శంకర్ నాగ్

From tewiki
Jump to navigation Jump to search
'
Replace this image male.svg
జన్మ నామంShankar Nagarakatte (ಶಂಕರ್ ನಾಗರಕಟ್ಟೆ)
జననం (1954-11-09)1954 నవంబరు 9
మరణం 1990 సెప్టెంబరు 30(1990-09-30) (వయస్సు 35)
Near Davanagere, Karnataka
ఇతర పేర్లు Shankar Anna, Karate King
క్రియాశీలక సంవత్సరాలు 1977 to 1990
భార్య/భర్త Arundathi Nag nee Rao
ప్రముఖ పాత్రలు Sangliyana in Sangliyana
Journalist in Accident
Shankar in CBI Shankar
Criminal in Minchina Ota
Riksha Driver in Auto Raja
Ondu Muttina Kate
Ondanondu kaladalli

శంకర్ నాగ్ (కన్నడ: ಶಂಕರ್ ನಾಗ್, (1954 నవంబరు 9-1990 సెప్టెంబరు 30) శంకర్ నాగరకట్టే అని సుపరిచితుడు (ಶಂಕರ್ ನಾಗರಕಟ್ಟೆ), తన పెద్ద సోదరుడు అనంత నాగ్ (ಅನಂತ್ ನಾಗ್) తోపాటుగా కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు. సుప్రసిద్ధ నవలా రచయిత R.K. నారాయణ్ రచన ఆధారంగా తీసిన టెలిసీరియల్ మాల్గుడి డేస్ (ಮಾಲ್ಗುಡಿ ಡೇಸ್‌) ‌లో ఇతడు నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. (ಆರ್. ಕೆ.ನಾರಾಯನ್) చిన్న కథలు. వీటితో పాటు, కన్నడ నాటకరంగ కార్యకలాపాలలో ఇతడు చురుగ్గా పాల్గొన్నాడు. భారతీయ జాతీయ అవార్డ్ విన్నింగ్ మరాఠీ సినిమా "22 జూన్ 1897"కి ఇతడు సహ రచయిత.

ప్రారంభ వృత్తి జీవితం

శంకర్ నాగ్ కర్నాటకలోని (ఉత్తర కన్నడ జిల్లా, కుంటసమీపంలోని ) హొన్నవర్ తాలూకాలోని మల్లాపూర్ గ్రామం లో 1954 నవంబర్ 9న జన్మించాడు. సాధారణ విద్య పూర్తి చేశాక, శంకర్ నాగ్ ముంబై వెళ్లిపోయాడు). ముంబైలో ఇతడు మరాఠీ నాటకరంగం పట్ల ఆకర్షితుడయ్యాడు మరియు నాటకరంగ కార్యకలాపాలలో మమేకమయ్యాడు. యాదృచ్ఛికంగా ఒక డ్రామా రిహార్సల్‌ సమయంలో తన భావి సతీమణి అరుంధతి (ಅರುಂಧತಿ)ని ఇతడు కలిశాడు.

తర్వాత శంకర్ నాగ్ కర్నాటకకు వెళ్లిపోయాడు. అప్పటికే నటుడుగా స్థిరపడిపోయిన ఇతడి పెద్ద సోదరుడు అనంత్ నాగ్ సినిమాలలో నటించవలసిందిగా ఇతడిని కోరాడు. గిరీష్ కర్నాడ్ తీసిన కళాఖండం, ఒందానందు కాలదల్లి సినిమాలో అతడికి ఒక కిరాయి సేవకుడిగా పాత్ర లభించింది, ఈ సినిమాకు అఖరా కురుసోవా' యొక్క కళాఖండం, సెవెన్ సెమురాయ్ ఆధారం. నటుడిగా అతడి తొలి చిత్రం ఢిల్లీ అంతర్జాతీయ చిత్రోత్సవంలో జాతీయ అవార్డ్‌ను బహూకరించింది. ఆవిధంగా అతడి సినీ కెరీర్ మొదలైంది, 12 సంవత్సరాల కాలంలో (1978 నుంచి 1990 వరకు) ఇతడు 90 కన్నడ సినిమాలలో ప్రధాన పాత్రధారిగా నటించాడు. అంతే కాకుండా (సోదరుడు-నటుడు అనంత్ నాగ్ తో కలిసి) 'మించిన ఊట' (కన్నడలో దొంగపై వచ్చిన సినిమాలకు అరుదైన ఉదాహరణ), "జన్మ జన్మద అనుబంధ" మరియు "గీత" వంటి కొన్ని సినిమాలకు సహనిర్మాణత మరియు దర్శకత్వం కూడా వహించాడు. (చివరి రెండు సినిమాలకు దక్షిణ భారత ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించారు)

