వాణిబాల

From tewiki
Jump to navigation Jump to search
వాణిబాల
దస్త్రం:VaniBala.jpeg
జననం
మరణంమే 27, 2015
జాతీయతభారతీయురాలు
వృత్తిరంగస్థల నటీమణి

వాణిబాల (మ. మే 27, 2015) ప్రముఖ రంగస్థల నటీమణి. నంది అవార్డు గ్రహీత.[1]

జననం

వాణిబాల పశ్చిమ గోదావరి జిల్లా, కొయ్యలగూడెం గ్రామంలో జన్మించింది.

రంగస్థల ప్రస్థానం

తల్లిదండ్రులు కళాకారులు కానప్పటికీ నటనపై ఆసక్తితో తన ఏడోఏటే నటిగా రంగస్థల ప్రవేశం చేసిన వాణిబాల దాదాపు వెయ్యికిపైగా ప్రదర్శనలో పాల్గొన్నది.

నటించినవి

  1. నిశ్శబ్ద విప్లవం
  2. గోరంత దీపం
  3. భయం
  4. ఏ వెలుగుకీ ప్రస్థానం
  5. గుప్పెటతెరు
  6. మిథునం
  7. దేశమును ప్రేమించుమన్నా

బహుమతులు

  1. ఉత్తమ నటి - నిశ్శబ్ద విప్లవం (నాటిక) - నంది నాటక పరిషత్తు - 2004

మరణం

2015లో రాజమండ్రి జరిగిన నంది నాటక పరిషత్తు - 2013లో పాల్గొని తిరిగి సొంతూరు కొయ్యలగూడెం వస్తూ వడదెబ్బకు గురైన వాణిబాల, స్థానిక ఆసుప్రతిలో చికిత్స పొందుతూ 2015, మే 27 బుధవారం రాత్రి ఆమె మరణించారు.[2]

మూలాలు

  1. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (29 May 2015). "రంగస్థల నటి వాణీబాల మృతి". Retrieved 27 May 2018.
  2. ప్రజాశక్తి, తాడేపల్లిగూడెం (2 June 2015). "'వాణిబాల మృతి తీరనిలోటు'". Retrieved 27 May 2018.