"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వర్గం:రంగారెడ్డి జిల్లా దర్శనీయ స్థలాలు

From tewiki
Jump to navigation Jump to search

దామగుండం : దామగుండం వికారాబాద్ జిల్లా లో ఒక చక్కటి శైవ క్షేత్రం.ఇది దట్టమైన అడవిలో చూడదగిన ప్రాంతం.ఇక్కడికి రోజు చాలా మంది సందర్శకులు దూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటాయి .ఆధ్యాత్మిక ప్రదేశమైన దామగుండానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది.ఇక్కడ కొలువైన దైవం రామలింగేశ్వరుడు.ఆలయ ఆవరణలో ఉన్న గుండం ప్రత్యేకత, పవిత్రత కలిగి ఉన్నది. దామగుండం ఉన్న అడవిలో ఎంతోమంది ఋషులు తపస్సు చేసారని పురాణాల ద్వారా తెలుస్తుంది.ఇక్కడ అడవిలో అనేక వనమూలికలు అరుదైన వృక్ష జాతులు ఉన్నాయని స్థానికుల ద్వారా తెలుస్తున్నది ఇక్కడ జరిగే జాతర సందర్బంగా మూలికలతో కూడిన ఆహారాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది టూరిజం కి చక్కటి ప్రదేశం.సందర్శకులు ఇక్కడికి రావడానికి చాలా మక్కువ చూపిస్తారు.