"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వెంకట్ గోవాడ

From tewiki
Jump to navigation Jump to search
వెంకట్ గోవాడ
Venkat Govada.jpg
జననంఏప్రిల్ 1, 1972
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
వృత్తిఇంటర్మీడియట్‌ బోర్డులో సూపరింటెండెంట్‌
ప్రసిద్ధిరంగస్థల నటులు, దర్శకులు
భార్య / భర్తరాధ
పిల్లలుఇద్దరు కమార్తెలు (గీతిక, హారిక)
తండ్రిశ్రీరామమూర్తి
తల్లిమల్లేశ్వరి

వెంకట్‌ గోవాడ తెలుగు నాటకరంగంలో యువ నాటక దర్శకుడు, నటుడు, నిర్మాత. ఇంటర్మీడియట్‌ బోర్డులో సూపరింటెండెంట్‌ గా పనిచేస్తూనే రంగస్థలంపై నవ రసాలు కురిపిస్తున్నారు. థియేటర్‌ ఆర్ట్స్‌లో పిజి డిప్లొమో చేశారు.[1]

జననం - విద్యాభ్యాసం - ఉద్యోగం

వెంకట్ గోవాడ ఏప్రిల్ 1, 1972 శ్రీరామమూర్తి, మల్లేశ్వరి దంపతులకు హైదరాబాద్లో జన్మించారు. విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే గడిచింది. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో సూపరెంటెండ్ గా పనిచేస్తున్నారు.

దస్త్రం:Venkat Govada Receving Kandukuri Puraskaram in 2017.jpg
కందుకూరి పురస్కారం 2107 అందుకుంటున్న వెంకట్ గోవాడ

వివాహం - సంతానం

ఏప్రిల్ 11, 1996న రాధతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కమార్తెలు (గీతిక, హారిక).

రంగస్థల ప్రవేశం

క్షమయా ధరిత్రి ఈయన మొదటి నాటకం. అంతకుముందు తన ఉద్యోగ మిత్రులతో కలిసి కొన్ని నాటకాలు వేశారు. ఇప్పటిదాకా 110 నాటకాలు వేశారు. 800 పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో సాంఘిక నాటకాలతో పాటు పద్య నాటకాలూ ఉన్నాయి. పునాది 44 ప్రదర్శనలు, రాజగృహప్రవేశం 26 ప్రదర్శనలు, తెలుగు మహాసభల సందర్భంగా రాయించిన చెంగల్వపూదండ 24 ప్రదర్శనలు జరిగాయి. హిందీలోనూ కొన్ని నాటికల్లో నటించారు.

వెంకట్‌ కొంతమంది మిత్రులతో కలిసి 2013లో ‘‘గోవాడ క్రియేషన్స్‌’’ ప్రారంభించారు.[2]

దస్త్రం:Venkat Govada as VenkateswaraSwamy.jpeg
వెంగమాంబ నాటకంలో వెంకటేశ్వరస్వామిగా వెంకట్ గోవాడ

నాటికలు - నాటకాలు

తెలుగు

 • అహంబ్రహ్మ
 • సరిహద్దు
 • చిత్తగించవలెను
 • యాజ్ఞసేని ఆత్మకథ
 • కోదండపాణి
 • చెంగల్వ పూదండ
 • గురుబ్రహ్మ
 • ఇది అహల్యకథ కాదు
 • పునాది
 • పడమటిగాలి
 • రాజిగాడు రాజయ్యాడు
 • వాగిరా
 • మిస్సింగ్ ఫైల్
 • పట్టపురాణి తలపోటు
 • అసోకం
 • అంబేద్కర్ రాజగృహ ప్రవేశం
 • ధన ధన ధనదాహం
 • యథారాజా తథాప్రజా
 • డా. పరలోకం ఫైవ్ స్టార్ హోటల్
 • కొమరం భీం
 • రచ్చబండ (దర్శకత్వం)
 • యజ్ఞం (దర్శకత్వం)
 • ఆకాశదేవర
 • మనసు చెక్కిన శిల్పం (దర్శకత్వం)

హిందీ

 • అంతరాల్
 • సూర్యకి అంతిమ్ కిరణ్ సే పహ్లి కిరణ్ తక్
 • మహాభారత్ కి ఏక్ సాంజా
 • జూతే
 • కహానీ ఏక్ సఫర్ కి

సీరియళ్లు - సినిమాలు

సీరియళ్లు - ఆత్మీయులు ఈయన మొదటి సీరియల్‌. 1999 నుంచి ఇప్పటి వరకు 38 టివి సీరియళ్లలో నటించారు. ఆడదే ఆధారం (ఈటీవి), పెళ్ళినాటి ప్రమాణాలు (జీతెలుగు), నాగాస్త్రం (ఈటీవి), అర్చన (జెమిని), కాలచక్రం (డిడి), సంసారం...సాగరం (డిడి), అలౌకిక (ఈటీవి), అనురాగం (డిడి), ఘర్షణ (ఈటీవి), విధి (ఈటీవి), పున్నాగ (జీతెలుగు), అంబేద్కర్ (డిడి) తదితర సీరియళ్లలో విభిన్నమైన పాత్రలు పోషించారు.

సినిమాలు - మేఘం, పవన్‌ సుబ్బలక్ష్మి ప్రేమించుకున్నారట, గ్రేట్‌ లవర్‌, స్టూడెంట్‌ స్టార్‌, జై బోలో తెలంగాణా, మండోదరి, బొమ్మల రామారం లో నటించారు.

