"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వికీపీడియా:మర్యాద

From tewiki
Jump to navigation Jump to search


వికీపీడియా నుండి

(వికీపీడియా:మర్యాద నుండి దారిమార్పు చెందింది)

Jump to navigationJump to search

ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి.
అడ్డదారి:

WP:WQT

వికీపీడియా సంపాదకులు అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు చెందినవారు. ప్రతి ఒక్కరికీ విభిన్న ఆలోచనా ధోరణులు, భిన్న అభిప్రాయాలు, దృష్టికోణాలు ఉండవచ్చు. ఇతర సంపాదకులను, సభ్యులను గౌరవించడము, ఆదరించడం, కలసికట్టుగా సమన్వయముగా తెలుగులో ఇలాంటి మహోన్నత విజ్ఞాన సర్వస్వము రూపొందించుటకు ఒక కీలకాంశము.

ఈ పేజీలో కొన్ని వికీ మర్యాద యొక్క కీలకాంశాలు ఇవ్వబడినవి. వికీ మర్యాద (వికీపీడియాలో పనిచేసేటప్పుడు ఇతరులతో ఎలా వ్యవహరించాలో కొన్ని సూచనలు, సలహాలు) ఇంకా మౌలిక నిర్దేశాల కొరకు విధానాలు, మార్గదర్శకాలు పేజీ చూడండి.

వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు
వ్యాసరచన నియమాలు
తటస్థ దృక్కోణం

నిర్ధారింప తగినది మౌలిక పరిశోధనలు నిషిద్ధం జీవించి ఉన్నవారి చరిత్రలు విషయ ప్రాముఖ్యత

ఇతర సభ్యులతో ప్రవర్తన
మర్యాద

ఏకాభిప్రాయం వ్యక్తిగత దూషణలు వద్దు వివాదాల పరిష్కారం చట్టపరమైన బెదిరింపులు వద్దు

సర్వత్ర నియమావళి
ఏది వికీపీడియా కాదు

అన్ని నియమాలను బేఖాతరు చెయ్యండి

విషయ సూచిక

 • 1మర్యాదకు మూలసూత్రాలు
 • 2చర్చాపేజీల్లో దుశ్చర్యను నివారించడం ఎలా?
  • 2.1మదిలో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలు
  • 2.2మర్యాద పూర్వక చర్చపై మరిన్ని చిట్కాలు
  • 2.3మరిన్ని సలహాలు

మర్యాదకు మూలసూత్రాలు[మార్చు]