తర్వాతి రోజులు

వాణిజ్య చిత్ర నిర్మాతలు శంకర్ నాగ్‌‌ని గుర్తించారు, ప్రత్యేకమైన మసాలా చిత్రాలలో అతడు నటించడం ప్రారంభించాడు. శంకర్ గడ్డం తీయని ముఖం, విశిష్టమైన ఆత్మ విశ్వాసం, నీలి కళ్లు, కఠిన స్వరంతో సాంప్రదాయేతర హీరోగా ఉండేవాడు. ఇతడు ఏ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా తీసుకోనప్పటికీ, అతడు తన కరాటే కింగ్ బిరుదును మాత్రం సంపాదించుకున్నాడు. అతడి పాపులర్ చిత్రాలలో కొన్ని ఆటో రాజా, గీతా, S.P.సాంగ్లియానా, మరియు మించిన ఊట .

1980లలో ఇతడు జనతా పార్టీకి చేరువయ్యాడు.

దర్శకుడిగా తొలి చిత్రం

మించిన ఊట చిత్రంలో శంకర్ నాగ్ దర్శకత్వంలోకి అడుగు పెట్టాడు. ఇది ఇతనికి ఉత్తమ చిత్రంతో పాటుగా ఏడు రాష్ట్ర అవార్డులను సాధించి పెట్టింది. తర్వాత ఇతడు వరుసగా సినిమాలకు దర్శకత్వం వహిస్తూ పోయాడు. వీటిలో జన్మజన్మద అనుబంధ, గీత, యాక్సిడెంట్ (దీనికి పలు రాష్ట్ర, జాతీయ అవార్డులొచ్చాయి), ( Dr. రాజ్‌కుమార్తో కలిసి ముఖ్య పాత్రలో నటించిన ఒందు ముట్టిన కథె వంటివి కొన్ని ప్రముఖ సినిమాలు.

మాల్గుడి డేస్

శంకర్ తన సృజనాత్మకతను సినిమాకు మాత్రమే పరిమితం చేయలేదు. అతడు అంతే సమానంగా నాటకరంగం మరియు టెలివిజన్‌లో కూడా లీనమైపోయాడు. మాల్గుడి డేస్ టెలివిజన్‌‍లో శంకర్ సాధించిన ఘనతకు ఉత్తమ ఉదాహరణగా నిలుస్తుంది. గ్లోబలైజేషన్‌కు ముందు, దూరదర్శన్ భారతదేశంలో ఏకైక బ్రాడ్‌కాస్టర్. ప్రోగ్రాం ప్రొడక్షన్‌తో పాటు, దూరదర్శన్ టెలివిజన్ సీరియళ్లను నిర్మించడానికి ప్రయివేట్ నిర్మాతలను ఆహ్వానించేది. శంకర్ ఈ ప్రతిపాదనను ఆమోదించి, 1987లో R.K.నారాయణ్ చిన్న కథల సంకలనం ఆధారంగా పడం రాగ్ పిల్మ్స్ పతాక కింద మాల్గుడి డేస్‌కి దర్శకత్వం వహించాడు. సుప్రసిద్ధ నటులు విష్ణువర్ధన్, మరియు అనంత్ నాగ్ ఈ సీరియల్‌లో కనిపించారు. నవ్వించే స్వామి పాత్ర పోషించిన మాస్టర్ మంజునాథ్ అప్పట్లో జనం నాలుకల మీద నానేవాడు.

నాద స్వరంలా ధ్వనించే "తనన తన న నా" సంగీతాన్ని L. వైద్యనాధన్ కూర్చారు. Tకర్నాటకలోని షిమోగ జిల్లాలోని అగుంబేలో టెలి సీరియల్‌ను చిత్రీకరించారు. అదే సంవత్సరంలో శంకర్ స్వామి పేరిట మరొక టెలీ సీరియల్‌కి దర్శకత్వం వహించాడు. భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యుత్తమ సీరియల్స్‌లో ఒకటిగా మాల్గుడి డేస్‌ రేటింగ్ సాధించింది.

