"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
విజయ్ మర్చంట్
![]() | ||||
విజయ్ మర్చంట్ | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | విజయ్ సింగ్ మాధవ్‌జీ మర్చంట్ | |||
జననం | బాంబే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా | 12 అక్టోబరు 1911|||
మరణం | 27 అక్టోబరు 1987 బాంబే, మహారాష్ట్ర, భారతదేశం | (వయస్సు 76)|||
బ్యాటింగ్ శైలి | కుడి చేతి వాటం | |||
బౌలింగ్ శైలి | రైట్ ఆర్మ్ మీడియం | |||
పాత్ర | బ్యాట్స్ మాన్ | |||
అంతర్జాతీయ సమాచారం | ||||
జాతీయ జట్టు | భారతదేశం | |||
టెస్టు అరంగ్రేటం(cap 15) | 15 డిసెంబర్ 1933 v ఇంగ్లాండ్ | |||
చివరి టెస్టు | 2 నవంబర్ 1951 v ఇంగ్లాండ్ | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
1929–1951 | బాంబే | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | టెస్టులు | ఫస్ట్ క్లాస్ | ||
మ్యాచులు | 10 | 150 | ||
చేసిన పరుగులు | 859 | 13470 | ||
బ్యాటింగ్ సరాసరి | 47.72 | 71.64 | ||
100s/50s | 3/3 | 45/52 | ||
అత్యధిక స్కోరు | 154 | 359* | ||
బౌలింగ్ చేసిన బంతులు | 54 | 5,087 | ||
వికెట్లు | 0 | 65 | ||
బౌలింగ్ సరాసరి | – | 32.12 | ||
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 0 | 1 | ||
మ్యాచ్ లో 10 వికెట్లు | 0 | 0 | ||
ఉత్తమ బౌలింగ్ | – | 5/73 | ||
క్యాచులు/స్టంపులు | 7/– | 115/– | ||
Source: ESPNcricinfo, 21 మార్చ్ 2019 |
బాల్యం, జీవిత విశేషాలు
1911, అక్టోబర్ 12న జన్మించిన విజయ్ మర్చంట్ (Vijaysingh Madhavji Merchant) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 71.64 సగటును కలిగియుండి ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మెన్ తరువాత అత్యధిక సగటు కలిగిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.భారతదేశపు దేశవాళీ క్రికెట్ టోర్నమెంటు రంజీ ట్రోఫిలో మరింతమెరుగ్గా 98.75 సగటును కలిగియున్నాడు.
విజయ్ మర్చంట్ 10 టెస్టులు ఆడి 47.72 సగటుతో 859 పరుగులు సాధించాడు. అందులో 3 సెంచరీలు, 3 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో అతడి అత్యధిక స్కోరు 154 పరుగులు. ఈ స్కోరును అతని చివరి టెస్టులో ఇంగ్లాండుపై ఢిల్లీలో 1951-52లో సాధించాడు. ఇదే టెస్టులో ఫీల్డింగ్ చేయుసమయంలో దురదృష్టవశాత్తు భుజానికి గాయమై క్రికెట్ నుంచే నిష్క్రమించవలసి వచ్చింది.
1937లో విజ్డెన్ ప్రకటించిన క్రికెటర్ ఆఫ్ దొ ఇయర్ అవార్డు పొందిన ఐదుగురిలో విజయ్ మర్చంట్ ఒకరు. అంతేకాదు భారతదేశం నుంచి టెస్ట్ క్రికెట్లో సెంచరీ పూర్తిచేసిన తొలి బ్యాట్స్మెన్లలో విజయ్ ఒకడు. తన తొలి సెంచరీని 1951-52లో ఇంగ్లాండుపై 40 ఏళ్ళ వయసులో సాధించాడు.
మరణం
1987, అక్టోబర్ 27న విజయ్ మర్చంట్ మరణించాడు.