"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వసుదేవుడు

From tewiki
Jump to navigation Jump to search
వసుదేవుడు
వసుదేవ
శ్రీ కృష్ణుడు, బలరాముడు తల్లిదండ్రులను కలుసుకోవడం, రాజా రవివర్మ చిత్రం
మొదటి దర్శనంScript error: No such module "Formatted appearance".
చివరి దర్శనంScript error: No such module "Formatted appearance".
సమాచారం
దాంపత్యభాగస్వామిరోహిణీ దేవి, దేవకి
పిల్లలుబలరాముడు, సుభద్ర, శ్రీ కృష్ణుడు

వసుదేవుడు హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని తండ్రి. ఇతను యదు క్షత్రియ వంశంనకు చెందిన యాదవ రాజు. చెల్లెలు కుంతీదేవిని పాండురాజు కిచ్చి వివాహం చేశారు. వసుదేవుడు కశ్యప మహర్షి యొక్క అంశతో జన్మించాడు. శ్రీకృష్ణునికి తండ్రి పేరును పోలిన వాసుదేవుడు అనే పేరు కూడా ఉంది. [1] హరివంశ పురాణం ప్రకారం నందుడు, వసుదేవుడు అన్నదమ్ములు.[2]


చారిత్రక నేపథ్యం

వసుదేవుడు అనే పేరు క్రీపూ 1000 నుంచి వైష్ణవ సాంప్రదాయంతో ముడిపడి ఉంది. ఆ కాలానికి వాసుదేవుడు (వసుదేవుని కుమారుడు వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు) బ్రహ్మం గా ఆరాధింపబడేవాడు. దీనికి గ్రంథాల రూపంలోనూ, పురాతత్వ పరిశోధనల రూపంలోనూ ఆధారాలున్నాయి. మహానారాయణ ఉపనిషత్తులో ఏడవ అధ్యాయంలో [3] ఒక శ్లోకం ఇలా ఉంది.

నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్

ఈ శ్లోకం ప్రకారం నారాయణుడన్నా, వాసుదేవుడన్నా, విష్ణువు అన్నా అంతా ఒకరే. అయితే దీని రచయిత, రాసిన సంవత్సరం మాత్రం తెలియలేదు. అయితే ఇందులో ఉన్న పాఠ్యం ఆధారంగా పరమేశ్వరానంద దీనిని కథోపనిషత్తు, మండూకోపనిషత్తు, ఈశోపనిషత్తు, శ్వేతాశ్వతారోపనిషత్తు కాలంలోనే రాసి ఉండవచ్చునని అభిప్రాయపడ్డాడు.

మూలాలు

  1. The Cattle and the Stick: An Ethnographic Profile of the Raut of Chhattisgarh -Page 16
  2. Lok Nath Soni, The cattle and the stick: an ethnographic profile of the Raut of Chhattisgarh. Anthropological Survey of India, Govt. of India, Ministry of Tourism and Culture, Dept. of Culture (2000).
  3. SM Srinivaschari (1994), Vaiṣṇavism: Its Philosophy, Theology, and Religious Discipline, Motilal Banarsidass, ISBN 978-8120810983, page 132-134, 212-218