"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వినోదా పిక్చర్స్

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Stree sahasam poster.jpg
వినోదా పిక్చర్స్ వారి తొలిచిత్రం స్త్రీ సాహసం పోస్టర్.

వినోదా పిక్చర్స్ తెలుగు సినీ నిర్మాణసంస్థ. దీనిని డి.ఎల్.నారాయణ, సముద్రాల రాఘవాచార్య, సి.ఆర్. సుబ్బరామన్, వేదాంతం రాఘవయ్య కలిసి స్థాపించారు. వీరు నిర్మించిన తొలి చిత్రం స్త్రీ సాహసం 1951లో విడుదలైనది.

వీరు తరువాత శాంతి (1952), దేవదాసు (1953) సినిమాలను నిర్మించారు. శరత్ చంద్ర చటర్జీ నవల ఆధారంగా నిర్మించిన దేవదాసు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత కన్యాశుల్కం (1955), చిరంజీవులు (1956) చిత్రాల్ని నిర్మించారు.

వీరు ఆ తర్వాత సంస్థ పేరును చందమామ ఫిలిమ్స్గా మార్చి దొంగల్లో దొర (1957), సిపాయి కూతురు (1959), దొరికితే దొంగలు (1965) నిర్మించారు.

తర్వాత డి.ఎల్.నారాయణ, సీతారాంతో కలసి పద్మా పిలిమ్స్ గా మార్చి ఏకవీర (1969) చిత్రాన్ని నిర్మించారు.

మూలాలు

  • వెండితెర, 20వ శతాబ్దపు తెలుగు సినిమా సంక్షిప్త చరిత్ర, రచన: ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2004.