"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వస్త్ర పరిశ్రమ

From tewiki
Jump to navigation Jump to search

వస్త్ర పరిశ్రమ (యునైటెడ్ కింగ్‌డం మరియు ఆస్ట్రేలియాలలో వ్యావహారికంగా విలువలేని వర్తకంగా పిలువబడుతుంది) అనే పదం ప్రధానంగా దుస్తుల రూపకల్పన లేదా తయారీ, పంపిణీ మరియు వస్త్రముల ఉత్పత్తికి కావలసిన ముడి పదార్ధాలకు సంబంధించిన పరిశ్రమలకు ఉదహరించబడుతుందని భావిస్తారు.

నూలు దశ

తయారీ ప్రక్రియ యాంత్రికీకరణకు పూర్వం, వస్త్రాలను ఇంటివద్దనే తయారుచేసి, మిగులు వస్త్రాన్ని విక్రయించి సొమ్ము గడించేవారు. ఆయా యుగాలు, ప్రదేశాల మీద ఆధారపడి చాలావరకు ఉన్ని, ప్రత్తి లేక అవిసె నుండే వస్త్రాన్ని ఉత్పత్తి చేసేవారు. ఉదాహరణకు, మధ్యయుగము కాలాంతంలో ఉత్తర ఐరోపాలో నూలు, వస్త్రములను దిగుమతి చేసుకున్న ఒక నారగా తెలుసు; అది ఒక మొక్కగానే తెలియడం మినహా అది ఎక్కడ నుండి వచ్చిందన్న అవగాహన లేదు; ఉన్నికి నూలుకి మధ్య ఉన్న పోలికలు గ్రహించి, మొక్కగా అవతరించిన గొర్రె నుండి పత్తి ఉత్పతి చేయబడిందని ఉహించేవారు. 1350 సం.లో జాన్ మాన్దేవిల్లి, తన రచనలో ఈ మూఢనమ్మకాన్ని వాస్తవమని వెల్లడించాడు: "అక్కడ (భారతదేశం) ఒక అద్భుతమైన చెట్టు కొమ్మలు క్రిందకు వంగి, వాటి చివర్లలో చిన్న గొర్రె పిల్లలను కలిగి ఉంటుంది. అటూఇటూ కదులుతూ, ఆకలితోనున్న గొర్రె పిల్లలకు ఆహరాన్నిస్తుంది" అని ఉదహరించాడు. ఈ రీతిగా అనేక యూరోపియన్ భాషలలో అనగా జర్మన్ బుమ్వోల్లెలో పత్తిని "ట్రీ ఊల్" (చెట్టు ఉన్ని) గా అనువదించారు. 16వ శతాబ్ద చివరికి, ఆసియా మరియు అమెరికాలలోని ఉష్ణప్రాంతాలలో అన్నిచోట్ల పత్తి సాగుచేయబడింది. రోమన్ ల కాలంలో యూరోపియన్ ప్రజలు ఉన్ని, నూలు మరియు తోలు దుస్తులు ధరించేవారు: ఇండియా యొక్క పత్తి ఆసక్తికరంగా ఉండేది, జంతుశాస్త్రజ్జులు మాత్రమే దాని గురించి విన్నారు, చైనా నుండి సిల్క్ మార్గం ద్వారా దిగుమతి చేసుకున్న పట్టు అతి విలాసవంతంగా కుడా ఉండేది. నవీనయుగకాలం నాటికే ఉత్తర యూరప్ లో వస్త్రతయారీకి వేగీస నారును ఉపయోగించేవారు

వస్రములు ఇంటి వద్దనే తయారుచేసేవారు. మిగులుగా ఉన్న నేసిన వస్రమును, వస్రములు అమ్మేడి వర్తకులు అనబడే వ్యాపారులకు విక్రయించేవారు. ఈ వ్యాపారులు బరువులు మోయు గుర్రాల శ్రేణులతో పరివారంగా గ్రామాలను సందర్శించేవారు. కొంత వస్త్రం ఆ ప్రాంత నివాసపు ప్రజల దుస్తుల తయారీకి వినియోగించుకొని, మిగులు వస్త్రం ఎగుమతి చేసేవారు.

