వాడే వీడు

From tewiki
Jump to navigation Jump to search
వాడే వీడు
(1973 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం డి.యోగానంద్
నిర్మాణం ఎన్. రామబ్రహ్మం
తారాగణం నందమూరి తారక రామారావు,
మంజుల (నటి),
నాగభూషణం,
పద్మనాభం,
పండరీబాయి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీగౌతమ్ పిక్చర్స్ (చిత్రభాను ప్రొడక్షన్స్?)
భాష తెలుగు

వాడే వీడు 1973లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఎన్.టి.ఆర్ సరసన మంజుల (నటి) నటించిన తొలి సినీమా.

కథ

చిన్నతనంలో తప్పిపోయిన కొడుకు కోసం అతని తల్లి (పండరీబాయి) ఎదురుచూస్తూఉంటుంది. ఆమె ఆస్తి మీద కన్నేసిన కోదండం (నాగభూషణం) ముఠా రిక్షా వాడైన ఎన్.టి.ఆర్ ను ఆమె కుమారుడని చెప్పి ఇంట్లో ప్రవేశపెడతాడు. అంతకు మునుపే అతనికి పరిచయమున్న మంజుల ఎన్.టి.ఆర్ కు అక్కడ తారసపడుతుంది. విలన్ల బండారం బయట పెట్టటం, తప్పిపోయిన బాబు ఎన్.టి.ఆర్ కావడం తరువాతి కథ.

నటీనటులు

పాటలు

  1. అహ లవ్‌లోనే ఉందిలే లోకమంతా అది లేకపోతే చీకటిలే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
  2. అటు చల్లని వెలుగుల జాబిలి ఇటు వెచ్చని చూపుల - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి
  3. ఎదుటనుండి కదలను పదములింక వదలను - పి.సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  4. చీరలేని చిన్నదానా ఓయబ్బా చిగురాకు వన్నె- ఘంటసాల, రమోల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  5. నేటికి మళ్ళీ మాయింట్లో ఎంచక్కా పండుగ - పి.సుశీల, ఎస్. జానకి, ఘంటసాల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  6. వయసే ఒక పాఠం వలపే ఒక పాఠం గురువు - ఘంటసాల, పిసుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  7. హరేరామ హరేరామ ఆగండి కాస్త ఆగండి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వసంత - రచన: కొసరాజు

మూలాలు

బయటి లింకులు