"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వీధి

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Münchner-Straße,-Frankfurt.jpg
జర్మనీలోని ఒక వీధి.

వీధి అనేది, నలుగురూ నడిచే దారి. కొన్ని ఇళ్ళ సముదాయానికి సంబంధించిన వారు, ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళటానికి ఏర్పాటు చేసుకున్న ఖాళీ స్థళమే వీధి. సంక్షిప్తంగా చెప్పాలంటే, వివిధ నిర్మాణాల మధ్య ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటుచేసిన ప్రదేశాల్ని వీధులు అంటారు. వీధులు లేక పోతే గ్రామముగాని, పట్టణముగాని, నగరము గాని అస్తవ్యస్తముగా ఉండి నివాస యోగ్యము కాదు. అందుకనే, వీధులు (Streets) పెద్ద నగరాల ప్రణాలికలో ఒక ముఖ్యమైన భాగము. ఇవి ఏ ఒక్కరికి చెందినవి కావు. వీధులు ముఖ్యంగా ఇల్లు, పార్కులు, దుకాణాలు మొదలైన వాటి మధ్య ఉంటాయి. వాహన రద్దీ ఎక్కువగా ఉన్న వీధులలోనడిచేవారి కోసం ప్రత్యేకంగా నడక దారి వేరుగా ఉంటుంది. రహదారి ఒక ఊరినుండి మరొక ఊరికి, ముఖ్యంగా రవాణాకు సంబంధించినది. వీధి పరస్పర ప్రయోజనం కోసం ఒక నగరంలో ఏర్పరుచుకున్న అంతర్భాగ సౌకర్యం.[1][2]

వీధి పేరు

ఊళ్ళొ వీది ఒక్కటే ఉంటే పేరుతో పెద్ద పనిలేదు. ఒకటి కంటే ఎక్కువయినప్పుడు, ఒక్కొక్క వీధికి ఒక ప్రత్యేక పేరు పెట్టవలసిన అవసరం ఏర్పడింది. ఈ వీధుల పేర్లు అందరికిఇ తెలిసిన పేర్లు, దేవుళ్ళ పేర్లు, గుళ్ళ పేర్లు, దేశభక్తుల పేర్లు, చివరకు ఆ ఊరి పెద్ద రైడీ పేరు కూడ పెడుతూ ఉంటారు.

కూడలి

మూడు కాని అంతకుమించి వీధులు కలిస్తే కూడలి అవుతుంది. ఈ కూడళ్ళకు అందరికి తెలిసిన పేర్లు పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. కూడళ్ళ పేర్లు చిరునామాలల్లొ చాలా ముఖ్యమైనవి.

తిరువీధి

ఒక ఊరిలో హిందూ దేవాలయాలలోని ప్రధాన దేవుడు/దేవతలను కొన్ని దినాలలో లేదా ఉత్సవాలలో ఆ ఊరిలోని కొన్ని వీధులలో ఊరేగిస్తారు. దీనిని తిరువీధి అంటారు. దీని మూలంగా దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోలేని వారికి ఇంటి వద్దనే ఈ అవకాశం లభిస్తుంది.

మూలాలు

  1. Dictionary.
  2. "Ask Yahoo!". Archived from the original on 2005-11-26. Retrieved 2008-01-24.