వస్త్ర తయారీ విధానం, అందుకు ఉపయోగించిన ఊలు పైననే స్వల్పంగా ఆధారపడియున్నది, కాని, ఇందు మూడు ముఖ్య దశలున్నాయి, వడుకుటకు నూలు సిద్దం చేయడం, నూలు వడకుట, నేయడం లేదా అల్లడం. నూలు తయారీ వేర్వేరు విధాలుగా ఉండి, వినియోగిస్తున్న నూలు మీద ఆధారపడి ఉంటుంది. వేగిసను నీటిలో నానబెట్టి, పరిశుభ్రపరచాలి, అది ఉన్ని అయితే, ఏకి, ఉతకాలి. వడకడం, నేయడం అనే ప్రక్రియలు ఏ నూలుకు సంబంధించినప్పటికి చాలా మేరకు ఒకే రీతిగానే ఉంటాయి.

వ్రేలాడే కదురు, రాట్నం తిప్పుతూ చేతితో నూలు పోగులను మెలిపెట్టు పరిణామమే నూలు వడకటం. అతి ప్రాచీన కదురులు లేక వాటిలో కొన్ని భాగాలు పురావస్తు ప్రదేశాలల్లో బయల్పడినవి: అవి తొలి సాంకేతికశాస్ర పరిజ్జానాన్ని తెలిపే మచ్చుతునకలుగా వర్ణిస్తూ మానవాళికి లభించాయి. ఇది భారతదేశంలో [1] క్రీ.పూ.500-1000 శతాబ్దాలలో కనుగొనబడి యూరోపియన్ మధ్యయుగంలో మధ్య ప్రాచ్యం ద్వారా ఐరోపా చేరింది.

నూలు వడికినంత కాలం మగ్గం మీద నేతనేయవలసి ఉంటుంది. మధ్య ప్రాచీన శిలాయుగంలోనే నేతనేసినట్లుగా కొన్ని ఆనవాళ్ళు లభించాయి. ఒక అస్పష్టమైన వస్త్రాకృతి పావలోవ్, మొరవియాలలో బయటపడినవి. స్విట్జర్లాండ్ లోని ఆవాస గుట్టల నుండి నవీన శిలాయుగానికి చెందిన వస్రాలు లభించుట విదితమే. ఇప్పటికి నవీన శిలయుగాపు నశించని చిన్న ముక్క ఒకటి ఫాయుంలో ఒకచోట దొరికింది. ఆ చోటు సుమారు క్రీ.శ.5000 చెందినది. వైకింగ్ కాలం నాటి తేలిక మగ్గాలు, మొదలు సాధారణ నేలమగ్గాల వరకు అప్పట్లో ఎన్నో రకాలు ఉండేవి.

పారిశ్రామిక విప్లవ కాలంలోని చరిత్ర

18వ శాతాబ్ది ప్రారంభంలో ఈ కీలక బ్రిటిష్ పరిశ్రమ మిడ్ ల్యాండ్స్]మరియు దేశం మొత్తం నుండి పెద్ద గొర్రెల పెంపక ప్రాంతాల (భూమిని చదునుచేసి ఆవరణను అనుకూలంగా చేయడం ద్వారా ఏర్పడింది) నుండి వచ్చిన ఉన్ని నుండి ఏర్పడిన వస్త్ర ఉత్పత్తి పరిశ్రమ. నేతపనివార కుటీరాలలో చేతిమగ్గాలు, వడికే రాట్నాలు వృత్తిపనిముట్లుగా ఉండి, కార్మిక శక్తి అధికముగా కావలసిన ఈ పని పశ్చిమదేశాన: నార్విచ్ దాని చుట్టుప్రక్కల మరియు వెస్ట్ రైడింగ్ అఫ్ యార్క్ షిర్ లోని పెద్ద కేంద్రాలతో బ్రిటన్ అంతటా ఉపాధి కల్పించింది. ఉన్నివస్తువుల ఎగుమతి వ్యాపారం 1701-1770 [1] సంవత్సర మధ్యకాలంలో రెండింతలై, 18వ శతాబ్దంలో బ్రిటీష్ ఎగుమతుల మొత్తంలో నాలుగవ వంతు కంటే అధికంగానే లెక్కించబడింది. వస్త్రపరిశ్రమ ఉత్పత్తులు లాంక్ షైర్లో కేంద్రీకృతమై పరిశ్రమ ఎగుమతులు ఈ కాలంలో పదిరెట్లు పెరిగినప్పటికీ, ఉన్నివ్యాపార విలువలో కేవలం 10వ వంతుగానే గణించబడింది.

