"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

శస్త్ర చికిత్స

From tewiki
Jump to navigation Jump to search
ఒక కార్డియోథొరాసిక్ శస్త్రవైద్యుడు ఫిట్జ్‌సిమోన్స్ ఆర్మీ మెడికల్ సెంటర్‌లో మిట్రల్ కవాటాన్ని మార్చే పని నిర్వహిస్తున్నాడు.

శస్త్రచికిత్స (ఆంగ్లం: Surgery) ("చేతిపని” అనే అర్ధం గల Greek: χειρουργική చెయిరోఅర్జిక్ ద్వారా లాటిన్: chirurgiae గ్రహించబడింది.) ఒక వైద్య విశేషం. దాన్ని హస్త మరియు పరికరాల సాంకేతిక నిర్వహణతో రోగి పైన వ్యాధి లేదా గాయం వంటి రోగలక్షణ పరిస్థితులకు చికిత్సగాను మరియు/లేదా పరిశోధించుటకు గాను, శరీర నిర్వహణ లేదా కనబడే తీరును మెరుగుపరేచేందుకు సహాయంగా, మరియు కొన్నిసార్లు మతపరమైన కారణాల కొరకూ వాడతారు. శస్త్రచికిత్సను నిర్వహించే చర్యను శస్త్రచికిత్సా విధానం అనీ, ఆపరేషన్ అనీ లేదా సరళంగా సర్జరీ అని పిలుస్తారు. ఈ సందర్భంలో, క్రియాపదం ఆపరేట్ అనగా శస్త్రచికిత్స నిర్వహణ అని అర్ధం. విశేషణా పదం సర్జికల్ అంటే అర్ధం శస్త్రచికిత్సకు సంబంధించి అని; ఉదా. శస్త్రచికిత్సా పరికరాలు లేదా శస్త్రచికిత్సా నర్స్ శస్త్రచికిత్స జరపబడు రోగి లేదా అంశం, ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక జంతువు కావచ్చు. సర్జన్ అనగా రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించు వ్యక్తి. అరుదైన సందర్భాలలో, సర్జన్‌లు తమ మీద తాము శస్త్రచికిత్స చేసుకుంటారు. సర్జన్‌లుగా వర్ణించబడే వ్యక్తులు సాధారణంగా వైద్యవృత్తిని ఆచరించువారు, కానీ ఆ పదం వైద్యులకు, చిన్నపిల్లల వైద్యులకు దంత వైద్యులకు (లేదా మౌఖిక మరియు మాక్సిలోఫేషియల్‌గా కూడా పిలవబడతారు.) మరియు పశువైద్యులకు కూడా అనువర్తింపబడుతుంది. శస్త్రచికిత్స నిముషాల నుండి గంటల దాకా కొనసాగుతుంది, అయితే కొనసాగుతూ లేదా ఆవర్తనా కాలంలో సంభవించే చికిత్సగా ఉండజాలదు.

శస్త్రచికిత్స అనే పదం శస్త్రచికిత్స నిర్వహించబడే ప్రదేశాన్ని సూచిస్తుంది, సరళంగా చెప్పాలంటే ఒక వైద్యుడు, దంత వైద్యుడు/మౌఖిక లేదా మాక్సిల్లోఫేషియల్ వైద్యుడు లేదా పశువైద్యుడి కార్యాలయం అనవచ్చు.

శస్త్రచికిత్స నిర్వచనాలు

శస్త్రచికిత్స, కణజాలాలపై భౌతికంగా జోక్యం చేసుకునే ఒక వైద్య సాంకేతికతతో కూడుకున్నది.

