వై.యస్.భారతి

From tewiki
Jump to navigation Jump to search

వై.యస్.భారతి రాజకీయ, వ్యాపారవేత్త అయిన వై.యస్.జగన్మోహన్‌రెడ్డి భార్య. ఈమె డాక్టర్ E.C.గంగిరెడ్డి కుమార్తె, ఈయన స్థానిక పులివెందులలో శిశువైద్యనిపుణుడు. ఈమెకు జగన్ తో1996 ఆగస్టు 28న వివాహం జరిగింది. ఈ జంటకు హర్ష, వర్ష అనే ఇద్దరు కుమార్తెలు. ఈమె తమ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ తమ వ్యాపారాలను కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. ఈమె బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్ (వ్యాపార పరిపాలన) లో పోస్ట్ గ్రాడ్యుయేట్. ఈమె సిమెంట్ తయారీ సంస్థ అయిన భారతి సిమెంట్స్ ను, ప్రసార మాధ్యమాలకు చెందిన తెలుగు దినపత్రిక సాక్షి వార్తా పత్రికను, తెలుగు టీవీ ఛానల్ సాక్షి ఛానల్ నిర్వహిస్తుంది. వీరికి బెంగుళూరు, హైదరాబాదు, పులివెందులలో నివాసగృహాలు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

వై.యస్.షర్మిల

బయటి లింకులు

వంశవృక్షం