"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వైద్య రచన

From tewiki
Jump to navigation Jump to search

మూస:Wikify

వైద్య రచన అనేది నిపుణుడైన రచయిత ద్వారా వెలువడే శాస్త్రీయ డాక్యుమెంటేషన్‌ కార్యకలాపం. మెడికల్‌ రైటర్‌ అనే వ్యక్తి పరిశోధనలు చేసే శాస్త్రవేత్త, వైద్యుడు కానవసరం లేదు.

వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇతర సబ్జెక్టు నిపుణులతో కలిసి పని చేయడం ద్వారా పరివోధన ఫలితాలు, ఉత్పత్తుల వాడకం, ఇతర వైద్యపరమైన సమాచారాలను స్పష్టంగా, ప్రభావవంతంగా వివరించే డాక్యుమెంట్లను మెడికల్‌ రైటర్‌ తయారు చేస్తాడు. వీటితో పాటు ఆ డాక్యుమెంట్లు నియంత్రణ, జర్నల్‌, ఇతరత్రా నిర్దేశకాలు; కంటెంట్‌, ఫార్మాట్‌, నిర్మాణపరమైన నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా మెడికల్‌ రైటర్‌ జాగ్రత్త పడతాడు.

మెడికల్‌ రైటింగ్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రపంచంలో బాగా స్థిరపడ్డ విధిగా మారిపోయింది. ఎందుకంటే స్పష్టంగా, క్లుప్తంగా, సూటిగా, చూడముచ్చటైన నిర్మాణంతో ఉండే డాక్యుమెంట్లను తయారు చేయగలగడాన్ని ప్రత్యేక నైపుణ్యంగా ఈ పరిశ్రమ ఇప్పటికే గుర్తించింది. నానాటికీ పెరిగిపోతున్న ఔషధాల సంఖ్య ఎన్నెన్నో క్లినియల్‌ ట్రయల్స్‌, నియంత్రణ పద్ధతుల వంటి సంక్లిష్టమైన ప్రక్రియల ద్వారా సాగుతుంది. ఇవన్నీ జరిగితేనే అంతిమంగా మార్కెట్‌ అనుమతులు వస్తాయి. ఈ పరిణామాలన్నీ కలిసి సైన్స్‌ ప్రొఫెషనల్స్‌ సులువుగా, వేగంగా చదివి, అర్థం చేసుకునేలా అందంగా, పొందిగ్గా, మెరుగైన ప్రమాణాలతో ఉండే డాక్యుమెంట్లకు గిరాకీ పెంచాయి.

మెడికల్‌ రైటింగ్‌ రకాలు

ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమకు మెడికల్‌ రైటింగ్‌ను రెగ్యులేటరీ మెడికల్‌ రైటింగ్‌ , లేదా ఎడ్యుకేషనల్‌ మెడికల్‌ రైటింగ్‌ గా విభజించవచ్చు.

రెగ్యులేటరీ మెడికల్‌ రైటింగ్‌ అంటే ఔషధాలు, పరికరాలు, బయోలాజిక్స్‌కు అనుమతుల ప్రక్రియలో నియంత్రణ సంస్థలకు అవసరమైన డాక్యుమెంట్లను తయారు చేయడం. రెగ్యులేటరీ డాక్యుమెంట్లు చాలా భారీగా, ఫార్ములాలతో కూడి ఉంటాయి. క్లినికల్‌ స్టడీ ప్రొటోకాల్స్‌, క్లినికల్‌ స్టడీ నివేదికలు, పేషెంట్‌ ఇన్‌ఫార్మ్‌డ్‌ కన్సెంట్‌ ఫామ్స్‌, ఇన్వెస్టిగేటర్‌ బ్రోషర్స్‌, సమ్మరీ డాక్యుమెంట్స్‌ (ఉదాహరణకు కామన్‌ టెక్నికల్‌ డాక్యుమెంట్‌ (సీటీడీ) ఫార్మాట్‌లో) వంటివి ఇందులోకి వస్తాయి. ఇవన్నీ వైద్య ఉత్పత్తిని అభివృద్ధి చేసే క్రమంలో సంబంధిత కంపెనీ సమకూర్చుకున్న గనాంకాలను గురించిన పూర్తి వివరాలను ఇవి గ్రంథస్తం చేస్తాయి.

