"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

విక్రం రాథోర్

From tewiki
Jump to navigation Jump to search

విక్రం రాథోర్ (Vikram Rathour) భారత క్రికెట్ మాజీ క్రీడాకారుడు.

జీవిత విశేషాలు

అతను 1969 మార్చి 26పంజాబ్ లోని జలంధర్లో జన్మించాడు. ఇతడు 1996, 1997 కాలంలో భారత జట్టుకు 6 టెస్టులు, 7 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. వన్డేలలో 2 అర్థ సెంచరీలు సాధంచాడు. అతను కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్ మాన్. 146 మ్యాచ్‌ల్లో 49.66 సగటుతో 11473 పరుగులు సాధించిన రాథౌర్ ఫస్ట్ క్లాస్ స్థాయిలో ముఖ్యమైన పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. అతని లిస్టు-A కెరీర్ మరింత నిరాడంబరంగా ఉంది. అతను 99 మ్యాచ్‌ల్లో కేవలం 3000 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతను భారత క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా ఉన్నాడు[1].

2012 సెప్టెంబరు 27 న విక్రమ్ రాథౌర్‌ను నార్త్ జోన్ నుంచి జాతీయ సెలెక్టర్‌గా నియమించారు.[2]

అంతర్జాతీయ కెరీర్

విక్రమ్ రాథౌర్ 2003 నవంబరులో ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. తన టెస్ట్ కెరీర్లో, అతను 10 ఇన్నింగ్స్, ఆరు మ్యాచ్‌లలో 131 పరుగులు చేశాడు[3]. దక్షిణాఫ్రికాతో ది వాండరర్స్‌లో అతను అత్యధికంగా 44 పరుగులు చేశాడు. కోచ్ బిషన్ సింగ్ బేడి సారథ్యంలో రంజీ ట్రోఫీని గెలుచుకున్న జట్టులో రాథోర్ సభ్యుడు.
మూలాలు

  1. https://economictimes.indiatimes.com/magazines/panache/meet-vikram-rathour-indias-new-batting-coach-who-boasted-of-an-impressive-form-during-the-90s/articleshow/70814852.cms?from=mdr
  2. "Patil is Chief Selector, Amarnath exits". Wisden India. 27 September 2012. Archived from the original on 8 డిసెంబర్ 2012. Retrieved 25 ఏప్రిల్ 2020. Check date values in: |access-date= and |archive-date= (help)
  3. "Vikram Rathour retires". The Hindu. November 5, 2003. Retrieved 2017-02-16.