"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వర్గం:పరిశీలించవలసిన గ్రామ పేజీలు

From tewiki
Jump to navigation Jump to search

ఇక్కడ మీరు చూస్తున్న పేజీల లింకులన్నీ, ఆయా పేజీలలో ఒక బాటు కొన్ని మార్పులు చేయటం వలన, చేరినవి. మీకు సమయం ఉంటే మీకు తెలిసిన గ్రామాల పేజీలను సందర్శించి, అక్కడ ఉన్న వివరాలను సరిగ్గానే ఉన్నాయని నిర్ధారించుకుని, ఆయా పేజీలలో ఉన్న {{తనిఖీ}} అనే మూసను తీసి వేయండి.

తనిఖీ చేయు విధానం

మీరు ఈ వర్గంలో ఉన్న వ్యాసాలను తనిఖీ చేస్తునప్పుడు, ఈ క్రింది సూచనలను పాటించండి.

  1. ఒకేసారి ఎక్కువ మంది ఈ వర్గంలో ఉన్న వ్యాసాలపై పనిచేస్తూ ఉండవచ్చు. దీనివలన కొంత అయోమయం రావచ్చు. అందుకని పైన ఉన్న అ ఆ ఇ ఈ లలో ఒక అక్షరాన్ని ఎంచుకొని ఆ అక్షరంతో మొదలయ్యే వ్యాసాల పై పని చేయడం మొదలు పెట్టండి.
  2. ఈ వర్గంలో ఉన్న కొన్ని పేజీలు మొదటగా మండలాల పేజీలు. మండలాలు కూడా గ్రామాలే కాబట్టి బాటు అదే గ్రామ వివరాలు చేర్చి తనిఖీ కోసం ఉంచింది. ఇలాంటి పేజీలలో బాటు చేర్చిన గ్రామ వివరాలను తీసేస్తే తనిఖీ పూర్తయిపోతుంది.
  3. ఈ వర్గంలో ఉన్న కొన్ని పేజీలలో కేవలం గ్రామాల వివరాలు మాత్రమే ఉండవచ్చు. అటువంటి పేజీలను అయోమయ నివృత్తి పేజీలుగా మార్ఛి, అందులో ఉన్న ప్రతీ గ్రామాన్ని దాని మండలం పేరుతో గుర్తిస్తూ ఇంకో కొత్త వ్యాసాన్ని సృష్టించండి. అయోమయ పేజీ ఎలా ఉండాలో క్రింద ఉన్న ఉదాహరణను చూడండి. గ్రామాన్ని మండలంతో గుర్తించడం అంటే, వ్యాసం పేరుగా, గ్రామంపేరుతో పాటు మండలం పేరును కూడా చేర్చటం అన్నమాట. క్రింద ఇచ్చిన ఉదాహరణలో మండలం పేరును, గ్రామం పేరుకు తరువాత ఒక ఖాళీ వదిలి బ్రాకెట్లలో మండలం పేరును చేర్చారు.
  4. ఈ వర్గంలో ఉన్న ఇంకొన్ని పేజీలలో మండలం వివరాలు మరియు గ్రామాల వివరాలు కలిసిపోయి ఉంటాయి. అలాంటప్పుడు ఆ పేజీని మండలాని సంబందించిన పేజీగా గుర్తించి, దానిని జిల్లాతో ప్రత్యేకంగా గుర్తించి ఆ పేజీకి తరలించండి. ఇలా చేయటం వలన అసలు పేజీ కాస్తా దారిమార్పు పేజీ మారిపోతుంది. ఆ అసలు పేజీని ఇప్పుడు అయోమయ నివృత్తి పేజీగా మార్చాలి. జిల్లా పేరుతో గుర్తించిన మండలం పేజీ నుండి బాటు చేర్చిన గ్రామాల వివరాలు తీసేసి, అయోమయ నివృత్తి పేజీగా మార్చబోతున్న పేజీలో చేర్చండి. తరువాత 3వ సూచనలో చెప్పినట్లు చేయండి. చివరిగా అయోమయ నివృత్తి పేజీలో జిల్లా పేరుతో గుర్తించిన మండలాన్ని కూడా చేర్చడం మరచిపోవద్దు

అయోమయ పేజీకి ఉదాహరణ

'''గ్రామం''' పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:

* [[గ్రామం (మండలం1)]] - జిల్లా జిల్లాలోని మండలం1 మండలానికి చెందిన గ్రామము
* [[గ్రామం (మండలం2)]] - జిల్లా జిల్లాలోని మండలం2 మండలానికి చెందిన గ్రామము

{{అయోమయ నివృత్తి}}

This category currently contains no pages or media.