"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
విద్యుత్ చేప
Jump to navigation
Jump to search
↑ "Electrophorus electricus". The IUCN Red List of Endangered Species. Retrieved 2014-06-07.
విద్యుత్ చేప | |
---|---|
![]() | |
Scientific classification | |
Kingdom: | Animalia
|
Phylum: | |
Superclass: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | Electrophorus T. N. Gill, 1864
|
Species: | E. electricus
|
Binomial name | |
Electrophorus electricus (Linnaeus, 1766)
|
విద్యుత్ చేప లేదా ఎలక్ట్రిక్ ఈల్ ఒక రకమైన చేప. తన శరీరం నుండి దాదాపు 650 ఓల్టుల విద్యుత్ శక్తిని విడుదలచేయడం వీటి ప్రత్యేకత.
విశేశాలు
- ఎలక్ట్రిక్ ఈల్ శరీరం నుంచి సుమారు 650 వోల్టుల విద్యుత్‌ను విడుదల చేస్తుంది. ఈ కరెంట్ ప్రభావంతో గుర్రం లాంటి జంతువులు సైతం కింద పడి గిలగిల కొట్టుకుంటాయి.
- దీని ప్రత్యేకత శత్రు జీవికి కరెంటు షాకివ్వడమే కాదు. వాటి నాడీవ్యవస్థపై ప్రభావం చూపి వాటి కండరాల్ని సైతం నియంత్రిస్తుంది. అంటే ఇదో రిమోట్‌లా పనిచేస్తూ దూరం నుంచే విద్యుత్ సంకేతాలు పంపి శత్రు జీవిని అదుపులోకి తెచ్చుకుంటుందన్నమాట. వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రజ్ఞులు ఈ కొత్త సంగతి కనిపెట్టారు. ఈల్ చేపల్లో ఎలక్ట్రిక్ షాక్‌ను విడుదల చేసే వ్యవస్థ గురించి పరిశోధన చేసినప్పుడు ఈ విషయం బయట పడింది. ఆధునిక కెమెరాల్ని, విద్యుత్ ఉనికిని పసిగట్టే సున్నితమైన పరికరాలను వాడి ఈ కొత్త విషయాలు కనుగొన్నారు.
- సుమారు ఎనిమిదడుగుల పొడవు ఎదిగే ఈల్ చేపల్లో మూడు రకాల వోల్టేజ్ ఆర్గాన్స్ ఉంటాయి. మొదటి రెండు అవయవాలు తక్కువ వోల్టేజీని ప్రసరిస్తూ పరిసరాల్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. మూడోది మాత్రం ఎక్కువ వోల్టేజీని విడుదల చేయగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఏ శత్రుజీవి అయినా దాడికి వచ్చినప్పుడు ఇవి దీన్ని ఉపయోగిస్తాయి. అంటే మొదటి రెండు అవయవాలతో చుట్టుపక్కల దాగున్న శత్రు జీవుల్ని పసిగట్టేసి మూడో దాంతో వేటాడేస్తాయన్నమాట.
- పెద్ద ఎలక్ట్రిక్ ఈల్స్ 12 బల్బులు వెలగడానికి సరిపోయేంత విద్యుత్‌ను విడుదల చేస్తాయి.
- ఈ చేపల్లో దాదాపు ఆరు వేలకు పైగా ఎలక్ట్రిక్ కణాలుంటాయి. ఈ కణాలే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో కణం 0.1 వోల్టేజి విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు.
- కొన్ని ఎలక్ట్రిక్ ఈల్స్ 50 కార్లను స్టార్ట్ చేసే విద్యుత్‌ను పుట్టించగలవు.
- ఎక్కువగా మట్టి నీళ్లలో ఉండే ఇవి పది నిమిషాలకోసారి బయటకొస్తాయి.
మూలాలు
బయటి లంకెలు
![]() |
Wikispecies has information related to: Electrophorus electricus |
![]() |
Wikimedia Commons has media related to Electrophorus electricus. |
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో విద్యుత్ చేపచూడండి. |
- 1954 educational film about the electric eel from the Moody Institute of Science
- "Electrophorus electricus". Integrated Taxonomic Information System. Retrieved 11 March 2006.
- Interview with Fear Factor contestant