గుర్తుంచుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, ప్రారంభ రోజుల్లో DD1- కన్నడ పరిచయ ప్రోగ్రాంని అతడు నిర్వహించాడు.

సినీ తారగా చాలా బిజీగా కాలం గడిపినప్పటికీ శంకర్ చాలావరకు థియేటర్‌పై సమయాన్ని కేటాయించాడు. అది దాదాపుగా అతడి రెండో స్వభావం. నిజానికి కన్నడ ఔత్సాహిక థియేటర్‌కి ఇతడు వ్యాపార దృష్టిని తీసుకువచ్చాడు. ఇతడు, ఇతడి భార్య ఇద్దరూ కలిసి SANKET అనే ఆమెచ్యూర్ ధియేటర్ గ్రూప్‌ని స్థాపించారు. కన్నడలో దర్శకుడిగా ఇతడి మొట్టమొదటి చిత్రం అంజూ మిల్లేజ్, దీన్ని గిరీష్ కర్నాడ్ తీశారు. బారిస్టర్, సంధ్య ఛ్చాయ వంటి చిత్ర నిర్మాణాలను ఇతడు కొనసాగించాడు. ఈ మధ్య కాలంలోనే ఇతడు T N నరసింహన్‌తో చేతులు కలిపాడు ఇతడు నోడి స్వామి నవిరోధు హేగే సీరియల్‌ని రాసి సహ దర్శకత్వం వహించాడు. దీంట్లో శంకర్‌తో పాటు అతడి భార్య అరుంధతి నాగ్, రమేష్ భట్ కూడా నటించారు. ఇద్దరూ ఆటా బొంబాట్‌కి దర్శకత్వం వహించారు. శంకర్ నిర్మించిన చివరి చిత్రం నాగమండలం, ఇది గిరీష్ కర్నార్డ్ నాటకం. ఇతడు సురేంద్రనాధ్‌తో పాటు సహదర్శకత్వం నెరిపాడు.

మరణం

జోకుమారస్వామి చిత్రం షూటింగ్ కోసం భార్య అరుంధతి నాగ్ కూతురు కావ్యతో కలిసి ధార్వాడ్ వైపు వెళుతున్నప్పుడు 1990 సెప్టెంబరు 30 ఉదయం దావణగేరె పట్టణం శివార్లలో ఉన్న అనగోడు గ్రామం వద్ద కారు ప్రమాదంలో శంకర్ నాగ్ దుర్మరణం పాలయ్యాడు. తన మరణం తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమ నిజంగానే అధోగతిలోకి దిగజారిపోయింది.

బెంగళూరు సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో కంట్రీ క్లబ్ స్థాపించడం, నందిహిల్స్‌లో రోప్ వే నిర్మించడం, తక్కువ ఖర్చులో గృహ నిర్మాణం చేపట్టడం వంటి పలు అసంపూర్ణ ప్రాజెక్టులను శంకర్ నాగ్ వదిలి వెళ్లిపోయాడు. రామకృష్ణ హెగ్డేని ఆరాధించే శంకర్ క్రియాశీల రాజకీయాల్లోకి పెద్దగా ప్రవేశించలేదు. ఏమయినప్పటికీ ఇతడు బెంగళూరు పట్ల గొప్ప దార్శనికతను కలిగి ఉన్నాడు. 1990ల వెనక్కు వెళితే, అంటే అతడు అనూహ్యంగా కన్ను మూయడానికి ముందుగా, లండన్‌ మెట్రోను సందర్శించిన అనుభవం ప్రాతిపదికన శంకర్ నాగ్ బెంగళూరు సిటీకి మెట్రోను ప్రతిపాదించాడు. కర్నాటకలో మొట్ట మొదటి ఎలెక్ట్రానిక్ రికార్డింగ్ స్టూడియో సంకేత్ ఎలెక్ట్రానిక్స్‌ను ఇతడే ప్రారంభించాడు.