 • అవతలివారిని విశ్వసించండి. స్వేచ్ఛగా దిద్దుబాటు చెయ్యడమనే సూత్రంపై ఆధారపడి వికీపీడియా పనిచేస్తూంది. ఎవరైనా ఇక్కడకు వచ్చి తమతమ విజ్ఞానాన్ని పంచవచ్చు.
 • ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలనుకుంటారో, మీరు వారితో అలాగే వ్యవహరించండి.
 • దయచేసి మర్యాదగా ఉండండి!
  • ప్రజలు మిమ్మల్ని చూడలేరు, మీ మూడ్ ఎలా ఉందో వారికి తెలియదు. కఠినమైన, పరుషమైన పదజాలం దురుసుగా అనిపిస్తాయి. మీరు ఎంచుకునే పదజాలం విషయంలో జాగ్రత్తగా ఉండండి — ఇతరులు అర్థం చేసుకునేది, మీరు చెప్పదలచుకున్నది కాకపోవచ్చు.
 • చర్చాపేజీల్లో సంతకం చెయ్యండి (వ్యాసాల్లో కాదు!).
 • ఓ అంగీకారానికి రావడం కోసం ప్రయత్నించండి.
 • విషయంపై వాదించండి, వ్యక్తులపై కాదు.
 • ప్రశ్నలను ఎదుర్కోండి, తప్పుకోకండి.
  • ఇతర సభ్యులు మీ దిద్దుబాటుతో అంగీకరించకపోతే, అది సరైనదని ఎందుకు అనుకుంటున్నారో సకారణంగా వివరించండి.
 • అవతలివారు చెప్పేది సరి అని అనిపిస్తే ఒప్పేసుకోండి; మీ వ్యతిరేకత మీ అభిరుచి ప్రకారమే అయితే అదే విషయాన్ని ఒప్పేసుకోండి.
  • మీరు చెప్పని విషయాలపై ప్రజలు చర్చించుకునేలా చెయ్యకండి.
 • మర్యాదగా ఉండండి.
 • చర్చ మంచి వేడిగా ఉన్నపుడు, అవతలి వారు మీరు ఆశించినంత మర్యాదగా ప్రవర్తించనపుడు, మీరు వారి కంటే ఎక్కువ మర్యాదగా ఉండండి. తక్కువ మర్యాదగా కాదు.
  • ఆ విధంగా ఘర్షణను సృష్టించిన పాపం మీకు చుట్టుకోదు. ఓ దెబ్బ తిన్నాక కూడా ఎదురుదాడి చెయ్యకుండా సంయమనంగా వ్యవహరించినట్లు. చూసేవాళ్ళంతా దీన్ని హర్షిస్తారు. (కనీసం హర్షించాలి).
  • అయితే, వారు మాట్లాడే విధానం మీకు నచ్చలేదని స్పష్టంగా చెప్పండి. లేకపోతే మీరు మరీ తోలుమందం కాబోలని మరింత రెచ్చిపోగలరు వాళ్ళు. మీకు తెలియకుండానే వాళ్ళను ప్రోత్సహించినట్టవుతుంది.
 • మీది తప్పైనపుడు మన్నించమని అడిగేందుకు వెనకాడకండి.
  • "అయ్యో అలా అనకుండా ఉండాల్సింది" అని తరువాత అనుకునే సందర్భాలు చర్చల్లో వస్తాయి. అలా అనిపించినపుడు అదేమాట చెప్పెయ్యండి.
 • మన్నించండి, మరచిపోండి.
 • మీకు ఆప్తమైన విషయాలను గమనింపులో పెట్టుకుని వాటి పట్ల పక్షపాతంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండండి.
 • అభినందించాల్సినపుడు అభినందించండి. ప్రతివారూ మెప్పుదలను కోరుకుంటారు. సభ్యుని చర్చాపేజీలో మీ మెప్పుదలను వ్రాయండి.
 • మీరు సృష్టించిన వివాదాలు ముగిసాక, వాటిని తీసెయ్యండి.
 • వాదనలో పాల్గొన్న వారిలో మీరూ ఉంటే, కొన్నాళ్ళు తప్పుకోండి. మీరు మధ్యవర్తిత్వం చేస్తుంటే, తప్పుకొమ్మని వివాదగ్రస్తులకు చెప్పండి.
  • ఓ వారం తరువాత తిరిగి రండి. మధ్యవర్తి కావాలని మీకు అనిపిస్తే, అప్పటికింకా ఎవ్వరూ రంగంలో లేకపోతే, ఎవరో ఒకరిని అడగండి.
  • వివాదాస్పద వ్యాసం నుండి తప్పుకుని మరో వ్యాసంపై పనిచెయ్యండి. వికీపీడియాలో 70,468 వ్యాసాలున్నాయి!
 • ఏది వికీపీడియా కాదో గుర్తుకు తెచ్చుకోండి.
 • సాధ్యమైనంత వరకు పేజీని వెనక్కు తిప్పడాలు, తొలగింపులకు దూరంగా ఉండండి. 3RR నియమాన్ని మరువకండి.
  • దిద్దుబాటు చెయ్యండి, చర్చించండి.

చర్చాపేజీల్లో దుశ్చర్యను నివారించడం ఎలా?[మార్చు]

తమ పని పట్ల, తమ దృక్కోణం పట్ల చాలామంది గర్వంగా ఉంటారు. దిద్దుబాట్లు జరిగినపుడు అహాలు దెబ్బతినే అవకాశం ఉంది. కానీ చర్చాపేజీలు ప్రతీకారం తీర్చుకునే వేదికలు కావు. దెబ్బతిన్న అహాలను సమాధాన పరచేందుకు చక్కటి స్థలాలవి. వ్యాసాల విషయంలో తలెత్తిన అభిప్రాయ భేదాల నిర్మూలనా స్థలం ఈ చర్చపేజీలు.

మదిలో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలు[మార్చు]

 • వికీపీడియా వ్యాసాలు అన్ని దృక్కోణాలను చూపించాలి. వివిధ దృక్కోణాల్లో ఏది సరైనది అనే విషయాన్ని చర్చించేందుకు చర్చాపేజీ వేదిక కాదు. ఆ పనికోసం Usenet, బ్లాగు ల వంటి అనేక ఇతర వేదికలున్నాయి. వ్యాసంలోని ఖచ్చితత్వం, తటస్థత మొదలైన విషయాల గురించి మాత్రమే చర్చాపేజీల్లో చర్చించాలి.
 • మీతో ఎవరైనా విభేదిస్తే, దానర్థం (1) మీరంటే వారికిష్టం లేనట్లో, (2) వారు మిమ్మల్ని మూర్ఖుడిగా భావిస్తున్నట్లో, (3) వారు మూర్ఖులైనట్లో, (4) ఆ వ్యక్తి దుష్టుడనో, మరోటో కాదు. వ్యాసాలపై ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయాలను వ్యాసం వరకే పరిమితం చెయ్యండి.
 • వికీపీడియా మిమ్మల్ని చొరవగా దిద్దుబాట్లు చెయ్యమంటోంది. చర్చ మొదలుపెట్టే ముందు ఓ ప్రశ్న వేసుకోండి: దీన్ని చర్చించాల్సిన అవసరం ఉందా? ఓ దిద్దుబాటు సారాంశాన్ని రాసి, అవతలి వారి స్పందన కోసం ఎదురు చూడొచ్చా?
 • వ్యాసం పేజీలో చర్చించాల్సిన అవసరం లేనపుడు, ఈమెయిల్లోనో, మీ చర్చాపేజీ లోనో చర్చించవచ్చు.

