"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వీరభద్ర స్వామి దేవాలయం,లేపాక్షి

From tewiki
Jump to navigation Jump to search
వీరభద్రస్వామి దేవాలయం
గోపురం
పేరు
స్థానిక పేరు:వీరభద్ర దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:అనంతపురం జిల్లా
ప్రదేశం:లేపాక్షి
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:వీరభద్రుడు
నిర్మాణ శైలి:ద్రావిడ నిర్మాణ శైలి

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value). వీరభద్రస్వామి దేవాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనంతపురం జిల్లాలో లేపాక్షి వద్ద ఉంది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది[1]. నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణ ఈ ఆలయం. ఈ ఆలయం అధ్బుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యంతో అలరారుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్ర స్వామి. ఈ దేవాలయంలో ఫ్రెస్కో చిత్రాలలో కాంతివంతమైన రంగుల అలంకరణలతో కూడుకొని ఉన్న రాముడు, కృష్ణుడు యొక్క పురాణ గాథలకు సంబంధించినవి ఉన్నాయి. అచట పెద్ద నంది విగ్రహం దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడి ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహాలలో ఒకటిగా అలరాలుతుంది.

ప్రదేశం

ఈ దేవాలయం లేపాక్షి నగరానికి దక్షిణవైపు నిర్మింపబడింది. ఈ దేవాలయం తాబేలు ఆకారంలో గల గ్రానైట్ శిలపై తక్కువ ఎత్తులో నిర్మింపబడింది. కనుక దీనిని "కూర్మ శైలం" అంటారు.

బసవయ్య విగ్రహం

ఇచట గల బసవయ్య 15 అడుగులు ఎత్తు, 22 అడుగుల పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మండమైన విగ్రహం .108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కాందపురాణం తెలియ చేస్తుంది. ఇక్కడ గల పాపనశేశ్వర స్వామిని అగస్త్య మగర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి. ఒకరికి ఒకరు ఎదురుగా పాపనశేశ్వరుడు, రఘునతమూర్తి ఉండటం ఇక్కడ ప్రత్యేకత.విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు, రమణీయమైన ప్రదేశం. సీతమ్మవారిని అపహరించికొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని, రాములవారు జటాయువు చెప్పిన విషయమంత విని కృతజ్ఞతతో లే ! పక్షి ! అని మోక్షం పప్రాసదించిన స్థలం. అందువల్లనే క్రమంగా లేపాక్షి అయ్యింది అని స్థల పురాణం చెబుతుంది.

చిత్రమాలిక

మూలాలు

  1. Kamath, J. (13 January 2003). "The snake and the bull". Hindu Business Line. Retrieved 11 April 2015.

ఇతర లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.