"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వామ్‌బామ్

From tewiki
Jump to navigation Jump to search

వామ్‌బామ్ (Violence Against Men and Boys Awareness Month) అంటే పురుషుల, బాలురపై హింసకు వ్యతిరేకంగా అవగాహన కలిగించే నెల. సాంఘిక మాధ్యమాలలో వాడబడుతోన్న ఒక హ్యాష్ ట్యాగు. సంవత్సరంలోని అక్టోబరు నెల VAMBAM గా విశ్వవ్యాప్తంగా గుర్తించబడుతోంది.

పరిచయం

సాధారణంగా హింస/గృహహింస అనగనే సంఘజీవులలో మెదిలే ఆలోచన బాధింపబడేది ఎప్పుడూ స్త్రీయే. బాధించేది ఎప్పుడూ పురుషుడే అని. పురుషులు శారీరకంగా/మానసికంగా దృఢమైనవారని, స్త్రీలు కారనే మిథ్య మనలో తెలియకనే నాటుకుపోయి ఉండటం వలన ఈ ఆలోచనకు బలం చేకూరినది. కాబట్టి పురుషులపై హింస/గృహహింసకు తావులేదని మనం అపోహ పడుతోంటాం. కానీ దీనికి విరుద్ధంగా, ఒక కోణం నుండి చూస్తే, పురుషుడూ మనిషే. అతనికీ హృదయం ఉంటుంది. పురుషుడికీ భావోద్వేగాలు ఉంటాయి. పురుషుడు కన్నీరు పెడతారు. నొచ్చుకుంటాడు. సంతోషపడతాడు. స్త్రీలకు ప్రేమాభిమానాలు ఎంత అవసరమో, పురుషుడికీ అవి అంతే అవసరం. పురుషుడు కూడా వేదనకు లోనౌతాడు. స్త్రీ (పురుషుడు) కూడా పురుషుని మానసిక/శారీరక వేదనకు ప్రత్యక్షంగా/పరోక్షంగా కారణం కావచ్చుననే వాదనను సమర్థిస్తూ, కేవలం పురుషులకే కాక, బాలుర వేదనలను కూడా ఎలుగెత్తి చాటటానికే ఈ హ్యాష్ ట్యాగు సాంఘిక మాధ్యమాలలో విరివిగా వాడబడుతోంది.

ఉద్దేశ్యం

బాలుర/పురుషుల పై జరిగే హింస పట్ల మౌనాన్ని వీడటమే, VAMBAM యొక్క ప్రధాన ఉద్దేశం. వేధించబడే స్త్రీలపై చూపే జాలి, కరుణలు వేధించబడే పురుషుల/బాలురపై కూడా చూపేలా చేయటం.

ఇవి కూడా చూడండి

మూలాలు