"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాసన

From tewiki
Jump to navigation Jump to search

వాసన (Smell or Odor) ఒక రకమైన ముక్కుకు సంబంధించిన జ్ఞానేంద్రియం.

మంచి వాసనను సువాసన, పరిమళము, సుగంధం అంటారు. పువ్వులు రకరకాలైన సువాసనలను వెదజల్లుతాయి. ఎనిమిది రకాల సువాసనలను అష్టగంధాలు అని పేర్కొంటారు. ఇవి: కర్పూరం, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, అత్తరు మరియు శ్రీగంధం.

చెడు వాసనను కంపు, దుర్గంధం లేదా దుర్వాసన అంటారు. నోటి దుర్వాసన ఒక అరోగ్య సమస్య.

భాషా విశేషాలు

తెలుగు భాష[1] ప్రకారం వాసన n. Smell, scent, odour, fragrance. Flavour. పరిమళము. Notion, recollection from memory. Fancy, imagination. మునుపు అనుభవించిన దాని స్మరణ. ఇది వాని పూర్వజన్మ వాసన this is the influence of his former birth. వానికి సంస్కృత వాసన లేదు he has not the slightest acquaintance with Sanskrit. "ఉదరార్భకజన్మధురీణవాసనల్." R. iii. 95. వాసన కొడుపు a scented wick. పెద్దఊదువత్తి. వాసన చూచు vāsana-ṭsūṭsu. v. a. To smell. వాసన పట్టు to scent, to catch the scent of, to trace, to track. వాసనవేయు or వాసనకొట్టు vāsana-vēyu. v. n. To smell, to emit an odour: to stink. పరిమళించు, కంపుకొట్టు.

మూలాలు