"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వెడల్పు

From tewiki
Jump to navigation Jump to search
పొడవు (length), వెడల్పు (width), ఎత్తు (height) కొలతలు చూపిస్తున్న ఒక ఘనము

చతురస్రాకార ఘనముగా ఉన్న వస్తువు పొడవులను మూడు విధములుగా సూచించవచ్చు. క్షితిజ లంబంగా లేదా నిలువుగా మొదలు నుంచి చివరకు అత్యంత తక్కువ వచ్చేలా కొలిచే కొలతను ఎత్తు అని, అలాగే అడ్డంగా కొలిచే కొలతలలో మొదలు నుంచి చివరకు అత్యంత తక్కువ వచ్చేలా కొలిచిన కొలతలలో ఎక్కువ పొడవు ఉన్న పొడవును పొడవు అని, తక్కువ పొడవు ఉన్న పొడవును వెడల్పు అని అంటారు. ఇది పొడవును కొలిచినట్టు వలె అడ్డంగా కొలవబడినను, పొడవుకు లంబ (90 డిగ్రీల కోణంలో) దిశలో ఉంటుంది.

పొడవు, వెడల్పు మధ్య తేడాను సులభంగా గుర్తించుటకు రోడ్డు మంచి ఉదాహరణ. మనం రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు ఎదురుగా దూరంగా చాలా పొడవుగా కనిపించే పొడవును పొడవు అంటారు. మన ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకి గల కొన్ని అడుగుల లేదా కొన్ని మీటర్ల పరిమితంగా ఉన్న రోడ్డు మార్జిన్ల మధ్య దూరాన్ని వెడల్పు అంటారు. కొన్ని సమయాలలో వెడల్పు మరొక తక్కువ వెడల్పుతో సూచించే సందర్భాలలో ఆ వెడల్పే పొడవుగా సూచింపబడుతుంది. రోడ్డు నిర్మాణ సమయంలో ఇటువంటి సందర్భాలు కన్పించవచ్చు.

ఇవి కూడా చూడండి

  • ఎత్తు - నిలువుగా కొలిచే దూరం
  • పొడవు - అడ్డంగా కొలిచిన దూరాలలో వెడల్పు కంటే దూరం గలది