"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వికీపీడియా:సమాచార అన్వేషణ సంప్రదింపుల కేంద్రం

From tewiki
Jump to navigation Jump to search

ఛెస్

ఎవరైనా ఛెస్ ఇంగ్లీష్ వికిపెడియా నండి మూస పోసి ఇస్తె నాకు అనువాదము ఛెయ్యాలని ఉంది, లెకపోతే మూస ఎల పొయ్యలో ఛెప్పండి.

చాలా సంతోషం. క్రొత్త వ్యాసం ఆంగ్ల వికీ నుండి కాపీ చేసి ఇక్కడ ఉంచాను. చదరంగం (ఆట) మీరు అనువాదం ప్రారంభించవచ్చును. దయచెసి మూసలు, బొమ్మలు, రెఫరెన్సులు తొలగించవద్దు. వాటిని సరి చూసి నేను మారుస్తాను. ఏవైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో వ్రాయగోరెదను. - --కాసుబాబు 15:08, 2 మే 2007 (UTC)

క్రికెట్ నియమాలు

I want International cricket rules in telugu

క్రికెట్ వ్యాసం ద్వారా ఇంగ్లీషు వికీపీడియా వ్యాసపు లింకు కెళ్లి వివరాలు తెలుసుకొని తెలుగు వ్యాసంలో రాయండి. మీరు రాయలేకపోతే కోరిన వ్యాసాల లో చేర్చండి. --అర్జున 00:57, 4 డిసెంబర్ 2010 (UTC)

government orders

స్వతత్ర సమరయొధులకు ప్రభుత్వము వారు పధి ఏకరముల స్థలమును ఇవ్వదానికి జి.వొ నెమ్.946 ను ప్రకతిన్ఛినారు ఆ జి. వొ ని ఏలా పొన్దాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము#రాజ పత్రము దగ్గరి లింకు చూడండి. --అర్జున 07:16, 12 అక్టోబర్ 2010 (UTC)

medi

శరీరంలో ఇన్సులిన్ తయారు చేయు అవయవం ఏది?

పాంక్రియాస్, మరిన్ని వివరాలకు మధుమేహం చూడండి. --అర్జున 00:54, 4 డిసెంబర్ 2010 (UTC)

vyakaranam

nenu telugu vyakaranam gurinchi vetukuthunnanu

తెలుగు వ్యాకరణం చూడండి.Rajasekhar1961 (చర్చ) 15:51, 15 మార్చి 2013 (UTC)

సమాచార పెట్టేల గురించి

రచయితలకు చాలా చోట్ల వ్యక్తి సమాచార పెట్టెనే ఉపయోగించడం గమనించాను. రచయితలకు వేరుగా సమాచార పెట్టెలు తెలుగు వికీలో అభివృద్ధి కాలేదా. ఐతే ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 07:42, 20 ఫిబ్రవరి 2014 (UTC)

పవన్ సంతోష్ గారికి, ఇప్పటికి మీకు అర్ధమైవుంటుందనుకుంటాను. ఈ పేజీ కి సత్వరంగా స్పందన లేకపోవడం విచారకరం. --అర్జున (చర్చ) 00:56, 10 జూన్ 2015 (UTC):
అర్జున గారూ కరెక్టే పైన అడిగిన విషయాన్ని తెలుసుకుని, వాడుకుని చాన్నాళ్ళే అయింది. మొత్తానికి సంప్రదింపుల కేంద్రం స్థితిని తెలుసుకునేందుకైనా నా వ్యాఖ్య పనికివచ్చినందుకు సంతోషం.--పవన్ సంతోష్ (చర్చ) 05:21, 10 జూన్ 2015 (UTC)

en:Do not buy Russian goods!

Hello! Could you translate an article about boycott of Russian goods in Ukraine for the Telugu Wikipedia? Thanks for the help. --Trydence (చర్చ) 18:34, 11 అక్టోబరు 2014 (UTC)

కాపీరైట్ హక్కులు గురించి.

YesY సహాయం అందించబడింది

నమస్కారం.నా వద్ద కోలిన్ మెకంజీ బ్రిటీషు ప్రభుత్వంనకు సర్వేచేసి ఇచ్చిన గుంటూరు జిల్లా గ్రామ కైఫియ్యత్తులు గ్రంధంలు ఐదు భాగంలు ఉన్నవి.నేను కొద్ది కాలం క్రిందట "గ్రామ కైఫియ్యత్తులు" వికీపీిడియా పేజిని సృష్టించి కొంత సమాచారం పొందుపర్చాను.అయితే అందులో భాగంగా నా వద్ద ఉన్న కైఫియ్యత్తులు జె.పి.జి./పి.డి.యఫ్ రూపంలో పొందుపర్చుటకు కాపీరైట్ చట్టం వర్తించిందా? అనే సందేహం కలుగుచున్నది.ఆ గ్రంధంలు ఆంధ్రప్రదేశ్ ఆభిలేఖాగారం,హైద్రాబాదు వారు 1990కు ముందు ప్రచురించారు.కావున తెలిసినవారు చెప్పగలరు.

