"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వికీపీడియా:పైపు లింకు

From tewiki
Jump to navigation Jump to search

పైపు లింకు అనేది ఒక వికీపీడియా లింకే. అయితే లింకు ఏ పేజీకైతే ఇచ్చామో ఆ పేజీ పేరు, లింకు పేరు వేరు వేరుగా ఉంటాయి. మామూలు లింకులా కాక దీనిలో రెండు పదాలు ఉంటాయి. ఈ రెండు పదాలను పైపు గుర్తుతో వేరు చేసి రాస్తాం - [[హైదరాబాదు|రాజధాని]] - ఇలాగ. అంచేత దీనికి పైపు లింకు అని పేరు వచ్చింది. ఉదాహరణకు, [[హైదరాబాదు|రాజధాని]] అనేది రాజధాని గా కనిపిస్తుంది, కానీ లింకు మాత్రం హైదరాబాదు పేజీకి వెళ్తుంది.

ఉపయోగం

వాక్యంలో ఎక్కడైనా ఒక పదానికో పదబంధానికో లింకును ఇచ్చేటపుడు వాక్యంలోని ఆ పదబంధాన్ని మార్చనక్కరలేకుండా లింకును ఇచ్చేందుకు పైపు లింకు వాడతాం. దీని అవసరం కింది సందర్భాలలో వస్తుంది:

  1. లింకు ఇస్తున్న పేజీ పేరు యథాతథంగా వాక్యంలో ఇమడనపుడు,
  2. ఆ పదానికి ఒకటి కంటే ఎక్కువ పేజీలున్నపుడు (అయోమయ నివృత్తి పేజీలోని ఖానాపూర్ ఉదాహరణ చూడండి).

ఎప్పుడు వాడకూడదు

అన్నిటి కంటే ముందు, లింకులు వీలైనంత సింపులుగా ఉంచండి:

  • అవసరమైనంత కంటే పొడుగ్గా పెట్టకండి:

☒N [[నరేంద్ర మోదీ|ప్రధాని నరేంద్ర మోదీ]]

checkY ప్రధాని [[నరేంద్ర మోదీ]]

  • దారిమార్పు పేజీకి వెళ్ళకుండా నివారించేందుకు పైపు లింకులు పెట్టడమనేది ఏమంత మంచి పద్ధతి కాదు:

☒N [[చెన్నై|మద్రాసు]]

checkY [[మద్రాసు]]

మద్రాసు అనే దారిమార్పు పేజీకే లింకు ఇవ్వాలి గాని, [[చెన్నై|మద్రాసు]] అనే పైపు లింకు పెట్టకూడదు. అవసరం లేని చోట పైపు లింకును వాడితే వికీటెక్స్టును చదవడం కష్టమౌతుంది. పైగా, దారిమార్పు పేజీకి వెళ్ళే లింకుల సంఖ్యను బట్టి, ఆయా లింకులకు ప్రత్యేకించి పేజీని సృష్టించాలా అనేది తెలుస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో ఆ పేజీ సృష్టిస్తే, ఆయా లింకులను సవరించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు: [[మద్రాసు]] అనే లింకు ప్రస్తుతం చెన్నైకి దారిమార్పు అవుతోంది. భవిష్యత్తులో పాత పేరు "మద్రాసు"కు ప్రత్యేకంగా పేజీ ఉండాలని నిర్ణయించి దానికోసం ఓ కొత్త పేజీ సృష్టించామను కోండి.. అప్పుడు వివిధ పేజీల్లో [[మద్రాసు]] అనే లింకులన్నీ ఈ కొత్త పేజీకి ఆటోమాటిగ్గా వెళ్ళిపోతాయి. అలాక్కాకుండా [[చెన్నై|మద్రాసు]] అనే లింకు పెడితే, వాటన్నిటినీ మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది.
  • పదం చివర ప్రత్యయం చేరితే, ఆ పదం వరకే లింకు ఇవ్వాలి:

☒N [[చెన్నై|చెన్నైలో]]

checkY [[చెన్నై]]లో

అయితే, అన్ని ప్రత్యయాలకూ ఇది కుదరదు. ఉదాహరణకు "అనంతపురం మండలానికి" అనే పదాల్లో "అనంతపురం మండలం" అనే పదాలను విడగొట్టి లింకు ఇవ్వలేం. ఆ సందర్భాల్లో పైపు లింకు ఇవ్వవచ్చు.

వర్గాల్లో పైపు లింకులు

వర్గం లింకుల్లో ఇచ్చే పైపు లింకుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పేజీ ఆ వర్గంలో ఏ అక్షరం కింద చేరాలి అనేదాన్ని ఈ పైపు లింకులో పైపు తర్వాత రాసే మొదటి అక్షరం నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు అనే పేజీలో వర్గం:ఆంధ్రప్రదేశ్ అని రాసి వదిలేస్తే, ఈ పేజీ ఆ వర్గంలో "ఆ" అక్షరం కింద ఉన్న జాబితా లోకి చేరుతుంది. ఆంధ్రప్రదేశ్ పట్టణాలు, ఆంధ్రప్రదేశ్ నగరాలు, ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ నదులు,... ఇలా "ఆంధ్రప్రదేశ్" తో మొదలయ్యే కొన్ని వందల పేజీలు ఉంటాయి. ఈ పేజీలన్నిటి లోనూ వర్గాన్ని ఇలాగే, వర్గం:ఆంధ్రప్రదేశ్ అనే రాస్తే, ఈ పేజీలన్నీ కూడా ఆ వర్గంలో "ఆ" అక్షరం కిందకే చేరుతాయి. ఇక అక్షరాకు అనుగుణంగా వర్గీకరించి ప్రయోజనం ఉండదు. దీన్ని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు అనే పేజీలో వర్గాన్ని వ్యక్తులు అని పైపు లింకు పెట్టి రాస్తే, ఈ పేజీ ఆంధ్రప్రదేశ్ వర్గంలో "వ" అక్షరం కిందికి చేరుతుంది. "సోర్స్ ఎడిటింగు" పద్ధతిలో దిద్దుబాటు చేసేటపుడు ఇలా చెయ్యాలి. నిజానికి వ్యక్తులు అని పూర్తి పదం రాయాల్సిన పని లేదు, "వ్య" అని మొదటి అక్షరం రాస్తే సరిపోతుంది -ఎందుకంటే మొదటి అక్షరం ఏదైతే, వర్గంలో ఆ అక్షరం కిందనే ఈ పేజీ చేరుతుంది కబట్టి.

విజువల్ ఎడిటింగు పద్ధతిలో దిద్దుబాటు చేసేటపుడు, "వర్గాలు" అనే డయలాగ్ పెట్టెలో వర్గం పేరు రాసాక, కింద ఉన్న "ఈ పేజీని క్రమబద్ధీకరించువిధము" అనే టెక్స్టు బాక్సులో "వ్యక్తులు" అని రాయాలి. ఈ పద్ధతిలో కూడా మొదటి అక్షరం రాస్తే సరిపోతుంది.

మూసల్లో

మూసల్లో కూడా పైపు వాడతారు కానీ అక్కడ పైపు ఉపయోగం పూర్తిగా వేరు. మూసల్లో పారామీటర్లు ఇచ్చేందుకు పైపును వాడుతారు.

ఇవి కూడా చూడండి