వినోద్ మెహతా

From tewiki
Jump to navigation Jump to search
వినోద్ మెహతా
దస్త్రం:Vinod-Mehta.jpg
జననం31 మే 1942
మరణం2015 మార్చి 8 (aged 73)
జాతీయతభారతీయుడు
విద్యబి.ఎ
విద్యాసంస్థలక్నో విశ్వవిద్యాలయం
క్రియాశీల సంవత్సరాలు1995 నుండి 2012
ఉద్యోగంఅవుట్ లుక్ ఇండియా
సుపరిచితుడుజర్నలిస్టు,
జీవిత భాగస్వాములుసుమితా పాల్

వినోద్ మెహతా సీనియర్ జర్నలిస్ట్, ఔట్‌లుక్ ఎడిటోరియల్ చైర్మన్.[1] సండే అబ్జర్వర్, ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ది పయనీర్ (డిల్లీ ఎడిషన్), ఔట్‌లుక్ లాంటి ఎన్నో పత్రికలను ప్రారంభించి, విజయపథంలో నడిపించిన ఘనతను ఆయన సొంతం.[2] లక్నో విశ్వవిద్యాలయంలో బి.ఎ. పూర్తిచేసారు.

జీవిత విశేషాలు

ఆయన ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న రావుల్పిండిలో 1942 మే 31 న జన్మించారు.[3][4]

జర్నలిజం లో కురువృద్ధుడు

భారతీయ జర్నలిజం లో కురువృద్ధుడి లాంటి సీనియర్ ఎడిటర్ ఆయన. 40 ఏళ్ళ పాటు ఈ వృత్తిలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తి, తన పెంపుడు కుక్కకు 'ఎడిటర్' అని పేరు పెట్టుకున్నారు.ఆయనకు భార్య (సుమితా) ఉన్నారు, పిల్లలు లేరు.ఎలాంటి డిగ్రీ లేకున్నా... భాషా పటిమ, విశ్లేషణా సామర్థ్యం, తెగింపు లతో అవుట్ లుక్ అనే పత్రికు వ్యవస్థాపక ఎడిటర్.

పత్రికలు మూతపడుతూ... ప్రింట్ జర్నలిజం శకం ముగిసిందని అనుకుంటున్న సమయంలో మాగజీన్ జర్నలిజాన్ని నిబద్ధతతో నిర్వహించి... కొత్తపుంతలు తొక్కించిన కలం యోధుడు వినోద్ మెహతా. రహేజా గ్రూప్ తరఫున వినోద్ మెహతా 1995 అక్టోబర్ లో అవుట్ లుక్ ను ఆరంభించి అద్భుతమైన వ్యాసాలు అందించారు. అనారోగ్యం తో ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకుని 2012 నుంచి అవుట్ లుక్ కు ఎడిటోరియల్ ఛైర్మన్ గా వ్యవహరించారు.

అర్నబ్ గోస్వామి లాంటి ఎడిటర్లు సైతం.. వినోద్ ను 'జర్నలిజం దేవుడి' గా భావిస్తారు, ఆరాధిస్తారు.

రచయితగా

బీ ఏ థర్డ్ క్లాస్ లో పాసయినట్లు చెప్పుకునే వినోద్ మూడు పుస్తకాలు రాసారు. అందులో మూడు జీవిత చరిత్రలు, రెండు తన అనుభవాల సారం (లక్నో బాయ్, ఎడిటర్ అన్ ప్లగ్డ్), ఒకటి సంకలనం (మిస్టర్ ఎడిటర్, హౌ క్లోస్ అర్ యు టు ది పీఎం?).

వినోద్ మెహతా ప్రముఖ బాలీవుడ్ నటి మీనాకుమారి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీల జీవిత చరిత్రలను రాశారు. ఆయన రాసిన వ్యాసాలను మిస్టర్ ఎడిటర్, హౌ క్లోజ్ ఆర్‌యూ టూ ది పీఎం అనే పేరుతో 2001లో సంకలనంగా విడుదల చేశారు. ఇటీవల ఎడిటర్ అన్‌ప్లగ్‌డ్ పుస్తకాన్ని ప్రచురించారు.

మరణం

అనారోగ్యంతో బాధపడుతున్న మెహతా మార్చి 8 2015న న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య సేవల సంస్థ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 73 సం వత్సరాలు. కొద్దికాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు.

మూలాలు

  1. ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ మెహతా ఇకలేరు.[permanent dead link]
  2. "Eminent journalist and Editorial Chairman of Outlook Magazine Vinod Mehta dies". CNN-IBN. 8 March 2015. Archived from the original on 10 మార్చి 2015. Retrieved 9 March 2015.
  3. సీనియర్ జర్నలిస్టు వినోద్ మెహతా మృతి
  4. Singh, Kushwant (28 January 2012). "Of the grumbling Lucknow boy and John Keats". Hindustan Times. Retrieved 22 August 2014.

ఇతర లింకులు