"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వాసిరెడ్డి సీతాదేవి
ఈ వ్యాసంలో బొమ్మలు గాని, మరి కొన్ని భాగాలు గాని కాపీ హక్కుల నియమాలను ఉల్లంఘిస్తున్నాయి అనిపిస్తున్నది. రచయితలు లేదా బొమ్మలు అప్లోడ్ చేసినవారు సరైన వివరణల ద్వారా గాని, లేదా పాఠాన్ని మార్చడం ద్వారా గాని ఈ లోపాన్ని సవరించవలసిందిగా మనవి. అలా కాకుంటే ఆయా భాగాలు లేదా బొమ్మలు లేదా పూర్తి వ్యాసం తొలగించవలసిన అవసరం రావచ్చును. మార్గ దర్శకాల కోసం ఈ లింకులు చూడవచ్చును:-- |
వాసిరెడ్డి సీతాదేవి | |
---|---|
200px వాసిరెడ్డి సీతాదేవి | |
జననం | వాసిరెడ్డి సీతాదేవి 1933 |
మరణం | 2007 |
సురరిచితుడు | ప్రసిద్ధ రచయిత్రి |
వాసిరెడ్డి సీతాదేవి (ఆంగ్లం: Vasireddy Seethadevi) (డిసెంబర్ 15, 1933 - ఏప్రిల్ 13, 2007) ప్రసిద్ధ తెలుగు నవలా, కథా రచయిత్రి..
జీవిత సంగ్రహం
ఈమె గుంటూరు జిల్లా చేబ్రోలులో ఆమె జన్మించింది. ఈమె తల్లిదండ్రులు వాసిరెడ్డి రాఘవయ్య, రంగనాయకమ్మ. చిన్నతనంలోనే చెన్నై చేరుకున్నారు. ఈమె చదివింది ఐదవ తరగతి వరకే అయినా ప్రైవేట్ గా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణులయ్యారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., ఎమ్.ఎ. పూర్తిచేశారు. ఈమె రచించిన మొదటి నవల జీవితం అంటే (1950), తొలి కథ సాంబయ్య పెళ్ళి (1952). అప్పటినుండి ఈమె సుమారు 39 పైగా నవలలు, 100 పైగా కథలు రచించారు.
ఈమె నక్సలిజం గురించి 1982 సంవత్సరంలో రచించిన మరీచిక నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత ఆరుద్ర వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై హైకోర్టు కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఈమె రచించిన మట్టి మనిషి (2000) నవల 14 భాషలలోకి అనువదించబడింది.
ఈమె నవలల్లో కొన్ని తెలుగు సినిమాలుగా మరికొన్ని దూరదర్శన్ సీరియల్లుగాను నిర్మించబడ్డాయి. సమత నవల ఆధారంగా ప్రజా నాయకుడు, ప్రతీకారం నవలను మనస్సాక్షి సినిమాగా, మానినీ మనసును ఆమె కథ సినిమాలుగా వచ్చాయి. మృగతృష్ణ నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు.
ఈమె జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈమె 1985 - 1991 మధ్యకాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సేవలందించారు.
ఈమె సాహిత్య స్వర్ణోత్సవ వేడుకలు 1998 సంవత్సరంలో ఘనంగా నిర్వహించారు.
అవార్డులు
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం - ఐదు సార్లు
- ఆత్మగౌరవ పురస్కారం
- శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం - గౌరవ డి.లిట్. (1989).
- శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం - గౌరవ డి.లిట్. (1989)
- తెలుగు విశ్వవిద్యాలయం - జీవితకాల సాఫల్య పురస్కారం (1996)
- 1994లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యలో విశిష్ట పురస్కారం
బిరుదము
ఆంధ్రపెర్ల్బక్
రచనలు
- జీవితం అంటే (1950)
- మరీచిక (1982)
- విషకన్య
- తిరస్కృతి
- రాక్షస నీడ
- వైతరణి
- మరో సావిత్రి కథ (యథార్థగాథలు) (1983)
- సమత (1997)
- మట్టి మనిషి (2000)
- అడవి మల్లె (2003)
- ఉరి త్రాడు (2003)
- వెన్నెల మండుతోంది (2003)
- మరో దయ్యం కథ (2003)
- కోతి కొబ్బరికాయ (2003)
- రాబందులు రామచిలకలు (2003)
- మృగతృష్ణ (2003)
- సావేరి (2003)
- ఊర్మిళ (2004)
- తొణికిన స్వప్నం (2004)
- మళ్ళీ తెల్లవారింది (2004)
- బొమ్మరిల్లు (2004)
- నింగి నుండి నేలకు (2006)
- హసీనా (2006)
- బంధితుడు (2006)
- ప్రతీకారం (2006)
అనువాదాలు
- మృత్యుంజయుడు (1988) శివసాగర్ మిశ్ర రచించిన "అక్షత్" హిందీ నవలకు తెలుగు అనువాదం.[1]
మూలాలు
బయటి లింకులు
- వాసిరెడ్డి జర్నల్ లో సీతాదేవి జీవితచరిత్ర. Archived 2011-07-22 at the Wayback Machine.
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).