సాధారణ సూత్రం ప్రకారం, ఒక రోగి కణజాలం కత్తిరించబడటం లేదా మునుపటినుంచి కొనసాగుతున్న గాయాన్ని కలపటం జరిగితే, అలాంటి విధానాలను శస్త్ర చికిత్సగా పరిగణిస్తారు. యాంజియోప్లాస్టీ లేదా ఎండోస్కోపీ వంటి ఇతర విధానాలు ఈ శీర్షిక క్రింద తప్పనిసరిగా ఉండాలని లేదు, క్రిమిరహిత పరిసరాలు, అనస్థీషియా, క్రిమినాశక పరిస్థితులని, క్లిష్టమైన శస్త్రచికిత్స పరికరాలు మరియు చర్మాన్ని కలిపికుట్టడం లేదా కలిపి గుచ్చడంల వాడకం వంటి “సాధారణ” శస్త్రచికిత్సా విధానాలు లేదా అమరికల ప్రమేయం కలిగి ఉంటే, అప్పుడు వాటిని శస్త్రచికిత్సలుగా పరిగణించవచ్చు. అన్నిరకాల శస్త్రచికిత్సలు లోపలికి చొచ్చుకుపోయే విధానాలుగా పరిగణింపబడతాయి; “నాన్‌ఇన్వేసివ్ శస్త్రచికిత్స”గా పిలువబడేది, ఉనికిలో ఉన్న భాగంలోనికి చొచ్చుకు పోని విధంగా తొలగించబడిన దాన్ని (ఉదా. కార్నియాని లేజర్‌తో తొలగించటం) సూచిస్తుంది లేదా రేడియో సర్జికల్ విధానాన్ని (ఉదా. పుండు యొక్క రేడియేషన్) ని సూచిస్తుంది.

శస్త్రచికిత్సలో రకాలు

సాధారణంగా శస్త్రచికిత్సా విధానాలు అత్యవసరస్థితి, విధాన రీతి, ప్రమేయమున్న శరీరస్థితి, కోతపడే స్థాయి మరియు ప్రత్యేక పరికరాలని బట్టి వర్గీకరించబడతాయి.

ఎంచుకునే శస్త్రచికిత్సను నిర్జీవ-ప్రమాదకర స్థితిని సరిదిద్దటానికి చేస్తారు శస్త్రచికిత్సా నిపుణుడు మరియు శస్త్రచికిత్సా సౌకర్యాల లభ్యతావకాశాన్ని బట్టి, రోగి అభ్యర్ధన మేరకు దీన్ని నిర్వహిస్తారు. అత్యవసర శస్త్రచికిత్స ప్రాణాన్ని కాపాడేందుకు అవయవాల లేదా పనిచేసే సామర్ధ్యాన్ని రక్షించేందుకు త్వరితంగా చేసే ఒక శస్త్రచికిత్స. అన్వేషణాత్మక శస్త్రచికిత్స దీనిని రోగ నిర్ధారణలో సహాయపడేందుకు లేక నిర్ధారించేందుకు నిర్వహిస్తారు. చికిత్సా పూర్వక శస్త్రచికిత్స గతంలో రోగం నిర్ధారించబడిన స్థితికి చికిత్స చేస్తుంది.

విచ్ఛేదన‌లో సాధారణంగా ఒక అవయవాన్ని లేదా అవయవ భాగాన్ని శరీరం నుండి కత్తిరించేస్తారు. రీప్లాంటేషన్‌లో ఒక తీవ్రంగా దెబ్బతిన్న శరీర భాగాన్ని తిరిగి అతికిస్తారు. పునర్నిర్మాణ శస్త్రచికిత్సలో గాయపడిన, ఖండితమైన లేదా ఆకృతి మారిన శరీర భాగాన్ని పునర్నిర్మిస్తారు. కాస్మెటిక్ శస్త్రచికిత్సను మామూలుగా ఉండే శరీర నిర్మాణాన్ని మెరుగుపరచటానికి చేస్తారు. తొలగింపు అనగా రోగి శరీరం నుండి ఒక అవయవాన్ని, కణజాలాన్ని లేదా ఇతర భాగాన్ని కత్తిరించి వేయటం. ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్స అనగా రోగి శరీరంలోకి వేరే మానవ (లేదా జంతువు) నుండి తెచ్చిన శరీర భాగాన్ని చొప్పించి, ఒక అవయవాన్ని లేదా శరీర భాగాన్ని స్థానభ్రంశం చెందించటం. జీవించి ఉన్న మనిషి లేదా జంతువు శరీరం నుండి ట్రాన్స్‌ప్లాంట్ వినియోగం కొరకు ఒక అవయవాన్ని లేదా శరీర భాగాన్ని తొలగించటం కూడా ఒకరకమైన శస్త్రచికిత్సే.

