విస్లావా సింబోర్స్‌కా

From tewiki
Jump to navigation Jump to search
Wisława Szymborska-Włodek
Szymborska 2011 (1).jpg
Wisława Szymborska, Kraków, Poland 2011
పుట్టిన తేదీ, స్థలం(1923-07-02)1923 జూలై 2
Prowent, పోలెండ్
మరణం2012 ఫిబ్రవరి 1(2012-02-01) (వయస్సు 88)
Kraków, పోలెండ్
వృత్తి
జాతీయతPolish
ప్రభావంCzesław Miłosz
పురస్కారాలు
జీవిత భాగస్వామిAdam Włodek (1948–1954; divorced)

విస్లోవా సింబోర్స్‌కా (ఆంగ్లం: Maria Wisława Anna Szymborska) (2 జూలై 1923 – 1 ఫిబ్రవరి 2012) పోలెండ్కు చెందిన కవయిత్రి, అనువాదకురాలు. ఈమెకు 1996 లో సాహిత్యానికి సంబంధించిన నోబెల్ బహుమతి లభించింది. ఈమెను కవిత్వంలో మొజార్ట్ ఆఫ్ పోయిట్రీ ("Mozart of Poetry") గా వర్ణించారు.[1][2]

జీవిత సంగ్రహం

విస్లావా 1923 జూలై 2 వ తేదీన పోలెండ్ లోని బ్నిన్ లో జన్మించింది. ఈమె క్రోకో లోని జెగిలోనియన్ విశ్వవిద్యాలయంలో పోలిష్ సాహిత్యం, సామాజిక శాస్త్రాలను అభ్యసించారు. 1953లో క్రోకో సాహిత్య వారపత్రిక జిలీ లిటరేకీలో కవితా విభాగానికి సంపాదకురాలయ్యారు.

ఆమె రచించిన వాటిలో లాటోగో జిజేభీ (దట్స్ వై ఉయ్ ఆర్ అలైవ్) -1952, పిటైనియా డజ్‌వానె సోబీ (క్వశ్చనింగ్ వన్‌సెల్ఫ్) -1954, వొలెనీ దొయేతి (కాలిగ్ ఆడట్ టూ యేతి) - 1957, సోల్ (సాల్ట్) - 1962, స్టొ పొసీబ్ (ఎ హండ్రెడ్ వాయిసెస్) - 1967 మొదలైన కవితా సంగ్రహాలు ప్రచురించబడ్డాయి. ఈమె కవితలు ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, చెక్, హంగేరియన్, డచ్, ఇంగ్లీషు మొదలైన అనేక భాషలలోకి అనువదించబడ్డాయి. ఆమె కవితలు సర్వత్రా మన్ననలు అందుకున్నాయి. వీరి మొట్టమొదటి కవితా సంకలనాలు రెండూ స్టాలిన్ యుగాన్ని, రాజకీయ నిరాడంబరతను దర్శింపజేస్తాయి.

మరనం

విస్లావా 1 ఫిబ్రవరి 2012 తేదీన 88 ఏళ్ళ వయసులో క్రోకో లోని తన ఇంటిలో నిద్రిస్తుండగా దివంగతులయ్యారు.[3] ఆమె చివరిరోజులలో కూడా కొత్త కవితల గురించి పనిచేశారు; అవి 2012 లో ప్రచురించబడ్డాయి.[4]

మూలాలు

  1. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named reuters_death
  2. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named france24_death
  3. "Dates of birth and death for Wisława Szymborska". Rmf24.pl. Retrieved 3 February 2012.
  4. "Poland Nobel poetry laureate Wislawa Szymborska dies". BBC News. 1 February 2012. Retrieved 1 February 2012.

బయటి లింకులు