"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వానపాముల

From tewiki
Jump to navigation Jump to search
వానపాముల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెదపారుపూడి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషులు 811
 - స్త్రీలు 903
 - గృహాల సంఖ్య 506
పిన్ కోడ్ 521263
ఎస్.టి.డి కోడ్ 08674

వానపాముల, కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 521 263., యస్.టీ.డీ.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పెదపారుపూడి మండలం

పెదపారుపూడి మండలం మొత్తం ప్రాంతంతో పాటుగా పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[3] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, ఏలూరు

సమీప మండలాలు

గుడివాడ, నందివాడ, ఉంగుటూరు, వుయ్యూరు

గ్రామానికి రవాణా సౌకర్యం

 1. రోడ్డుమార్గం:- గ్రామం మీదుగ విజయవాడ-గుడివాడ రాష్ట్రరహదారి ఉంది. పొరుగువూళ్ళను కలుపుతు జిల్లారహదార్లు ఉన్నాయి. విజయవాడకు, గుడివాడకు ప్రతి 10 నిమిషాలకు బస్సు సౌకర్యం కలదు
 2. రైలుమార్గం:- గ్రామంనుంచి 8 కిలోమీటర్ల దూరంలోవున్న గుడివాడ పట్టణంనుంచి హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, ముంబయ్, బీదర్, గుంటూరు, మచిలీపట్నంలకు రైలుసౌకర్యం ఉంది.
 3. వాయుమార్గం:- గ్రామంనుంచి 30 కిలోమీటర్ల దూరంలో విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
 4. వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

ఆరవ తరగతి నుంచి పదవతరగతి వరకు. జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల 1925 సంవత్సరంలో నెలకొల్పారు. అప్పటికి జిల్లాలో ఇది ఆరవ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాల 90వ వార్షికోత్సవం, 2016, ఫిబ్రవరి-17న గుడివాడ ఏ.ఎన్.ఆర్.కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. [6] ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న ఆర్.శశికుమార్ అను విద్యార్థి, జాతీయ ఉపకారవేతనం పొందుటకు అర్హత సంపాదించాడు. [8]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల

ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

 1. త్రాగునీరు, విద్య, ప్రాథమిక వైద్యం, రవాణా మొదలుగు వసతులు ఉన్నాయి.
 2. అంగనవాడీ కేంద్రం:- ఈ కేంద్రానికి ఆరున్నర లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఒక శాశ్వత భవనాన్ని ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలలో నిర్మించుచున్నారు. [4]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

ఈ ఊరి గుండా మూడు పంటకాలువలు కృష్ణానది నుంచి వచ్చుచున్నవి

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ ఎలీష్ డేవిడ్ రాజు, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

 1. శ్రీ పద్మావతీ అలిమేలుమంగా నమేత వేంకటేశ్వరస్వామి వార్ల దేవస్థానం.
 2. శ్రీ శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి వార్ల దేవస్థానం:- ఈ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, మార్చ్-8వ తేదీ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని 6వ తేదీ శుక్రవారం నాడు, గ్రామ వీధులలో ఊరేగించారు. ఈ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, మార్చ్-8వ తేదీ ఆదివారం ఉదయం 9-29 గంటలకు వేదపండితులు, వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని 6వ తేదీ శుక్రవారం నాడు, గ్రామ వీధులలో ఊరేగించారు. శనివారం నాడు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆదివారం ఉదయాన్నే ధానాదివాసం, కలాదివాసం, పూర్ణాహుతి, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో వేలాదిమందికి అన్నదానం నిర్వహించారు. భక్తులు బారులు తీరడంతో ఆలయం కిటకిటలాడినది. [3]
 3. శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం.
 4. శ్రీ రామానుజ కూటమి.

గ్రామంలోని ప్రధాన వృత్తులు

ఇచ్చట వ్యవసాయం-పశుపోషణ ప్రధాన వృత్తిగా వున్నప్పటికి కులవృత్తులు కూడా ఉన్నాయి. కులవృత్తులు:- కల్లుగీత, చాకిరం, క్షౌరవృత్తి, వైశ్యవృత్తి, పౌరోహిత్యం మొదలుగునవి.

గ్రామంలోని ప్రధాన పంటలు

వరి, మినుము, పెసర.

ప్రముఖులు

ప్రముఖ హిందీ భాషోద్యమ నేత, కెనడాలో భారత సాంస్కృతిక రాయబారి అయిన శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి స్వగ్రామం యీ వూరే. [2]

శ్రీ రావూరి అర్జునరావు :- స్వాతంత్ర్య సమరయోధులు, నాస్తికోద్యమ నాయకులు అయిన శ్రీ రావూరి అర్జునరావు గారి శతసంవత్సరాల జన్మదినం, శ్రీ రావూరి అర్జునరావు, శ్రీమతి మనోరమ దంపతుల 70 సంవత్సరాల వైవాహిక దినోత్సవ వేడుకలను, 2017, మార్చ్-26న గ్రామంలో వైభవంగా నిర్వహించారు. శ్రీ రావూరి, అంటరానితనం నిర్మూలనే తన ధ్యేయంగా పనిచేశారనియూ మరియూ నాస్తిక సిద్ధాంతాలను అమలులో పెట్టినారనియూ ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు ప్ర్కొన్నారు. గ్రామంలో విద్యాభివృద్ధికి, ప్రతి ఒక్కరూ చదువుకొనుటకై, వీరు ఈ సందర్భంగా గ్రామానికి ఐదు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించడం ముదావహం. ఈ సందర్భంగా గ్రామస్థులు శ్రీ రావూరి శతవసంతాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. [7]

గ్రామ విశేషాలు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,714 - పురుషుల సంఖ్య 811 - స్త్రీల సంఖ్య 903 - గృహాల సంఖ్య 506;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1738.[4] ఇందులో పురుషుల సంఖ్య 837, స్త్రీల సంఖ్య 901, గ్రామంలో నివాస గృహాలు 458 ఉన్నాయి.

మూలాలు

 1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 28 August 2016.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
 3. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedaparupudi/Ravulapadu". Retrieved 1 July 2016. External link in |title= (help)
 4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలిలింకులు

[2] ఈనాడు కృష్ణా; 2013, జూన్-18; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015, మార్చ్-7,8,9. [4] ఈనాడు కృష్ణా; 2015, జూన్-27; 38పేజీ. [5] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-8; 24వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2016, ఫిబ్రవరి-18. [7] ఈనాడు అమరావతి; 2017, మార్చ్-27; 12వపేజీ. [8] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, మార్చ్-27; 2వపేజీ.