ఒక అవయవ వ్యవస్థ లేదా నిర్మాణం మీద శస్త్రచికిత్స నిర్వహించబడినప్పుడు, అందులో ప్రమేయమున్న అవయవం, అవయవ వ్యవస్థ లేదా కణజాలాన్ని బట్టి, అది వర్గీకరింపబడవచ్చు. ఉదాహరణలలో, గుండె సంబంధ శస్త్రచికిత్స (గుండె మీద నిర్వహింపబడుతుంది), గ్యాస్ట్రియోఇన్‌టెస్టినల్ శస్త్రచికిత్స (జీర్ణ వ్యవస్థ మరియు జీర్ణ సంబంధ అవయవాల మీద నిర్వహింపబడుతుంది) మరియు ఆర్ధోపెడిక్ శస్త్రచికిత్స (ఎముకల/లేదా కండరాల మీద నిర్వహింపబడుతుంది) లు ఉన్నాయి.

కనీస కోత శస్త్రచికిత్సలో సూక్ష్మమైన బాహ్య కోతలతో లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స లేదా యాంజియోప్లాస్టీ వంటి వాటిల్లో సూక్ష్మపరికరాలని శరీర రంధ్రం లేదా నిర్మాణంలోనికి చొప్పించేందుకు వాడతారు. విపర్యయంగా, ఒక తెరచి ఉన్న శస్త్రచికిత్సా విధానానికి కావలసిన శరీర భాగాన్ని అందుకునేందుకు విస్తారమైన కోత అవసరమై ఉంటుంది. లేజర్ శస్త్రచికిత్సలో స్కాల్పెల్ లేదా అదే విధమైన శస్త్రచికిత్సా పరికరాల బదులుగా, కణజాలాన్ని కత్తిరించేందుకు లేజర్ను వాడతారు. శస్త్ర చికిత్సా నిపుణుడు సూక్ష్మ నిర్మాణాలను చూసేందుకు గాను మైక్రోస్కోప్ ఆపరేషన్‌ను ఉపయోగించడంతో సూక్ష్మ శస్త్ర చికిత్స ముడిపడి ఉంది. రొబోటిక్ శస్త్రచికిత్సలో డా విన్సి యొక్క చికిత్సా మరబొమ్మ లేదా జీయుస్ శస్త్రచికిత్సా పద్ధతులని, పరికరాలని నియంత్రించేందుకు వైద్యుల మార్గదర్శకత్వంలో వాడతారు.

పరిభాష

 • తొలగింపు శస్త్రచికిత్స పేర్లు తరచుగా తొలగించబడే (కోసివేసే) శరీర అవయవం పేరుతో ప్రారంభమై -ఎక్టోమీ తో పూర్తవుతాయి.
 • శస్త్రచికిత్స విధానాలలో అవయవాన్ని లేదా కణజాలాన్ని కత్తిరించటంలో ప్రమేయం కలిగి ఉండి -అటామీ తో పూర్తవుతాయి. ఉదర సంబంధ గోడని కోయటం ద్వారా ఉదరకోశాన్ని అందుకోవడానికి చేసే శస్త్రచికిత్సా విధానాన్ని లాపరోటమీ అంటారు.
 • కనీస కోత విధానంలో ఎండోస్కోప్ ద్వారా సూక్ష్మ కోతలతో చొప్పించబడి -ఓస్కోపీ గా ముగుస్తాయి. ఉదాహరణకి, ఉదర కోశంలో జరిపే శస్త్రచికిత్సని లాపరోస్కోపి అని పిలుస్తారు.
 • శాశ్వత లేదా అర్ధ-శాశ్వతంగా తెరచి ఉండటాన్ని శరీరంలో తయారు చేసుకునే విధానాలని స్టోమా అని పిలుస్తారు, ఇది-ఓస్టమీ గా పూర్తవుతుంది.
 • శరీర భాగం యొక్క పునర్నిర్మాణం, ప్లాస్టిక్ లేదా సౌందర్య శస్త్రచికిత్స పేరు పునర్నిర్మాణం గావించబడే శరీర భాగంతో ప్రారంభమై ఒప్లాస్టీ తో పూర్తవుతుంది. రైనోను “ముక్కు”కు ప్రత్యామ్నాయంగా వాడతారు కాబట్టి రైనో ప్లాస్టీ అంటే ప్రాధమికంగా ముక్కు కొరకు పునర్నిర్మాణ లేదా కాస్మెటిక్స్ శస్త్రచికిత్స అని.
 • నష్టమైన లేదా జన్మతః కలిగిన అసాధారణ నిర్మాణాలకి చేసే మరమ్మత్తు -ర్రపి తో పూర్తవుతుంది. హెర్నియోర్రపి అంటే హెర్నియా/వరిబీజంకు చేసే మరమ్మత్తు కాగా, పెరినియోర్రపి అంటే పెరినియంకు చేసే మరమ్మత్తు.

