వినోదరాయునిపాలెము

From tewiki
Jump to navigation Jump to search


వినోదరాయునిపాలెము
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

వినోదరాయునిపాలెము, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1] ఎస్.టి.డి కోడ్: 08593.

గ్రామం పేరు వెనుక చరిత్ర

పూర్వం నోరుతిరగని వాళ్ళు ఈగ్రామాన్ని 'ఎనిద్రోడిపాలెం'అనేవారు.

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

చేజర్ల 3 కి.మీ, తిమ్మసముద్రం 3 కి.మీ, కనుపర్తి 4 కి.మీ, అమ్మనబ్రోలు 5 కి.మీ, రాపర్ల 5 కి.మీ.

సమీప మండలాలు

దక్షణాన కొత్తపట్నం మండలం, ఉత్తరాన చినగంజాము మండలం, పశ్చిమాన ఒంగోలు మండలం, పశ్చిమాన మద్దిపాడు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

కీ.శే.టంగుటూరి ప్రకాశం పంతులుగారి స్వస్థలమైన ఈ గ్రామంలో, వారి 146వ జయంతి సందర్భంగా, 2017, ఆగస్టు-23న, ఈ పాఠశాల ఆవరణలో, నూతనంగా నెలకొల్పిన వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. [7]

గ్రామ పంచాయతీ

ఈ పంచాయితీ గ్రామంలో 500 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ యానాదులకు కాలనీ కట్టించారు.

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ ఉన్నం రవిబాబు సర్పంచిగా ఎన్నికైనారు. వీరు 2016, డిసెంబరు-27న పదవిలో ఉండగానే, అనారోగ్యంతో హైదరాబాదులోని ఆసుపత్రిలో, చికిత్స పొందుచూ కన్నుమూసినారు. అనంతరం శ్రీ తోట శ్రీనివాసరావు, ఈ గ్రామ సర్పంచిగా పదవీ బాధ్యతలు చేపట్టినారు. [3], [4]&[6]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ కోదండ రామాలయం

వినోదరాయనిపాలెం గ్రామంలోని పల్లెపాలెంలో ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో, నూతనంగా నిర్మించనున్న ఈ ఆలయానికి, 2017, మార్చి-14వతేదీ సోమవారంనాడు వేదపండితుల ఆధ్వర్యంలో, శంకుస్థాపన కార్యక్రమం, శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ - సమరసత సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో, గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినారు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జన్మస్థలం. వారు చిన్నప్పుడు కొన్నాళ్ళు ఈ గ్రామంలోనే నివసించారు. వారి ఇంట్లో ఇప్పుడు ఆయన స్నేహితుడు శ్రీ నడిపినేని వెంకటప్పయ్య మనుమడు శ్రీ నడిపినేని రామారావు నివసించుచున్నారు. ప్రకాశం పంతులు గారి విగ్రహం కూడా ఉంది. [2]

గ్రామ విశేషాలు

రాష్ట్రప్రభుత్వ సలహాదారు శ్రీ పరకాల ప్రభాకర్, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [6]

మూలాలు

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ది హిందు దినపత్రిక, 2011, సెప్టెంబరు-27. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, జూలై-14; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, డిసెంబరు-29; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, మార్చి-14; 1వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2017, ఆగస్టు-10; 15వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2017, ఆగస్టు-24; 11వపేజీ.