"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వార్ధా నది

From tewiki
Jump to navigation Jump to search
వార్ధా
Lua error in మాడ్యూల్:WikidataIB at line 671: attempt to index field 'wikibase' (a nil value).
పుల్గావ్ వద్ద వార్ధా నది
దేశంభారత దేశం
భౌతిక లక్షణాలు
ప్రధాన వనరుముల్టాయ్
నదీముఖముప్రాణహిత
పొడవు528 కి.మీ. (328 మై.)
బేసిన్ లక్షణాలు
Progressionమధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ
ఉపనదులు
  • Left:
    కార్, వేనా, జాం, ఎరాయ్
  • Right:
    మాడూ, బెంబాలా, పెన్‌గంగ

వార్ధా నది గోదావరి నదికి ఉపనది. ఇది మహారాష్ట్ర లోని వార్ధా జిల్లాలో ప్రవహిస్తుంది. విదర్భ ప్రాంతంలోకెల్లా పెద్ద నది. ఈ నది మధ్య ప్రదేశ్, బేతుల్ జిల్లా, ఖైర్వానీ గ్రామం వద్ద సాత్పురా పర్వతాలలో ఉద్భవిస్తుంది. ఇది సముద్ర మట్టానికి 777 మీ. ఎత్తున ఉంది. మధ్య ప్రదేశ్ లో 32 కి.మీ. ప్రవహించి మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది. మహారాష్ట్రలో 528 కి.మీ. ప్రయాణించి, గడ్చిరోలి జిల్లా చాప్రాల వద్ద వైన్‌గంగ నదిలో కలుస్తుంది. ఆ తరువాత వైన్‌గంగ ద్వారా ప్రాణహిత నది లోను, అంతిమంగా గోదావరి నదిలోనూ కలుస్తుంది.[1] ఈ నదిమీద ఎగువ వార్ధా ఆనకట్ట నిర్మించారు.

ఉపనదులు

వార్ధాకు ఎడమ వైపున కార్, వేనా, జాం, ఎరాయ్ ఉపనదులున్నాయి. కుడి వైపున మాడూ, బెంబాలా, పెన్‌గంగ ఉపనదులు కలుస్తాయి.

ఆనకట్టలు

మోర్షి వద్ద ఎగువ వార్ధా ఆనకట్టను నిర్మించారు. అమరావతి పట్టణానికి, మోర్షి, వరూద్ తాలూకాలకూ దీన్ని జీవధారగా భావిస్తారు.[2]

దిగువ వార్ధా ఆనకట్టను అమరవాతి జిల్లా లోని వరూద్ బాగాజి గ్రాఅం వద్ద నిర్మించారు. ఇది వార్ధా జిల్లాకు నీరందిస్తుంది. యావత్‌మల్ జిల్లాకు నీరందించేందుకు, వార్ధాకు ఉపనది యైన బెంబాలాపై బాభుల్‌గావ్ వద్ద ఆనకట్ట నిర్మించారు


  1. Topographic map "Sirpur, India, NE-44-02, 1:250,000" Series U502, US Army Map Service, July 1963
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-05-22. Retrieved 2020-06-13.