శస్త్రచికిత్సా విధానాల వర్ణన

ఆసుపత్రిలో, ఆధునిక శస్త్రచికిత్సను తరచుగా ఆపరేషన్ ధియేటర్లో చేస్తారు, అందులో శస్త్రచికిత్సా పరికరాలు, రోగి కొరకు ఆపరేషన్ టేబుల్ మరియు ఇతర పనిముట్లని వాడతారు. శస్త్రచికిత్స జరిగే పరిసరాలు మరియు విధానాలు మలినరహిత సాంకేతికత యొక్క నియమాల చేత రక్షింపబడతాయి; “క్రిమిసహిత” లేదా “కాలుష్య” వస్తువుల నుండి “క్రిమిరహిత” (సూక్ష్మక్రిములను తొలగించిన) వస్తువులను నిష్కర్షగా వేరు చేస్తారు. అన్ని శస్త్ర చికిత్స పరికరాలని తప్పనిసరిగా క్రిమిరహితం చేయాలి, మరియు ఏదైనా పరికరం కాలుష్యపూరితం అయినట్లయితే (ఉదా. క్రిమిసహిత/అన్‌స్టెరిలైజ్ పద్ధతిలో పట్టుకున్న, క్రిమిరహిత ఉపరితలాన్ని తాకినట్లుంచబడినా) దాన్ని తప్పకుండా మళ్ళీ క్రిమిరహితం చేయాలి లేదా మార్చి వేయాలి. శస్త్రచికిత్స గది సిబ్బంది తప్పనిసరిగా క్రిమిరహిత ప్రత్యేక దుస్తుల్ని ధరించాలి. (స్క్రబ్స్, స్క్రబ్‌కాప్, క్రిమిరహిత శస్త్రచికిత్సా గౌను, స్టెరైల్ లాటెక్స్ లేదా నాన్ -లాటెక్స్ పాలిమర్ గ్లోవ్స్ మరియు శస్త్రచికిత్సా ముసుగు), ఇంకా వారు తప్పనిసరిగా అనుమతించబడిన, అంటువ్యాధి కారకం కానట్టి పదార్థంతో ప్రతీ విధానానికి ముందు అరచేతులని, చేతులని శుభ్రపరచుకోవాలి.

శస్త్రచికిత్సకు ముందు, రోగికి వైద్య సంబంధ పరీక్షలు నిర్దిష్ట శస్త్రచికిత్సాపూర్వక పరీక్షలు చేయబడతాయి, మరియు వారి భౌతిక స్థితి ASA భౌతిక స్థితి వర్గీకరణ వ్యవస్థ ప్రకారం నమోదు చేయబడతాయి. ఈ ఫలితాలు గనక సంతృప్తికరంగా ఉన్నట్లయితే, రోగి ఒక అంగీకారపత్రంపై సంతకం చేసి శస్త్రచికిత్సకు అనుమతి పత్రం ఇస్తాడు. ఒకవేళ ఈ విధానంలో తగినంత రక్త నష్టానికి దారితీస్తుందన్న అంచనా ఉన్నట్లయితే శస్త్రచికిత్సకు కొన్ని వారాల ముందుగానే ఒక అటాలోగస్ రక్తదానంకు ఏర్పాట్లు చేస్తారు. శస్త్రచికిత్సలో జీర్ణవ్యవస్థ ప్రమేయం ఉంటే, విధానానికి ముందు రోజు రాత్రే పాలీఇథలిన్ గ్లైకోల్ ద్రావణాన్ని త్రాగటం ద్వారా బొవెల్ ప్రెప్ను నిర్వహించవలసిందిగా రోగిని ఆదేశిస్తారు. శస్త్రచికిత్సకు ముందు ఇచ్చే ఔషధాల మీద ఉదరంలోని పదార్ధాల ప్రభావాన్ని కనిష్ఠం చేసేందుకు, మరియు విధాన సమయంలో గానీ, తర్వాత గానీ రోగి వాంతి చేసుకున్నట్లయితే శ్వాస సంబంధ ప్రమాదాలని తగ్గించేందుకు శస్త్రచికిత్సా విధానానికి ముందురోజు రాత్రి అర్ధరాత్రి దాటాక ఆహారం లేదా పానీయాల (ఒక NPO ఆర్డర్) కు దూరంగా ఉండాలని రోగులని ఆదేశిస్తారు.