యర్రా (చర్చ) 15:19, 11 సెప్టెంబరు 2017 (UTC)

యర్రా గారూ మీరిచ్చిన మౌలిక సమాచారాన్ని ఆధారం చేసుకుని నా అభిప్రాయం చెప్తున్నాను.
  • కాపీహక్కుల ప్రశ్న గురించి - భారతదేశంలో ప్రచురించిన ఈ పుస్తకాలకు భారత కాపీహక్కుల చట్టాలు వర్తిస్తాయి. భారత కాపీహక్కుల చట్టాన్ని సరళంగా చెప్పదలిస్తే పుస్తక కాపీహక్కుదారుడు (వేరొకరికి ఇవ్వకపోతే రచయితే) చనిపోయిన 60 సంవత్సరాల తర్వాత కాపీహక్కులు చెల్లిపోతాయి. అవన్నీ పబ్లిక్ డొమైన్ లేదా ప్రజాపద్దులోకి వస్తాయి. అదే కాపీహక్కులు సంస్థ వద్ద ఉంటే మొదట ప్రచురితమైన తేదీ నుంచి 60 సంవత్సరాలలోపు చెల్లిపోతాయి. ఈ పద్ధతిలో చూస్తే - ఈ పుస్తకాలు ఎప్పుడో పబ్లిక్ డొమైన్లో ఉన్నట్టే.
  • వికీపీడియాలో ప్రచురించడం గురించి - వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఏది వికీపీడియా కాదు అన్న విషయం ఇక్కడ ఉంది చూడండి. కాబట్టి వికీపీడియా మౌలిక డాక్యుమెంట్లు, పత్రాలు, పుస్తకాలు ప్రచురించేందుకు చోటు కాదు. ఇందులో మెకంజీ గురించి, కైఫీయత్తుల గురించి ఉండొచ్చు కానీ, మెకంజీ కైఫీయత్తులు యధాతథంగా ఉండకూడదు. పబ్లిక్ డొమైన్లో ఉన్నవి కానీ, స్వేచ్ఛా నకలు హక్కుల్లో ఉన్నవి కానీ అయిన తెలుగు పుస్తకాలు పెట్టడానికి వికీపీడియా సోదర ప్రాజెక్టు తెలుగు వికీసోర్సు ఉంది. ఇక్కడ చేర్చడం ఎలా? పుస్తకాలను చేర్చి ఇండెక్స్ చేసి డిజిటైజ్ చేయడం ఎలా అన్న విషయంపై మరింత సమాచారం తెలుసుకోదలిస్తే మీకు ప్రత్యేకించి ఒక ఆన్-లైన్ లేక ఆఫ్-లైన్ శిక్షణ ఇవ్వడానికి నేను సిద్ధం. --పవన్ సంతోష్ (చర్చ) 06:20, 13 సెప్టెంబరు 2017 (UTC)

--పవన్ సంతోష్ గారు నా సందేహంనకు మీరు సమాచారం తెలిపినందుకు ధన్యవాదంలు.గమనించటమైనది.. 2017-09-18T20:55:38‎ యర్రా రామారావు

సందేహం druthaprakruthikam

సహాయం కావాలి.
దీనిని ఉపయోగించటానికి తగిన చర్చా పేజీలో, తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{సహాయం కావాలి}} ముూస చేర్చి ఆతరువాత మీ సందేహాన్ని లేక సమస్యను వివరించండి. ఒకవేళ కొంతమంది సభ్యులకు (ఉదాహరణకు మీకు సందేహమున్న పేజీలో చర్చావిషయమైన మార్పుని చేర్చినవారు, లేక మీ దృష్టిలో విషయంపై నైపుణ్యం కలవారు) ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే వివరణలో ఆ సభ్యుల వాడుకరిపేజీలకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది.
ఈ లోపల సహాయ సూచికను , సహాయం చేయబడిన పేజీలను , సహాయం కొరకు ప్రయత్నించి విఫలం అయిన పేజీలను, తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.

  • సహాయపడే వారికి గమనిక: మీరు నిర్వాహకులు కాకపోతే సహాయం చేసిన తరువాత {{సహాయం కావాలి}} మూసను మార్చవద్దు. సహాయం కోరిన వ్యక్తి గాని, స్పందన తరువాత నిర్వాహకులు మూసను {{సహాయం చేయబడింది}} తో మార్చవలెను. వారం రోజులలోగా స్పందనలు లేకపోతే {{సహాయం కావాలి-విఫలం}} తో మార్చి అలా మార్చినట్లు వ్యాఖ్య చేర్చండి.



Please explain in detail about druthaprakruthikam—157.44.52.102 08:06, 19 జనవరి 2021 (UTC)

క్షమించాలి. వికీపీడియాలో వెతికితే ఎటువంటి సమాచారం దొరకలేదు. --అర్జున (చర్చ) 05:07, 21 జనవరి 2021 (UTC)