"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వెలిగండ్ల

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox India AP Village వెలిగండ్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, వెలిగండ్ల మండలానికి చెందిన గ్రామం .[1].పిన్ కోడ్: 523 224., ఎస్.టి.డి.కోడ్ = 08402.

గ్రామ నామ వివరణ

వెలిగండ్ల అనే గ్రామనామం వెలి అనే పూర్వపదం, గండ్ల అనే ఉత్తరపదాల కలయికతలో ఏర్పడింది. వీటిలో వెలి అనే పదం వర్ణ సూచకమని పరిశోధకుడు చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.[2] గండ్ల అనే పదం పర్వతసూచి. గండి-లు-అగా భాషావేత్తలు దీన్ని విడగొడ్తారు. దీనికి కొండ అని అర్థం.[3]'

గ్రామ భౌగోళికం

Lua error in మాడ్యూల్:Mapframe at line 404: attempt to index field 'wikibase' (a nil value).

సమీప గ్రామాలు

సురవారిపల్లే.రంగన్నపల్లి.బాపనపల్లి.గన్నవరం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

  1. ఈ పాఠశాలలో చదువుచున్న బత్తుల విజయలక్ష్మి అను విద్యార్థిని, 2015,సెప్టెంబరు-18 నుండి 27 వరకు, తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్లు పట్టణంలో నిర్వహించు దక్షిణభారతదేశ స్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. ఈమె ఇప్పటి వరకు 12 సార్లు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొని తన ప్రతిభ ప్రదర్శించింది. [2]
  2. ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న రెక్కల స్వాతి అను విద్యార్థిని, ఇటీవల నెల్లూరులోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో జిల్లాజట్టుకి ప్రాతినిధ్యం వహించి, అత్యుత్తమ ప్రతిభ కనబరచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె 2015,డిసెంబరు-19 నుండి పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటుంది. [3]
  3. ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న షేక్ ఆలీనవాజ్, కె.సిద్ధయ్య, బి.విజయలక్ష్మి అను ముగ్గురు విద్యార్థులు, ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలలలో తమ ప్రతిభ కనబరచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. వీరు 2015,డిసెంబరు-28 నుండి కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరులో నిర్వహించు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొంటారు. [4]
  4. ఈ పాఠశాలలో చదువుచున్న ముంతా గణేష్, వేము మౌనిక అను విద్యార్థులు, 2016,జనవరి-9 నుండి 11 వరకు, కడప జిల్లాలోని రైల్వే కోడూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పైకా ఖో-ఖో పోటీలలో తమ అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి పోటీలలకు ఎంపికైనారు. ఈ ఇద్దరు విద్యార్థులూ, 2016,జనవరి-21 నుండి 23 వరకు గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో నిర్వహించు జాతీయస్థాయి పైకా పోటీలలో పాల్గొంటారు. [5]

గ్రామంలోని ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 30. Retrieved 10 March 2015.
  3. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 232. Retrieved 10 March 2015.

వెలుపలి లింకులు

[1] ఈనాడు ప్రకాశం; 2014,డిసెంబరు-25; 7వపేజీ.[2] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-19; 6వపేజీ.[3] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-19; 8వపేజీ.[4] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-24; 15వపేజీ.[5] ఈనాడు ప్రకాశం; 2016,జనవరి-19; 15వపేజీ.