ముందస్తు శస్త్రచికిత్స నిర్వహణ ప్రదేశంలో రోగి అతడి/ఆమె యొక్క సాధారణ దుస్తులను మార్పిస్తారు మరియు అతడు/ఆమె యొక్క శస్త్రచికిత్స వివరాలను నిర్ధారించవలసిందిగా అడుగుతారు. ఆవశ్యక సంతకాల సమూహన్ని నమోదు చేస్తారు, ఒక కైవారపు IV వరుసను ఉంచుతారు, మరియు శస్త్రచికిత్సకు ముందు ఇచ్చే ఔషధాలు (క్రిమి సంహారకాలు, మత్తు కలిగించే ఔషధాలు వగైరా) ఇస్తారు. రోగి శస్త్రచికిత్సశాల లోనికి ప్రవేశించినప్పుడు, శస్త్రచికిత్స చేయవలసిన భాగం మీది చర్మాన్ని శుభ్రం చేస్తారు మరియు అంటువ్యాధి యొక్క సంభావ్యతని తగ్గించేందుకు క్లోరో హెక్సిడైన్ గ్లుకొనెట్ లేదా పొవిడొన్-అయోడిన్ వంటి క్రిమిసంహారకాన్ని పూసి తయారుగా చేస్తారు. శస్త్రచికిత్స చేయవలసిన చోట వెండ్రుకలు ఉన్నట్లయితే, సన్నాహక అప్లికేషన్‌కు ముందుగానే వాటిని తొలగిస్తారు. రోగికి ఒక ప్రత్యేకమైన శస్త్రచికిత్సాపూర్వక స్థితిని కల్పించేందుకు ఒక అనెస్థీషియాలజిస్ట్ లేదా నివాస వైద్యుడు ఉపచర్య చేస్తాడు, అప్పుడు శస్త్రచికిత్స చేయవలసిన భాగం మరియు రోగి తల తప్ప రోగి మిగిలిన శరీరమంతా క్రిమిరహిత తెరలని వాడి కప్పివేస్తారు, ఆ తెరలను “ఈథర్ తెర” ఏర్పడేటందుకు పడక యొక్క తల దగ్గర ఉండే ఒక జత స్తంభాలకు కలిపి ఉంచుతారు, అది అనెస్థెటిక్/అనెస్థెషియోలజిస్ట్ల పనిప్రదేశాన్ని (అన్‌స్టైరైల్) శస్త్రచికిత్స ప్రదేశం (స్టెరైల్) నుండి వేరు చేస్తుంది.

కోత, కణజాల నిర్వహణ మరియు చర్మం చేర్చి కుట్టటాల నుండి కలిగే నొప్పిని నివారించేందుకు అనెస్థీషియా నిర్వహిస్తారు. శస్త్రచికిత్స విధానాన్ని బట్టి, అనెస్థీషియా స్థానికంగా లేదా సాధారణ అనెస్థీషియాగా ఏర్పాటు చేస్తారు. స్పైనల్/వెన్నెముక అనెస్థీషియా ఉపయోగించవచ్చు, అయితే సాధారణ అనెస్థీషియా కోరదగింది కాదు. స్థానిక మరియు స్పైనల్ అనెస్థీషియాతో, శస్త్రచికిత్స చేయవలసిన భాగం స్పర్శ కోల్పోతుంది గానీ, రోగి స్పృహలోనే ఉంటాడు లేదా కనిష్ఠంగా మత్తులో ఉంటాడు. దీనికి విపర్యయంగా, సాధారణ అనెస్థీషియా రోగిని శస్త్రచికిత్సా సమయంలో స్పృహలో లేకుండా మరియు మొద్దు బారేటట్లుగా చేస్తుంది. రోగికి గొట్టం వేయుట మరియు కృత్రిమ శ్వాస కల్పించబడినప్పుడు, ఇంజెక్షన్ మరియు గాలి పీల్చే సాధనాల సమ్మేళనంతో అనెస్థీషియా ఏర్పాటు చేస్తారు.

