"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వర్ణము(సంగీతం)
వర్ణము అభ్యాసగాన రచనలలోచాలా ముఖ్యమైన రచన. ఈ రచన నేర్చుకొనుటకు, పరిపూర్ణ పరిపక్వముతో పాడుటయు చాల కష్టము. వర్ణమును బాగుగా నేర్చిన యెడల యితర రచనలు అతి సులభ సాధ్యము అగును. వాద్య పాఠకులు వర్ణమును పఠించి వాద్యముపై వాయించుటచే సంగీత కళను సంపూర్ణంగా వాద్య స్వాధీనము చేసుకొనవచ్చును. గాత్ర పాఠకులకు గాత్రమునందు యెటువంటి సంచారమైననూ అవలీలగా పాడుటకు వీలగును.
వర్ణమును రచించుట కష్ట సాధ్యము. కృతుల సంఖ్య కంటే వర్ణముల సంఖ్య చాలా కొద్ది. వర్ణము రచించుటకు రాగము యొక్క లక్షణములు పరిపూర్ణముగా తెలిసికొని ఆ రాగములో వర్ణమును రచింపవలయును.
Contents
లక్షణము
వర్ణమునకు రెండు భాగములు, పూర్వ భాగము,ఉత్తర భాగము. పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరములు గల భాగము పూర్వభాగము. చరణము,చరణ స్వరములు కల భాగము ఉత్తర భాగము.
పూర్వ భాగమున పల్లవి, అనుపల్లవి, ముక్తాయీ స్వరము యిమిడి యున్నవి. పల్లవి, అనుపల్లవులకు సహిత్యము ఉంది. ముక్తాయీ స్వరము నము సాహిత్యముండదు. రచించిన రాగములో ఏ ఏ విశేష సంచారములు వచ్చుటకు వీలున్నవో, రాగ రంజక ప్రయోగము లేవో అన్ని రకములైన సంచారములను వర్ణనములో కాననగును. ఒక భాష నేర్చికొనుటకు, నిఘంటువును ఎట్లు ఉపయోగించుదుమో ఒక రాగము లోని వర్ణము ఆ రాగము యొక్క్ లక్షణమునకు అంత ఉపయోగించుదురు.
వర్ణములో సాహిత్యము చాల కొద్ది అక్షరములు కలిగి యుండును. సాధారనముగా శృంగార రసము గాను, భక్తిని దెల్పునదిగాను, లేక ఒక రాజపోషకు స్తుతీ గాను ఉండును.
ఉత్తర భాగములో చరణము, చరణ స్వరములు ఇమిడి ఉన్నాయి. చరణమునకు ఉపపల్లవనియు, ఎత్తుగడ పల్లవి అనియు, చిట్ట పల్లవి అనియు పేర్చు. సాధారణముగా మొదటి స్వరము దీర్ఘ స్వరముగా నుండును. 4 లేక 5 చరనములతోనే వర్నమును రచించుట వాడుక. చరణ స్వరము పాడి, మరల చరణమును అందుకొనుట ఆచారము. కొన్ని వర్ణములకు రెండువ పల్లవులుండును.
రకాలు
వర్ణములు రెండు విధములు
- తాన వర్ణము
- పద వర్ణము
ఈ రెండు రకాల వర్నముల లక్షణములు పైన తెలుపబడినవే. తానవర్ణము పల్లవి, అనుపల్లవి చరణములకు మాత్రము సాహిత్యము కలిగి తక్కిన భాగములు స్వరములు మాత్రమే కలిగి యుండును.పద వర్ణములు చౌకముగా పాడవలయును కాన వీటిని చౌక వర్ణములని వాడుటయు ఉంది. తాన వర్ణములు సంగీత మభ్యసించువారు నేర్చుకొనుటకును, గాన సభలలో కచేరీలు ప్రారంభించుటకును ఉపయోగపడుచున్నవి. పదవర్ణములు నృత్యమాలకుపయోగ పడుచున్నవి.అభినయంతో సాహిత్యములోని భావమును ప్రదర్శించవలెను. కాబట్టి యో పదవర్నము చౌకముగా పాడవలసి యున్నది.
రాగమాలికా వర్ణములు
రాగమాలిక వర్ణములు కొన్ని గలవు. అనగా వేరువేరు ఆంగములు వేరు వేరు రాగములలో ఉండుట. నవరాగమాలిక, దినరాగ మాలిక మొదలగునవి ఉత్తమ ఉదాహరణములు. నక్షత్రమాలిక అను 27 రాగములలో ఒక రాగమాలికా వర్ణములు ఉన్నాయి.ఒక్కొక్క ఆవర్తములో లఘువు ఒక రాగము రెండ్ దృతములు ఒక రాగము గాను, రచించ బడినవి.
తాన వర్ణన చేయు రచయితలు
- పచ్చిమిరియము ఆదిఅప్పయ్య
- శ్యామశాస్త్రి
- వీణ కుప్పయ్య
- పల్లవి గోపాలయ్య
- స్వాతీ తిరునాళ్
- మానాంబుచవాడి వెంకట సుబ్బయ్య
- తిరువారూర్ అయ్యాసామి
- పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
- కొత్తవాసల్ వెంకటరామయ్య
- తిరువత్తియూర్ త్యాగయ్యర్
- రామ్నాడ శ్రీనివాసయ్యంగార్
పదవర్ణ రచయితలు
- గోవింద సామయ్య
- కూవన సామయ్య
- రామస్వామి దీక్షితులు
- వడివేలుగారు
- పల్లవి శేషయ్య
- రామస్వామి శివన్
- మైసూరు సదాశివరావు
- కుండ్రకుడి కృష్ణయ్యర్