మర్యాద పూర్వక చర్చపై మరిన్ని చిట్కాలు[మార్చు]

 • మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా చెప్పండి -మరీ ముఖ్యంగా చర్చలో గత వ్యాఖ్యకు సమాధాన మిచ్చేటపుడు
  • గత వ్యాఖ్యను ఉదహరిస్తే మంచిది. మీరా వ్యాఖ్యను ఎలా అర్థం చేసుకున్నారో రాస్తే మరింత మంచిది. అవతలి వారి అభిప్రాయం తప్పని రాసేటపుడు మీరు వారిని సరిగా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చని ముందే రాయండి.
 • సభ్యులకు గానీ, వారి దిద్దుబాట్లకు గానీ పేర్లు పెట్టకండి. వారిపై వ్యక్తిగత దాడులు చెయ్యకండి.
  • "పిచ్చి రాతలు", "తప్పుడు రాతలు" వంటి మాటలు రాయకండి. అటువంటి మాటలు అవతలి వారిని బాధిస్తాయి. చర్చ సాఫీగా జరగదు.

మరిన్ని సలహాలు[మార్చు]

 • ఇతరులను స్వాగతించండి (పాతవారిని కూడా; వారు మీకు నచ్చకున్నా సరే)
 • స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పండి
 • రెండో చెంప చూపించండి (దిద్దుబాటు యుద్ధాల్లో పాల్గొనకండి)
 • అభినందించండి, ముఖ్యంగా మీకు తెలియనివారిని (ఎక్కువ మంది అభినందనను కోరుకుంటారు)
 • క్షమించండి.
కుదించు
 • v
 • t
 • e

Wikipedia key policies and guidelines

 • Five pillars
  • What Wikipedia is not
  • Ignore all rules
Content
 • Verifiability
 • No original research
 • Neutral point of view
 • What Wikipedia is not
 • Biographies of living persons
 • Image use
 • Article titles
 • Notability
 • Autobiography
 • Citing sources
 • Reliable sources
  • medicine
 • Do not include copies of lengthy primary sources
 • Plagiarism
 • Don't create hoaxes
 • Fringe theories
 • Patent nonsense
 • External links
 • Portal namespace
Conduct
 • Civility
 • Consensus
 • Editing policy
 • Harassment
 • Vandalism
 • Ignore all rules
 • No personal attacks
 • Ownership of content
 • Edit warring
 • Dispute resolution
 • Sock puppetry
 • No legal threats
 • Child protection
 • Paid-contribution disclosure
 • Assume good faith
 • Conflict of interest
 • Disruptive editing
 • Do not disrupt Wikipedia to illustrate a point
 • Etiquette
 • Gaming the system
 • Please do not bite the newcomers
 • Courtesy vanishing
 • Responding to threats of harm
Deletion
 • Deletion policy
 • Proposed deletion
  • Biographies
  • Books
 • Criteria for speedy deletion
 • Attack page
 • Oversight
 • Revision deletion
Enforcement
 • Administrators
 • Banning
 • Blocking
 • Page protection
Editing
 • Article size
 • Be bold
 • Disambiguation
 • Hatnotes
 • Talk page guidelines
  • Signatures
 • Broad-concept article
Style
 • Manual of Style
  • Contents
 • Accessibility
  • Understandability
 • Dates and numbers
 • Images
 • Layout
 • Lead section
 • Linking
 • Lists
Classification
 • Categories, lists, and navigation templates
 • Categorization
 • Template namespace
Project content
 • Project namespace
  • WikiProjects
 • User pages
  • User boxes
 • Shortcuts
 • Subpages
WMF
 • List of policies
 • Friendly space policy
 • Licensing and copyright
 • Privacy policy
 • Values
 • FAQ
 • List of all policies and guidelines
  • List of policies
  • List of guidelines
 • Lists of attempts in creating fundamental principles

వర్గాలు:

 • వికీపీడియా మార్గదర్శకాలు
 • వికీపీడియా వివాద పరిష్కారం