శస్త్రచికిత్స చేయవలసిన భాగాన్ని అందుకునేందుకు ఒక కోతను వాడతారు. రక్తస్రావాన్ని నివారించేందుకు రక్తనాడులను బిగించిపెడతారు, శస్త్రచికిత్స చేయవలసిన భాగాన్ని ప్రదర్శించేందుకు లేదా కోతని తెరచి ఉంచేందుకు రిట్రాక్టర్స్‌ని వాడవచ్చు. శస్త్రచికిత్స చేయవలసిన భాగాన్ని అందుకోవడానికి పలు కోతలు మరియు కోసి విడదీయుటల ప్రమేయం ఉంటుంది, ఉదర సంబంధ శస్త్రచికిత్స వంటి వాటిలో, కోత, చర్మం గుండా, అధఃచర్మపు కణజాలం గుండా, కండరాల మూడు పొరల గుండా, అప్పుడు పెరిటోనియం గుండా ప్రయాణిస్తుంది. కొన్ని నిర్దిష్ట సందర్భాలలో, శరీరంలోని మరింత లోతట్టు భాగాన్ని అందుకునేందుకు ఎముకను కత్తిరించవలసిన వస్తుంది; ఉదాహరణకు మెదడు శస్త్రచికిత్స కోసం కపాలాన్ని కత్తిరించటం లేదా థొరాసిక్ (వక్షస్థలం) శస్త్రచికిత్స కోసం ఉరఃపంజరాన్ని తెరచేందుకు ఉరోస్థిని కత్తిరించటం.

శరీరంలో సమస్యని సరిదిద్దే క్రియ అప్పుడు ముందుకు సాగుతుంది. ఈ పనిలో క్రింది వాటి ప్రమేయం ఉంటుంది:

 • తొలగింపు - అవయవం, కణితి, [1] లేదా ఇతర కణాల తొలగింపు.
 • రిసెక్షన్ - ఒక అవయవం లేదా శరీర నిర్మాణం యొక్క పాక్షిక తొలగింపు.
 • ప్రత్యేకించి తీవ్రంగా దెబ్బతిన్నట్లయితే అవయవాలు, కణాలు వగైరాలను తిరిగి అనుసంధానించడం. పునఃసంధానంతో ముడిపడిన పేగుల వంటి అవయవాల విచ్ఛేదం. అంతర్గత సూదనం లేదా చర్మం చేర్చి కుట్టడం ఉపయోగించబడవచ్చు. రక్త నాళాలు లేదా ఇతర గొట్టపు రూపం లేదా పేగు కంతల వంటి బోలు ఆకారపు నిర్మాణాల మధ్య శస్త్రచికిత్సాపరమైన అనుసంధానాన్ని అనస్టోమోసిస్ అంటే చేర్చి కుట్టడం అని అంటారు.
 • బంధనం - రక్తనాళాలు, నాళాలు లేదా "నాళికల"ను ముడివెయ్యడం.
 • అంటుకట్టడం - ఒకే శరీరం (లేదా మరొక) శరీరం నుంచి కోసిన కణాల ముక్కలు లేదా శరీరానికి ఇప్పటికీ పాక్షికంగా అంటుకుని ఉన్నప్పటికీ, సమస్యాత్మకంగా ఉన్న శరీర ప్రాంతాన్ని తిరిగి అమర్చడానికి లేదా పునర్నిర్మించడానికి ఉద్దేశించబడింది. అంటుకట్టడం అనేది కాస్మెటిక్ సర్జరీలో తరచుగా ఉపయోగిస్తున్నప్పటికీ దీన్ని ఇతర శస్త్రచికిత్సలలో కూడా వాడుతుంటారు. రోగి శరీరపు ఒక ప్రాంతం నుంచి తీసుకుని శరీరంలోని మరో ప్రాంతంలో చొప్పించడానికి గ్రాఫ్ట్ -అంటు-లను తీసుకోవచ్చు. ఒక ఉదాహరణ బైపాస్ సర్జరీ, ఈ పద్ధతిలో అవరోధం ఏర్పడిన రక్త నాళాలను పక్కకు తప్పించి -బైపాస్- శరీరంలోని మరొక భాగంతో అంటుకట్టడం. ప్రత్యామ్నాయంగా, ఇతర వ్యక్తులు, మృతదేహాలు లేదా జంతువుల నుంచి కూడా అంటుకట్టవచ్చు.
 • శరీర భాగాలను అవసరమైనప్పుడు గుచ్చడం. ఎముకలను అతికించి, గట్టిగా పట్టి ఉంచడానికి పిన్నులు లేదా స్క్రూలు ఉపయోగించవచ్చు. ఎముక విభాగాలను ప్రొస్తెటిక్ రాడ్లు లేదా ఇతర భాగాలతో భర్తీ చేయవచ్చు. ఒక్కోసారి పుర్రెలోని దెబ్బతిన్న భాగాన్ని భర్తీ చేయడానికి ప్లేట్‌ని ప్రవేశపెట్టవచ్చు. కృత్రిమ తుంటి మార్పిడి ఇప్పుడు మరింత సాధారణమైపోయింది. గుండె పేస్‌మేకర్‌లు లేదా కవాటాలు చొప్పించబడవచ్చు. అనేక ఇతర ప్రొస్థెసెస్ రకాలు ఉపయోగించబడతాయి.
 • రంధ్రం సృష్టి, శరీరాన్ని శాశ్వతంగా లేదా అర్థ శాశ్వతంగా తెరిచి ఉంచడం.
 • ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలో, డోనార్ ఆర్గాన్ (దాత శరీరం నుంచి తీసుకున్నది) రోగి శరీరంలోకి చొప్పించబడుతుంది మరియు అవసరమైన అన్ని మార్గాలలో (రక్తనాళాలు, నాళికలు, వగైరా) దీన్ని రోగికి తిరిగి అనుసంధానిస్తారు.
 • ఆర్త్రోడెసిస్ - పక్కన ఉన్న ఎముకలను శస్త్రచికిత్స ద్వారా అనుసంధానించడం, దీనివల్ల ఎముకలు మళ్లీ ఒకటిగా పెరుగుతాయి. వెన్నెముక ఏకీకరణ పొరుగున ఉన్న ఎముక నిర్మాణానికి ఒక ఉదాహరణ. ఇది వీటిని ఒకే ముక్కగా పెంచుతుంది.
 • బరువు తగ్గించుకోవడం కోసం బారియాట్రిక్ సర్జరీలోని డైజెస్టివ్ ట్రాక్ట్‌ని మెరుగుపరుస్తుంది.
 • ఫిస్టుల్లా, హెర్నియా, సేక ప్రోలాప్స్ యొక్క మరమ్మతు
 • ఇతర విధానాలు, కింద పొందుపర్చబడినవి:
 • గడ్డకట్టిన నాళికలు, రక్తం లేదా ఇతర నాళాలను శుద్ధిపర్చడం
 • కాల్క్యులి (రాళ్లు) తొలగించడం.
 • పోగుపడిన ఫ్లూయిడ్‌లను వెళ్లగొట్టడం
 • శస్త్రచికిత్సాపరమైన తొలిగింపు- మృతిచెందిన, దెబ్బతిన్న లేదా చనిపోయిన కణం తొలగింపు
 • కలిసిపోయిన కవలలను వేరు పర్చడానికి శస్త్రచికిత్స కూడా నిర్వహించబడింది.
 • సెక్స్ మార్పిడి ఆపరేషన్‌లు

రక్తం లేదా రక్త విస్తరణలు, శస్త్రచికిత్సా సమయంలో కోల్పోయిన రక్తానికి పరిహారంగా పనిచేస్తాయి. విధానం ఒకసారి పూర్తయ్యాక, కోతపెట్టిన భాగాన్ని మూసివేయడానికి నరాలు లేదా దారాలు ఉపయోగించబడతాయి. ఒకసారి కోతపెట్టిన భాగాన్ని మూసివేశిన తర్వాత అనస్తిటిక్ ఏజెంట్లు నిలిచిపోతాయి మరియు/లేదా వెనక్కు తిరుగుతాయి, మరియు రోగికి పెట్టిన కృత్రిమ శ్వాస తీసి వేయబడుతుంది (సాధారణ అనస్థీషియాను ఇచ్చి ఉన్నట్లయితే).