రంగస్థల గురువులు

నాటకరంగంలో ఉద్దండులైన 25 మంది దర్శకుల వద్ద పనిచేశారు. సెంట్రల్‌ యూనివర్సిటీలో పిజి డిప్లొమో ఇన్‌ యాక్టింగ్‌ చేస్తున్నప్పుడు అక్కడ థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగాధిపతిగా ఉన్న, ప్రముఖ దర్శకులు డి.ఎస్.ఎన్. మూర్తి, ఆచార్య భిక్షు, చాట్ల శ్రీరాములు, ఎంజి ప్రసాద్‌, బిపి ప్రసాదరావు, తల్లావజ్ఝుల సుందరం, డాక్టర్‌ భాస్కర్‌ శివాల్కర్, గుంటూరు శాస్త్రి, పాటిబండ్ల ఆనందరావు, ఎస్.ఎం. బాషా, తులసి బాలకృష్ణ, భరద్వాజ, రమణ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేశారు.

అవార్డులు - పురస్కారాలు

 1. దుర్గి వెంకటేశ్వర్లు రంగస్థల పురస్కారం (కోమలి కళాసమితి, నల్లగొండ. 2011)
 2. గరికపాటి రాజారావు రంగస్థల పురస్కారం (యువకళావాహిని, హైదరాబాద్. 2015)
 3. వల్లం నాగేశ్వరరావు రంగస్థల పురస్కారం (వి.ఎన్.ఆర్. ట్రస్ట్, హైదరాబాద్. 2017, జనవరి 5)[3]
 4. కందుకూరి పురస్కారం - 2107 (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ, 2017) [4]
 5. బుల్లితెర 2017 ప్రత్యేక జ్యూరీ అవార్డ్ (అంబేద్కర్ పాత్ర - అంబేద్కర్ ధారావాహిక)[5]

అంబేద్కర్ పాత్ర గురించి

ఇరవై ఏళ్ల క్రితం చిన్నపాత్రతో నాటకాలు వేయడం ప్రారంభించిన ఈయనకు నటునిగా అద్భుతమైన అవకాశాలు లభించాయి. రాజగృహప్రవేశంలో అంబేద్కర్‌, పడమటిగాలిలో రామకోటి, రాజిగాడు రాజయ్యాడులో రాజిగాడు పాత్రలు ప్రేక్షకలు మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

అంబేద్కర్ రాజగృహ ప్రవేశం నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు...ఆ నాటకం రాసిన తరువాత ఏడేళ్లపాటు అంబేద్కర్‌ పాత్రధారి కోసం అన్వేషించి ఆ పాత్రకు వెంకట్ సరిపోతారని పసిగట్టి ఆయనకు ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం కోసం 15 - 20 రోజుల పాటు అంబేద్కర్‌ అంబేద్కర్‌ నడక, చూపులు, శరీర భాష, వ్యక్తిత్వం గురించి లోతుగా అధ్యయనం చేశారు.

అంబేద్కర్‌ పాత్రతో వెంకట్ జీవితాన్ని మలుపు తిప్పింది. అమలాపురంలో పది వేల మంది ప్రేక్షకుల సమక్షంలో, రెండు ఎల్‌సిడి స్క్రీన్లు ఏర్పాటు చేసి నాటకం ప్రదర్శించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతి లో అంబేద్కర్ రాజగృహ ప్రవేశం నాటకాన్ని ప్రదర్శిస్తే పది నిమిషాలు చూడటానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య రెండు గంటలపాటు కదలకుండా కూర్చుండిపోయారు. నాటకం పూర్తయ్యాకా ఆలింగనం చేసుకుని...‘అంబేద్కర్‌ను నేరుగా చూడలేకపోయినా...ఇప్పుడు నీ రూపంలో ఆ భాగ్యం కలిగిందని చెప్పడం నెప్పటికీ మరచిపోలేను’ అన్నారు.

త్రిపాత్రాభినయం

రాజిగాడు రాజయ్యాడు నాటకానికి నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా మూడు బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగు గంటలకుపైగా సాగే నాటకంలో హీరో పాత్ర పోషిస్తూ, 60 మందికిపైగా నటీనటులను, సాంకేతిక బృందాన్ని సమన్వయం చేసుకోవడం కత్తిమీద సామువంటిదే. శ్రీకాకుళం సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే 'రాజిగాడు'కు దర్శకత్వం వహించడం కోసం అక్కడికెళ్లి, కట్టుబొట్టు, యాసభాషలను అధ్యయనం చేశారు. నాటకం రిహార్సల్స్‌ చేసేటప్పుడు శ్రీకాకుళం యాస తెలిసినవారిని పిలిపించుకుని నేర్చుకున్నారు.

చిత్రమాలిక

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలములు

 1. ప్రజాశక్తి. "'మళ్లీ వెలిగే స్టేజి వస్తుంది`". Retrieved 25 April 2017.[permanent dead link]
 2. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు. "తెలుగు నాటకానికి ఆదరణ తగ్గలేదు". Retrieved 25 April 2017.[permanent dead link]
 3. నవతెలంగాణ. "సినీరంగానికి రంగస్థలం పునాది". Retrieved 17 January 2017.
 4. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ. "కందుకూరి పురస్కారం 2017". www.apsftvtdc.in. Retrieved 20 July 2017.CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
 5. గోవాడ వెంకట్ బుల్లితెర 2017 ప్రత్యేక జ్యూరీ అవార్డ్, ఈనాడు, తెనాలి, 28.11.2017.

ఇతర లంకెలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).