వెలిదె హరిశంకర శాస్త్రి

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Velede harisankara sastry.jpg
వెలిదె హరిశంకర శాస్త్రి

వెలిదె హరిశంకర శాస్త్రి ప్రముఖ హరికథా కళాకారుడు, పండితుడు, బహుభాషా కోవిదుడు.[1]

జీవిత విశేషాలు

ఆయన 1930 జులై 5న వెలిదె లక్ష్మీబాయి, నర్సింహరామయ్యశాస్త్రి దంపతులకు రంగశాయిపేటలో హరిశంకర్‌శాస్త్రి జన్మించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూమీడియంలో మెట్రిక్ వరకు చదివారు. విద్యభ్యాసంతోపాటే మడికొండ సత్యనారాయణశాస్త్రి వద్ద హరికథ, చల్లపల్లి పంచనాధం వద్ద సంగీతం నేర్చుకున్నారు. హరికథలు చెప్పడంలో తనకుతానే సాటిగా ఉమ్మడిరాష్ట్రంలో వేలల్లో కచేరీలు నిర్వహించి పలువురి మన్ననలు పొందారు.అనేక వేదికలపై హరికథాగానం చేసి పలు అవార్డులు అందుకున్నారు.[2] 2006లో పోతన విజ్ఞానపీఠం, 1981లో మామునూరు పోలీస్‌ బెటాలియన్ లో ఆయనకు ఘనసన్మానం జరిగింది. 1982లో ఉప్పల్‌ రైల్వే అథారిటీస్‌ "సువర్ణ ఘంటాకంకణం"తో సత్కరించింది. 1988 లో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. హరిశంకర శాస్త్రి హరి కథలు దూరదర్శన్, రేడియోలో ప్రసారమయ్యాయి.

పురస్కారాలు

1982లో కరీంనగర్‌లో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం సందర్భంగా చేసిన హరికథా కాలక్షేపాన్ని గుర్తించి సువర్ణఘంటా కంకణ సన్మానం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వెలిదె హరిశంకర్‌శాస్త్రి వేలసంఖ్యలో వేదికలపై హరికథాగానం చేసినందుకు నాటి అధికారులు, కళాకారులు హరికథ కళానిధి, హరికథ భాస్కర, హరికథ సుధానిధి అనే బిరుదులతో సత్కరించారు.[2]

వ్యక్తిగత జీవితం

ఆయనకు కుమారుడు వెలిదె నర్సింగశాస్త్రి, కుమార్తె ఉషారాణి ఉన్నారు.

మరణం

ఆయన కొంతకాలంగా వృద్ధాప్యసమస్యలతో భాదపడుతున్న ఆయన రంగశాయిపేటలోని తనస్వగృహంలో ఏప్రిల్ 21 2016 న మరణించారు.

మూలాలు

ఇతర లింకులు