"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వివక్తత

From tewiki
Jump to navigation Jump to search

ఒక జనాభాలో కొన్ని బాహ్య లేక అంతర్గతకారకాల సహయంతో స్వజాతిస్ధ ప్రజననాన్ని నిరోధించి దాన్ని రెండు లేక మూడు సమూహలుగా విడగొట్టు ప్రక్రియను వివక్తత అని నిర్వచించవచ్చును. ఒక జాతి జీవుల మధ్య స్వేచ్ఛాయుత స్వజాతిస్థప్రజననాన్ని నిరోధించి జన్యుప్రవాహన్ని అడ్డుకునే ఏ కారకమైనా వివక్తతను ప్రోత్సహిస్తుంది. ఒక జంతువుల లేక మొక్కల కుటుంబంలోని జీవులు ప్రత్యుత్పత్తి సంబంధిత వివక్తత చెందటానికి ,ప్రదేశము,దూరము శీతోష్ణస్థితితో పాటు,జైవిక కారకాలు కూడ,సమంగా బాధ్యత వహిస్తాయనీ, ఆ జనాభాలోని సభ్యులను వివక్తతకు గురి చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తాయని గుర్తించినారు.

వివక్తతా విధానాలు(Isolating mechanism)

 1. ప్రాదేశిక వివక్తత లేక సుదూర వివక్తత (Spatial Isolation or Isolation by Distance)
 2. భౌగోళిక వివక్తత (Geographical Isolation)
 3. శీతోష్ణస్థితి సంబంధ వివక్తత (Climatic Isolation)
 4. జీవ సంబంధ వివక్తత (Biotic Isolation)

ప్రత్యుత్పత్తి వివక్తత విధానాలు (Reproductive Isolation mechanisms)

ఇవి రెండు రకాలు.

 • సంపర్క పూర్వ లేక సంయుక్తబీజ పూర్వ వివక్తతా విధానాలు (Premating or Prezygotic Isolating mechanisms :
 1. ఆవరణ సంబంధ వివక్తత (Ecologic Isolation)
 2. ప్రవర్తన సంబంధ వివక్తత (Ethologic Isolation)
 3. ఋతు సంబంధ వివక్తత (Seasonal Isolation)
 4. యాంత్రిక సంబంధ వివక్తత (Mechanical Isolation)
 • సంపర్కానంతర లేక సంయుక్త బీజానంతర వివక్తతా విధానాలు(Post Mating or Post Zygotic Isolating mechanisms :
 1. బీజ కణాల మృతి (Gametic Mortality)
 2. సంయుక్త బీజాల మృతి (Zygotic Mortality)
 3. సంకరాలు జీవించ లేకపోవటం (Hybrid inviability)
 4. సంకరాల వంధ్యత్వం (Hybrid Sterility)
 5. హైబ్రిడ్ బ్రేక్ డ్ న్ (Hybrid breakdown)

వివక్తత-దాని పుట్టక( Origin of Isolation)

మూలాలు