ముఖ్యమైన ఫిల్మోగ్రఫీ

డైరెక్టర్‌గా

 1. మించిన ఊట 1980
 2. జన్మ జన్మద అనుబంధ - 1980
 3. గీత - 1980
 4. నోడి స్వామి నవిరోడు హిగె - 1983
 5. లలాచ్ - 1983
 6. యాక్సిడెంట్ (1985 చిత్రం)
 7. స్వామి (TV సీరీస్) - 1989
 8. ఒందు ముత్తిన కథె - 1987
 9. మాల్గుడి దయ (TV సీరీస్) - 1987
 10. హొస తీర్పు

నటుడిగా

సంవత్సరం చలనచిత్రం Language పాత్ర గమనికలు
1978 ఒందానొందు కాలదల్లి కన్నడ గండుగలి
1979 ఐ లవ్ యు 834 వ్యతిరేక పాత్రతో
సీతారాము కన్నడ
1980 మూగన సేదు కన్నడ
హద్దిన కన్ను కన్నడ
ప్రీతి నాడు తమషె నాడు కన్నడ
ఒందు హెన్ను ఆరు కన్ను కన్నడ
రుస్తుం జోడి కన్నడ
జన్మ జన్మద అనుబంధ కన్నడ అనంతనాగ్‌‌తో కలిసి తను స్వయంగా దర్శకత్వం వహించాడు
1981 థాయియ మడిలల్లి కన్నడ
మహా ప్రచండరు కన్నడ
కరి నాగ కన్నడ
ముచ్చిన ఊట కన్నడ కట్టె తానే దర్శకత్వం వహించాడు
హన బలావో జన బలావో కన్నడ
మునియన మాదరి కన్నడ
జీవక్కె జీవ కన్నడ అనంత నాగ్‌తో
గీత కన్నడ
భారి భర్జారి బేటె కన్నడ
1982 బెంగి చెండు కన్నడ
న్యాయ ఇల్లిదే కన్నడ
కార్మిక కల్లనల్ల కన్నడ విష్ణువర్ధన్‌తో
ఆటోరాజా కన్నడ
అర్చన కన్నడ
1983 నోడి స్వామి నవిరోదు హిగె కన్నడ
రక్త తిలక కన్నడ
చండి చాముండి కన్నడ
నాగబేక్కమ్మ నాగబేకు కన్నడ
గెద్ద మగ కన్నడ
1984 గండ భేరుండ కన్నడ అంబరీష్ తో
ఉత్సవ్ హిందీ సజ్జల్, ది థీఫ్
అపూర్వ సంగమ కన్నడ Dr.రాజ్‌కుమార్
బెంకి బిరుగళి కన్నడ విష్ణువర్ధన్
తాలియ భాగ్య కన్నడ
ఆశా కిరణ కన్నడ
1985 మానవ దానవ/0} కన్నడ
పరమేషి ప్రేమ ప్రసంగ కన్నడ
తాయియ కనసు కన్నడ
యాక్సిడెంట్ కన్నడ
1986 నా నిన్న ప్రీతిసువె కన్నడ
రస్తే రాజా కన్నడ
1987 అంతిమ ఘట్ట కన్నడ
దిగ్విజయ కన్నడ అంబరీష్ మరియు శ్రీనాధ్‌తో
ఈ బంధ అనుబంధ కన్నడ
లారీ డ్రైవర్ కన్నడ
హులి హెబులి కన్నడ
తాయి కన్నడ
1988 SP సాంగ్లియాన కన్నడ సాంగ్లియాన అంబరీష్‌తో
మైథిలేయ సీతెయారు కన్నడ
1989 అంతింత గండు నానల్ల కన్నడ అంబరీష్‌తో
తర్క కన్నడ
CBI శంకర్ కన్నడ
1990 రామరాజ్యదల్లి రాక్షసురు కన్నడ
మహేశ్వర కన్నడ దినేష్‌బాబు దర్శకత్వంలో
SP సాంగ్లియాన II కన్నడ సాంగ్లియాన
నిగూడ రహస్య కన్నడ చివరి చిత్రం
హొస జీవన కన్నడ
1991 పుండ ప్రచండ కన్నడ రమేష్ అరవింద్
సుందరకాండ కన్నడ డైరెక్టర్ K.V.రాజుతో
నాగిని కన్నడ
1993 ప్రాణ స్నేహిత కన్నడ రామకృష్ణతో
తెలియనిది జయభేరి కన్నడ అంబరీష్‌తో
తెలియనిది హాలియ సురాసరరు కన్నడ

రచయితగా

 • 1897 జూన్ 22, మరాఠీ

సూచికలు

 1. http://www.ourkarnataka.com/Articles/sreesha/shankarnag.htm
 2. http://www.viggy.com/english/current_rangashankara.asp

బాహ్య లింకులు