"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వసనాభి

From tewiki
Jump to navigation Jump to search

వసనాభి
250px
Aconitum ferox
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
A. ferox
Binomial name
Aconitum ferox
[Wallich

మూస:Taxonbar/candidate

నాభి లేదా వసనాభి (Indian Aconite) ఒక రకమైన విషపూరితమైన మొక్క. వాసనాభి అనేది రానన్కులేసి కుటుంబానికి చెందిన ఒక జాతి.

చరిత్ర

వాసనాభి ని భారతదేశ మొక్క గా పేర్కొంటారు .హిమాలయముల నుంచి , నేపాల్ , భూటాన్ వరకు విస్తరించి ఉన్న మొక్కలలో సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ఈ మొక్క యొక్క మూలం ను సాంప్రదాయిక మందుల తయారీ లో వాడతారు. మందుల తయారీ కొరకు మొక్కలను అడవి నుండి సేకరిస్తారు. దీనితో దాదాపుగా ఈ మొక్క అంతరించే ప్రమాదం లో ఉన్నదని డేటా బుక్ ఆఫ్ ఇండియా వారి సర్వేలో లో సూచిస్తుంది. వాసనాభి మొక్క అడవులు, తోటలు మధ్యస్తంగా మొక్కలు బాగా పెరుగుతాయి. బంకమట్టి నేలల్లో బాగా పెరుగుతుంది, ఎండలో తేమగా ఉండే సున్నపు మట్టి లో కూడ పెరుగగలదు .2100-4500 మీ ,సాధారణంగా 3000-3500 మీటర్ల ఎత్తులో కనిపిస్తుంది. భారతదేశములో హిమాలయాలలో ,జమ్మూ కాశ్మీర్ ,హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ (డార్జిలింగ్), అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లలో మనకు వాసనాభి మొక్క కనిపిస్తుంది. ఈ మొక్క 50-100నిటారుగా ఉన్న కాండంతో సెం.మీ, పువ్వులు ( ఆగష్టు, సెప్టెంబర్ మధ్యలో వస్తాయి , ఇవి నీలం, వంకాయ రంగులో ఉంటాయి[1]

వాసనాభి ని హోమియోపతి మందుల తయారీ లో ఉపయోగిస్తున్నారు. జ్వరం , బలహీనత , మానసిక ఆందోళన , వంటి మందులలో వాడుతున్నారు [2][3] ఆయర్వేద మందుల తయారీ లో జ్వరం.ఆకలి లేకపోవడం , మధుమేహ , శ్వాసకోశ అం టువ్యాధులు,అజీర్ణం.ఉబ్బసం,దగ్గు. జలుబు, మలబద్ధకం, ఎలుకల ,తేలు కాటు మందుల వంటి వాటి కొరకు వాసనాభి ని వాడుతున్నారు. కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి వంటి వాటికీ తైలముగా ( శరీరం ఫై మర్దన ) వాడతారు [4] [5]

వాసనాభి జాతి- నామములు

సాధారణ పేర్లు - మాంక్ హుడ్, వోల్ఫ్స్బేన్, మౌస్బేన్,హెల్మెట్ ఫ్లవర్, సోల్జర్ క్యాప్, ఓల్డ్ భార్య హుడ్, ఫ్రియర్స్టోపీ, అకోనిటమ్ ఫిరాక్స్ ,వాల్ ఎక్స్ సెరింగే.

భారత దేశములో సంస్కృతం లో వత్సనాబ్, హిందీ లో బిష్, బచ్చనాగ్ ,బెంగాల్ లో కాట్బిష్, తమిళం లో వశనాభి, తెలుగులో అవసనాభి , కన్నడంలో వాసనాభి , మలయాళం లో వస్తరాభి అని అంటారు [6] .

మూస:మొలక-వృక్షశాస్త్రం

మూలాలు

  1. "Aconitum ferox" (PDF). https://www.himalayanvoices.org/. 30-09-2020. Retrieved 30-09-2020. Check date values in: |access-date= and |date= (help); External link in |website= (help)
  2. [http://www.homeoint.org/books1/allenhandbook/a/acon-f.htm "Aconitum Ferox. - Hand Book of Materia Medica and Homoeopathic Therapeutics. - By T. F. Allen. - Presented by M�di-T"]. www.homeoint.org. Retrieved 2020-09-30. replacement character in |title= at position 112 (help)
  3. "Aconitum ferox. homeopathic remedy - Remedia Homeopathy". www.remedia-homeopathy.com. Retrieved 2020-09-30.
  4. "Vatsanabha (Aconitum ferox) Benefits, Uses, Dosage & Side Effects". Ayur Times (in English). 2019-06-27. Retrieved 2020-09-30.
  5. "Monkshood: Aconitum Ferox Medicinal Uses | Dabur". www.dabur.com. Retrieved 2020-09-30.
  6. "CRITICAL REVIEW OF VATSANABH (ACONITUM FEROX)". w.w.w. wjpmr.com. Archived from [file:///C:/Users/USER/Downloads/article_1531993678%20(2).pdf w.w.w. wjpmr.com the original] Check |url= value (help) on 2013-08-12. Retrieved 30-09-2020. Check date values in: |access-date= (help)