార్చి నెలలు వీటిసాగుకు అనువైన కాలం.

ఇందులో వివిధ రకాల ఆల్కాలైడ్స్‌ ఉన్నాయి. కస్మోవాకొనిటైన్‌, బిఖాకొనిటైన్‌, ఇండా కొనిటైన్‌, సూడో కొనిటైన్‌, బిఖా కొనైన్‌ టెట్రాసిటైల్‌ ఆల్కాలైడ్స్‌ ఇందులో మిళితమై ఉన్నాయి. ముఖ్యంగా వత్సనాభిమొక్కలో వేర్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఔషధ ఉపయోగాలు

దీని వేరు నుంచి తయారుచేసిన ఔషధం అల్సర్ల నివారణకు చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ వేరును నీళ్ళల్లో మరిగించి ఆ డికాక్షన్‌ను తాగితే జుట్టు రాలడం, తెల్లబడడం ఉండదు. తెగిన గాయాలకు, దెబ్బలకు దీని వేరుతో తయారుచేసిన ఔషధాన్ని పైపూతగా వాడితే తక్షణ ఉపశమనం ఉంటుంది. వేర్ల నుంచి తయారుచేసిన ఔషధాలు రక్తపోటును, డిస్‌పెప్‌సియా, అమెనోర్హియా, ఆర్ధరైటిస్‌, హెపటైటిస్‌, దగ్గు, ఆస్తమా లాంటి వ్యాధులకు మంచి దివ్యౌషధంగా పనిచేస్తుంది. అంతేకాక చర్మ సంబంధ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. దీని వేర్లతో తయారుచేసిన పొడిని తేనెలో కలిపి తింటే అజీర్తి, కడుపునొప్పి తగ్గుతుంది. దీని ఆకులను నీళ్ళల్లో బాగా మరగనిచ్చి డికాషన్‌లా తయారుచేసుకోవాలి. ఈ డికాషన్‌లో కొన్ని పాలు కలిపి తయారుచేసిన పానీయంతో తలనొప్పి, భుజాలు, పార్శ్శపు నొప్పులకు బాగా పనిచేస్తుంది. దీని తైలం అన్ని అవయవాల నొప్పులకు పనిచేస్తుంది. వత్సనాభితో తయారుచేసిన టానిక కండరాలలో శక్తిని, ఎముకలలో కాల్షియం శాతాన్ని పెంచడానికి, ఉపయోగపడుతుంది. ఇది ఆయుర్వేదంలో బాగా ప్రాచుర్యం పొందిన ఔషధం. గుణ రస వీర్య కణాలను వృద్ధి చేస్తుంది. దీనితో తయారుచేసిన ఔషధాలు కొన్ని హైలాండ్స్‌ టానిక జ్వరానికి, అల్‌షోక జుట్టు రాలకుండా, చుండ్రును తొలగిస్తుంది.

ఎన్‌.సిహెచ్‌. మానస @Andhraprabha News paper.

మూలాలు