"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వైరా నది

From tewiki
Jump to navigation Jump to search
వైరా
Lua error in మాడ్యూల్:WikidataIB at line 671: attempt to index field 'wikibase' (a nil value).
Krishna River basin map.svg
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ, ఆంధ్రప్రదేశ్
ప్రాంతందక్షిణ భారతదేశం
భౌతిక లక్షణాలు
ప్రధాన వనరువైరా వద్ద, ఖమ్మం జిల్లా
వైరా రిజర్వాయర్, తెలంగాణ, భారతదేశం
27 మీ. (89 అ.)Geographic headwaters
17°12′36″N 80°22′36″E / 17.210009°N 80.376660°E / 17.210009; 80.376660
నదీముఖముకీసర, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
మున్నూరు నది, భారతదేశం
0 మీ. (0 అ.)
16°43′30″N 80°19′07″E / 16.725134°N 80.318710°E / 16.725134; 80.318710Coordinates: 16°43′30″N 80°19′07″E / 16.725134°N 80.318710°E / 16.725134; 80.318710
పొడవు65 కి.మీ. (40 మై.)approx.

వైరా నది, ఖమ్మం జిల్లాలో ప్రవహించే చిన్న నది. ఈ పేరు "విరా నది" నుండి వచ్చినట్లు చెప్పబడుతుంది. ఇది మున్నేరు నదికి ఉపనది. ఇది కృష్ణానదికి ప్రధాన ఉపనది[1]. దీనిపై వైరా వద్ద వైరా రిజర్వాయరు నిర్మించబడినది[2].

పుట్టుక

ఈ నది వైరా జలాశయంలో 27 మీటర్ల ఎత్తులో ఉద్భవించింది. ఇది మధిర గుండా వెళుతుంది. ఈ చిన్ననది 65 కిలోమీటర్ల ప్రయాణం తరువాత మున్నేరు నదిలోకి ప్రవహిస్తుంది.

వైరా రిజర్వాయర్

1930 లో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ వైరా సరస్సు మీదుగా ఒక జలాశయాన్ని నిర్మించింది. దీనిని భారత మాజీ రాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణన్ చే ప్రారంభించబడింది. ఇది 3 టిఎంసిల సామర్ధ్యం కలిగి ఉంది. సుమారు 17,391 ఎకరాల భూమికి సాగునీరు ఇవ్వగలదు. ఆనకట్ట యొక్క పొడవు 1768.3 కిలోమీటర్లు, దాని పునాది నుండి 26 మీటర్ల ఎత్తులో ఉంది[2]. ఆనకట్ట కోసం 5 స్పిల్‌వే గేట్లు ఉన్నాయి. ఈ సరస్సు ఫిషింగ్, సందర్శనా స్థలాలకు ప్రసిద్ధి చెందింది[3]. ఈ జలాశయం చుట్టూ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి.[4][5]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Krishna River -". www.india-wris.nrsc.gov.in (in English). Archived from the original on 2018-11-06. Retrieved 2018-11-06.
  2. 2.0 2.1 "Wyra Lake | Khammam District". khammam.nic.in (in English). Archived from the original on 2018-11-06. Retrieved 2018-11-06.
  3. "Wyra Dam D02538 -". india-wris.nrsc.gov.in (in English). Archived from the original on 2016-08-13. Retrieved 2018-11-06.
  4. Gade, Dr JayaprakashNarayana. WATER RESOURCES AND TOURISM PROMOTION IN TELANGANA STATE (in English). Zenon Academic Publishing. ISBN 9789385886041.
  5. Government, Telangana. "Industrial Profile" (PDF). Telangana Industrial portal. Archived from the original (PDF) on 2019-08-19. Retrieved 2020-04-15.

వెలుపలి లంకెలు