18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం నుండి వస్త్రపరిశ్రమ విస్తారంగా దుస్తుల తయారీ పరిశ్రమగా ఎదిగి ముఖ్యాధార పరిశ్రమగా రూపుదాల్చింది. 1733 సం.లో ఫ్లయింగ్ షటిల్ తో ఆరంభమై, వస్త్రతయారీలో నూతన విధానాల ఆవిష్కారం వేగవంతం అయ్యాయి. 1738 లో లేవిస్ పాల్ మరియు జాన్ వైట్ రోలర్ స్పిన్నింగ్ యంత్రాన్ని, ఫ్లైయర్-మరియు-బాబిన్ విధానమును కొత్తగా రూపొందించారు. 1748లో చిక్కుతీసే యంత్రమును కనుగొన్న లేవిస్ పాల్, 1764 సం.నాటికి స్పిన్నింగ్ జెన్నీని కూడా కనిపెట్టాడు. 1771లో రిచర్డ్ ఆర్క్ రైట్ నూలు వస్త్రాల తయారీకి మరమగ్గాలకు నీటి చక్రాలను అమర్చగా, అతని నూతన కల్పన "వాటర్ ఫ్రేం "గా బహుళ ప్రసిద్ధి చెందింది. 1784 సం.లో ఎడ్మండ్ కార్ట్ రైట్ మరమగ్గాన్ని కనుగొన్నాడు. వడకటం, నేయటం ఇప్పుడు యాంత్రీకరించుటతో, ఉత్తర పశ్చిమ ఇంగ్లాండ్ ఎల్లెడలా మిక్కిలి ప్రసిద్ధిగాంచిన మాంచెస్టర్, దాని పరిసర పట్టణాలైన ఆశ్టన్- అండర్-లైన్, స్టాలిబ్రిడ్జి మరియు దుకిన్ ఫీల్డ్ లలో పత్తి మిల్లులు వెలిసాయి.

వస్త్రమిల్లులు మొదట్లో వాటర్ వీల్స్ ద్వారా శక్తిని పొందడంతో, అవి నదీతీరం వెంబడే స్థాపించబడేవి. ఆవిరి యంత్రం కనుగొన్న పిదప 1760 నుండి 1800 దశకం వరకు నదీతీరప్రాంతం వెంబడే మిల్లుల నెలకొల్పవలసిన ఆవశ్యకత లేకుండా పోయింది.

