విల్ఫ్రెడ్‌ డిసౌజా

From tewiki
Jump to navigation Jump to search

విల్ఫ్రెడ్‌ డిసౌజా

గోవా ముఖ్యమంత్రి
పదవీ కాలము
18 మే 1993 – 2 ఏప్రిల్ 1994
గవర్నరు భాను ప్రకాశ్ సింగ్
ముందు రవి.ఎస్.నాయక్
తరువాత రవి ఎస్.నాయక్
పదవీ కాలము
8 ఏప్రిల్ 1994 – 16 డిసెంబరు 1994
గవర్నరు బి.రాచయ్య
గోపాల రామానుజం
ముందు రవి.ఎస్.నాయక్
తరువాత ప్రతాప్ సింగ్ రానే
పదవీ కాలము
30 జూలై 1998 – 26 నవంబరు 1998
గవర్నరు జె.ఎఫ్.ఆర్.జాకోబ్
ముందు ప్రతాప్ సింగ్ రానే
తరువాత లూయిజినో ఫాలెరియో

వ్యక్తిగత వివరాలు

జననం (1927-04-23)1927 ఏప్రిల్ 23
కంపాలా,ఉగాండా ప్రొటెక్టోరేట్
మరణం 2015 సెప్టెంబరు 4(2015-09-04) (వయస్సు 88)
పనాజీ, గోవా, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
గోవా రాజీవ్ కాంగ్రెస్
నేషనలిస్తు కాంగ్రెస్ పార్టీ
తృణమూల్ కాంగ్రెస్
వృత్తి రాజకీయనాయడుడు
సర్జన్
మతం రోమన్ కాథలిక్[ఆధారం చూపాలి]

విల్ఫ్రెడ్‌ డిసౌజా (23 ఏప్రిల్ 1927 – 4 సెప్టెంబరు 2015) గోవారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి[1]. ఆయన సర్జన్, రాజకీయనాయడుడు. ఆయన మూడుసార్లు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసారు.[2]

జీవిత విశేషాలు

విల్ఫ్రెడ్‌ డిసౌజా మూడు సార్లు గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. వృత్తిరీత్యా సర్జన్‌ అయిన విల్ఫ్రెడ్‌ డిసౌజా యూకేలోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌లో డబుల్‌ ఫెలో పొందిన అతి కొద్ద మంది వ్యక్తుల్లో ఒకరు. 1974లో కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. భారత మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ చేతుల మీదగా డాక్టర్ బీసీ రాయ్ అవార్డును కూడా అందుకున్నారు. గోవా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి గెలిచి తనదైన ముద్రను వేయడమే కాకుండా, అనతికాలంలో ఉన్నత పదవులను పొందారు. గోవా ముఖ్యమంత్రిగా తొలిసారిగా 1993లో పదవి బాధ్యతలను స్వీకరించారు. 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన 1980ల్లో గోవాలో కాంగ్రెస్ పాగా వేసేందుకు ముఖ్య భూమికను పోషించారు.

విద్యార్హతలు

  • ఎం.బి.బి.ఎస్(బొంబాయి విశ్వవిద్యాలయం)
  • ఫెలో ఆఫ్ రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్స్, ఇంగ్లాండు.
  • ఫెలో ఆఫ్ రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్స్, ఏడెన్‌బర్గ్
  • హానరరీ ఫెలో ఆఫ్ ద ఇంటర్నేషనల్ కాలేజీ ఆఫ్ సర్జన్స్
  • ఫెలో ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా

[3]

మరణం

డిసౌజా శ్యాస సంబంధమైన వ్యాధితో బాధపడుతూ మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆయన సెప్టెంబరు 4 2015 శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.

మూలాలు

  1. గోవా మాజీ సీఎం విల్ఫ్రెడ్‌ డిసౌజా కన్నుమూత
  2. Vaz, J. Clement (1997). Profiles of eminent Goans, past and present. Concept Publishing Company. pp. 165–166. ISBN 978-81-7022-619-2.
  3. "Know your MLA... – Recent Discussion". Osdir.com. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 29 అక్టోబరు 2013.

ఇతర లింకులు