వేములపాటి అనంతరామయ్య

From tewiki
Jump to navigation Jump to search

వేములపాటి అనంతరామయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, అభ్యుదయ న్యాయవాది.[1]

జీవిత విశేషాలు

ఆయన 1922 అక్టోబరు 6కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలో జమీందారీ కఁటుంబానికి చెందిన వేములపాటి సుబ్బరాయుడు, లక్ష్మీ నరసమ్మలకు జన్మించారు. ఆ గ్రామంలో ప్రాథమిక విద్య, కడప జిల్లా ప్రొద్దుటూరు, కావలి బోర్డు హైస్కూల్‌, నెల్లూరు సిఎఎంలో హైస్కూల్‌ విద్య సాగింది. 1940-42లో నెల్లూరు విఆర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. 1942లో మద్రాస్‌ క్రిస్టియన్‌ కళాశాలలో డిగ్రీ (బిఎ)లో చేరారు. ఆయన ప్రస్తుత సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు పి.రామచంద్ర పిళ్లై సహ విద్యార్థి. న్యాయవాద విద్యలో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

చదువుకునె రోజుల్లో ఎఐఎస్‌ఎఫ్‌ నాయకునిగా పనిచేసారు. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ పాల్గొన్నారు. లేగుంటపాడు, ఇందూపూరు, యల్లాయపాళెం గ్రామాల్లో భూ పోరాటాల సందర్భంగా పెత్తందారులు కమ్యూఁస్టుపార్టీ నాయకఁలు, కార్యకర్తలపై పెట్టిన కేసులను అనంతరామయ్య వాదించారు. క్రిమినల్‌ కేసులను వాదించడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అభ్యుదయ న్యాయవాదిగా అందరి మన్ననలు పొందారు. 1952-56 మధ్యకాలంలో యువజన సంఘం ఏర్పాటు చేశారు. ఆ సంఘ జిల్లా అధ్యక్షఁలుగా అనంతరామయ్య, కార్యదర్శిగా సిపిఎం సీఁయర్‌ నాయకులు జక్కా వెంకయ్య పనిచేసారు. 1956లో జక్కా వెంకయ్య వ్యవసాయ కార్మిక సంఘ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అప్పుడు అనంతరామయ్య శాంతి సంఘం ఏర్పాటు చేశారు. 1956లో దామరమడుగులో జిల్లా శాంతి సంఘ సభలను నిర్వహించారు. చివరి వరకూ వామపక్ష భావజాలంతోనే సాగారు. అనేక దేశాల్లో ప్రర్యటించారు. కమ్యూనిస్టు అనంతరామయ్యగా పేరు తెచ్చుకున్నారు.[2]

వ్యక్తిగత జీవితం

1949లో కామేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వారికి ఆరుగురు సంతానం. నలుగురు కఁమార్తెలు, ఇద్దరు కుమారులు.

పురస్కారాలు

ఆయన కాట్రగడ్డ గంగయ్య శాంతి పురస్కారాన్ని అందుకున్నారు.[3]

మరణం

ఆయన మార్చి 1 2016 మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారు.

మూలాలు

  1. "'Sri Sri best remembered for humanism'". STAFF REPORTER. The HIndu. 2 May 2014. Retrieved 5 March 2016.
  2. అభ్యుదయ న్యాయవాది
  3. వేములపాటికి శాంతి బహుమతి

ఇతర లింకులు