"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వెనుకబడిన క్షత్రియ కులాలు
చాలా మంది శూద్రులు తాము రాజ వంశాల వారం అని చెప్తారు. అసలు ఇప్పుడు చెప్పబడే పురగిరి క్షత్రియ, భవసార క్షత్రియ , అగ్నికుల క్షత్రియులు మొ,, శూద్ర కులాల వారు కొందరు తామే నిజమైన క్షత్రియులమని చెప్తారు. రాజ పుత్రులు, గుజ్జర్లు విదేశీయులు అనే వాదన ఉంది.[1][2]
పరిచయము
ఆంధ్రప్రదేశ్లో వీరిని బి.సి గ్రూపులుగా పరిగణింపబడుచున్నారు. ఈ క్రింది కులాలు ఆర్థికంగా వెనుకబడిన క్షత్రియులు.
- అగ్నికుల క్షత్రియులు:
వీరిని వన్నెకుల క్షత్రియులని లేదా పల్లీలు అని కూడా అంటారు. పల్లీలు తాము జంబు మహర్షి వంశస్థులమని నమ్ముతారు వీరి గోత్రం రఘుకుల, రవికుల గోత్రం. పల్లవ రాజుల కాలంలో వీరు సైనికులుగా, సేనాధిపతులుగా పనిచేశారు. పల్లవ సామ్రాజ్యం అంతమైన తర్వాత వీరు వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. ఉత్తరాదిన అగ్నికులులు బ్రహ్మక్షత్రియులుగా నాలుగు వర్గాలుగా చెప్పినట్లుగా అగ్నివంశపురాజులు అనే పుస్తకంలో రాసారు. వారు ప్రమర , చౌహాను , చాళుక్య, పరిహారలు. పృద్విరాజ్ చౌహాన్ అను రాజ పుత్రరాజు అగ్నికులక్షత్రియులు అని అతని మిత్రుడు మంత్రి అయిన చాంద్ బర్దాయ్ తను రాసి ప్రచురించిన పృధ్వీరాజ్ రాసో అనే పుస్తకం లో తెలియజేసాడు. విద్యాదాతలుగా, ఆలయ నిర్మాతలుగా పేరుగాంచిన వారనేకులు ఈ కులంలో ఉన్నారు. పల్లవ రాజుల కాలంలో అంతమైన తర్వాత వీరు వ్యవసాయదారులుగా , వడ్రంగులుగా, నౌకా నిర్మాతలుగా ఇలా అనేక వృత్తులలో స్థిర పడ్డారు.
- పెరికి క్షత్రియులు:
ఇతిహాసాల ప్రకారం వీరు పరశురాముడి క్షత్రియ వధ నుండి తప్పించుకున్నవారు. ఆ సమయంలో కొద్ది మంది క్షత్రియులు పిరికి తనంతో తాము వ్యాపారస్తులమని చావు నుండి తప్పించుకొన్నారు.అయితే వీరు పిరికి వారు, అబద్దాలాడేవారూ కాదు. కొద్ది మంది క్షత్రియులు తమ పదవులనుండి విరమణ పొందిన తర్వాత కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్క నివాసాలు ఏర్పరచుకొన్నారని, కాల క్రమేణా వారు పురగిరి క్షత్రియులుగా పిలువబడ్డారు. అందువల్ల వీరిని పురగిరి క్షత్రియులని కూడా అంటారు. వీరు ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపిస్తారు.
- భవసార క్షత్రియులు:
పరశురాముడి క్షత్రియ వధ నుండి తప్పించుకొని హింగులాంబిక అను దేవత గుడిలో తలదాచుకొన్న క్షత్రియులే భవసారులని, కనుక భవసారులు క్షత్రియవర్ణానికి చెందినవారని సిద్ధాంతం ఉంది.
- ఆర్య క్షత్రియులు:
- తోగట వీర క్షత్రియులు:
మూలాలు
https://web.archive.org/web/20190111060512/http://sathyakam.com/pdfImageBook.php?bId=10903#page/38 ★అగ్నివంశపురాజులు★ అను పుస్తకం రాసినవారు చరిత్ర పరిశోధకులు బహు గ్రంధ కర్త శ్రీమాన్ పండిట్ కోటావెంకటాచలం గారు.