పారిశ్రామిక విప్లవం అనంతరం

లోవెల్ యంఎలో ఉన్నమాదిరిగా, మొదట్లో యునైటెడ్ స్టేట్స్ లో చాలా పత్తి మిల్లులు స్థానికంగా వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసే బాలికలను కొన్ని సంవత్సరాల పాటు కూలికి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభించబడినాయి. వారు తిరిగి వ్యవసాయక పనులకు వెళ్ళే ముందుగా కొద్దిపాటిగా ఎక్కువ సొమ్ము చెల్లించే రీతిగా మిల్లులో పని రూపొందించబడింది. బంగాళాదుంప కరువుకాలంలో ఐర్లండ్ నుండి తక్కువ కూలికి కార్మికులు లభించడంతో, ఈ విధానం మార్పుచెంది, బాలికలు సులభంగా తీసివేయబడ్డారు. వస్త్రమిల్లులన్నీ దారపు పీచులు, పత్తినారతోను, మగ్గాల గలగల ధ్వనులతో నిండి ఉండేవి. మిల్లులు మొట్టమొదట స్థాపించినపుడు పనివాడు ఒకటి నుండి నాలుగు మగ్గాలలో ఎక్కడైనా పనిచేసేవాడు. మగ్గం రూపమును అభివృద్ధిపరచగా, అది నూలు తిగినప్పుడు ఆగిపోయి, దానిఅంతటకదే మరల షటిల్ ను నింపుకోవడంతో, ఒక్క పనివాడే 50 మగ్గాలపై పనిచేయగలడు.

ఆదిలో, మరమగ్గాలు షటిల్ తో నడపబడేవి, కాని 20వ శతాబ్ది ప్రారంభదశలో వేగంగాను, మరింత సమర్ధవంతంగాను పనిచేసే షటిల్స్ లేని మగ్గాలు వాడుకలోకి వచ్చాయి. నేడు సాంకేతికత ముందంజ వేసి, పలురకాల మగ్గాలను ప్రత్యేకమైన వస్తువుల తయారీ గరిష్ఠస్థాయికి పెంచేటట్లుగా రూపకల్పనచేసి సమకూర్చింది. వీటిలో ఎయిర్ జెట్ మగ్గాలు, పవర్ జెట్ మగ్గాలు సాధారణమైనవి. పారిశ్రామిక మగ్గాలు క్షణానికి ఆరు వరుసలకు మించిన వేగంతో నేతనేయగలవు.

20వ శతాబ్ది చివరకు అభివృద్ధి చెందిన దేశాలలో వలసవాదులు ఈ "స్వేద అంగళ్ళలో" వస్త్ర తయారీ, కుట్టు యంత్రములపై పనికి పూర్తిగా ప్రవేశించగా, చట్టవిరుద్ధముగా వీరికి కనీస వేతనము కంటే తక్కువ చెల్లించుటతో ఈ పరిశ్రమ అపకీర్తి పొందినది. ఈ పరిస్థితి ఆగ్నేయ ఆసియా, భారత ఉపఖండము మరియు ఈ మధ్యనే మధ్య అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ళను ఎదుర్కొని, ప్రస్తుతమున్న పరిశ్రమలను రక్షించాలన్న ప్రయత్నాల ఫలితంగా ఉత్పన్నమైనది. ప్రపంచీకరణతో, తయారీ పనులను విదేశీయ లేబర్ మార్కెట్లకు అవుట్ సోర్సు చేయబడుతుండగా, చారిత్రాత్మకంగా కలసియున్న ప్రాంతాలలో వ్యాపారులు వైట్ కాలర్ సహవాస పరిశ్రమలైన ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ మోడలింగ్ మరియు రిటైల్ వర్తకంపై దృష్టి కేంద్రీకరించారు.

చారిత్రాత్మకంగా ఈ " విలువలేని వర్తకం"లో నిమగ్నమైన దేశాలల్లో లండన్, యూరప్లోని మిలాన్, న్యూ యార్క్ సిటీలోని సోహో డిస్ట్రిక్ట్, ఫ్లిన్డర్స్ లేన్ మరియు రిచ్మండ్ లు కుడా ఉన్నాయి.

జనరంజక సంస్కృతిలో

ఇవి కూడా చూడండి

సూచనలు

  1. సి. వెన్ స్మిత్ మరియు జాయే టం కోత్రెన్ రచించిన పేజీ viii. ప్రచురణ 1999. జాన్ విలీ మరియు సన్స్ సాంకేతికత మరియు పరిశ్రమల కళలు 864 పేజీలు  ISBN 0-471-18045-9

బాహ్య లింకులు

మూస:Textile arts