ఎడ్యుకేషనల్‌ మెడికల్‌ రైటింగ్‌ అంటే సాధారణ పాఠకులు, వైద్య రంగ ప్రొఫెషనల్స్‌ వంటి ప్రత్యేక పాఠకులు తదితరుల కోసం ఔషధాలు, పరికరాలు, బయోలాజిక్స్‌కు సంబంధించిన వివరాలతో కూడిన డాక్యుమెంట్లు రాయడం. కొత్తగా విడుదలయ్యే మందుల అమ్మకపు సాహిత్యం; వైద్య సదస్సుల కోసం దత్తాంశాల వ్యాఖ్యానం, నర్సులు, వైద్యులు, ఫార్మసిస్టుల కోసం మెడికల్‌ జర్నల్‌ వ్యాసాలు; కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ (సీఈ), లేదా కంటిన్యూయింగ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (సీఎంఈ)లకు ప్రోగ్రామ్స్‌, ఎండ్యూరింగ్‌ మెటీరియల్స్‌ వంటివి ఇందులోకి వస్తాయి.

ఏ తరహాది అన్నదానితో నిమిత్తం లేకుండా, మెడికల్‌ రైటింగ్‌ బాధ్యతలను కంపెనీలు సొంత రచయితలకు అప్పగించవచ్చు. లేదా వాటిని బయటి మెడికల్‌ రైటర్‌, లేదా మెడికల్‌ రైటింగ్‌ సేవల కోసం ఔట్‌సోర్సింగ్ ‌కు కూడా ఇవ్వవచ్చు.

మెడికల్‌ రైటింగ్‌ ఆర్గనైజేషన్స్‌

ప్రపంచవ్యాప్తంగా పలు ప్రొఫెషనల్‌ సంస్థలు మెడికల్‌ రైటర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. వాటిలో కొన్ని:

  • అమెరికన్‌ మెడికల్‌ రైటర్స్‌ అసోసియేసన్‌ (ఏఎండబ్ల్యూఏ)
  • ఆస్ట్రేలియన్‌ మెడికల్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ (ఏఎండబ్ల్యూఏ)
  • యూరోపియన్‌ మెడికల్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ (ఈఎండబ్ల్యూఏ)
  • ఇండియన్‌ మెడికల్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ (ఐఎండబ్ల్యూఏ)

మెడికల్‌ రైటర్లు కలుసుకుని, తమ జ్ఞానం, అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు అనువైన వేదికలను ఈ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. డాక్యుమెంటేషన్‌లో అత్యుత్తమ నైపుణ్యాన్ని, ప్రమాణాలను పెంచుకునేందుకు సాయపడంతో పాటు రైటర్లకు తమ కెరీర్‌ అవకాశాలను కూడా మెరుగు పరుచుకునేందుకు ఇవి తోడ్పడుతున్నాయి. ఈ సంస్థలన్నీ ఫండమెంటల్‌ మెడికల్‌ రైటింగ్‌ శిక్షణ కూడా అందిస్తున్నాయి.

అంతిమంగా, మెడికల్‌ రైటింగ్‌ సంస్థ కాకపోయినా, మెడికల్‌ రైటర్లకు శిక్షణ, కెరీర్‌ అవకాశాలు (వారి జాబ్‌ బోర్డుల ద్వారా) వంటి అవకాశాలను డ్రగ్‌ ఇన్ఫర్మేషన్‌ అసోసియేషన్‌ (డీఐఏ) కూడా విస్తృతంగా కల్పిస్తోంది. పైగా ఫిలడెల్ఫియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ద సైన్సెస్‌ కూడా బయోమెడికల్‌ రైటింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ అందిస్తోంది. ఇది ఆన్‌లైన్‌ కోర్సులు కూడా నడుపుతోంది.

వీటిని కూడా చూడండి

  • వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడిటర్స్‌ (డబ్ల్యూఏఎంఈ)
  • ఏఎండబ్ల్యూఏ జర్నల్‌

బాహ్య లింకులు

మరింత సమాచారం కోసం:

[[Category:సైన్స్‌ రైటింగ్‌


]]