శస్త్రచికిత్స పూర్తయ్యాక, రోగి అనస్థీషియా అనంతర కేర్ యూనిట్‌‌‌కు మార్చబడతాడు మరియు క్షుణ్ణంగా పర్యవేక్షింపబడతాడు. రోగి అనస్థీషియానుంచి కోలుకున్నట్లు నిర్ధారించబడ్డ తర్వాత, అతడు ఆసుపత్రిలోని శస్త్రచికిత్స వార్డుకు బదిలీ చేయబడతాడు లేదా ఇంటికి పంపించివేయబడతాడు. ఆపరేషన్ అనంతర దశలో రోగి సాధారణ పనితీరు అంచనా వేస్తారు, తదనంతర ఫలితాన్ని మదింపు చేస్తారు, ఆపరేషన్ జరిగిన చోటులో సంక్రమణ చిహ్నాలు ఉన్నాయేమో తనిఖీ చేస్తారు. తొలగించదగిన స్కిన్ క్లోజర్లు ఉపయోగించబడినట్లయితే, ఆపరేషన్ జరిగిన 7 నుంచి 10 రోజుల మధ్యలో వాటిని తొలగిస్తారు లేదా కోత పెట్టిన చోట గాయం మానిన తర్వాత తొలగిస్తారు.

ఆపరేషన్ అనంతర చికిత్స కెమోథెరపీ, రేడియేషన్ థెరఫీ, లేదా ట్రాన్స్‌ప్లాంట్‌ల కోసం యాంటీ రిజెక్షన్ మెడికేషన్ వంటి ఔషధ నిర్వహణ వంటి సహాయ ఔషధ చికిత్సను కలిగి ఉంటుంది. కోలుకుంటున్న దశలో తర్వాతి దశలో తదుపరి అధ్యయనాలు లేదా సహాయక చర్యలు చేపట్టడం, అందివ్వడం జరుగుతుంది.piklkjm, hns, hnn jajhgjhskhuhksk lkkojjjkklkskjdjfjklskdhf

చరిత్ర

కనీసం రెండు చరిత్ర పూర్వ సంస్కృతులు శస్త్రచికిత్స రూపాలను అభివృద్ధి చేశాయి. వీటిలో పురాతనమైన రూపానికి సాక్ష్యం ట్రెపనేషన్, [2] దీంట్లో పుర్రెలోపలకి ఒక రంధ్రం డ్రిల్ చేస్తారు లేదా చిన్న ముక్కను గుచ్చుతారు, అంతర్గత కపాల కుహరం ఒత్తిడికి మరియు ఇతర వ్యాధులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి నాడీమండల పొర పదార్థాన్ని బహిర్గతపర్చడం జరుగుతుంది. నియోలిథిక్ కాలం నుంచి గుహా కుడ్యచిత్రాలలో చరిత్ర పూర్వ మానవ అవశేషాలలో దీనికి సాక్ష్యం కనుగొనబడింది మరియు లిఖిత చరిత్రలో కూడా ఈ విధానాన్ని ఉపయోగించడం కొనసాగింది. ఆశ్చర్యకరంగా, అనేక చరిత్ర పూర్వ మరియు అధునిక పూర్వ చిత్రాలు తమ పుర్రె నిర్మాణం స్పర్శవైద్యానికి గురైన చిహ్నాలన కలిగి ఉన్నాయి. ఈ తరహా శస్త్రచికిత్సలో చాలా మంది బతికి బయటపడ్డారని ఇది సూచిస్తుంది. సింధు లోయ నాగరికత యొక్క పూర్వ హరప్పా కాలాల నుంచి అవశేషాలు (c. 3300 BCE) 9000 సంవత్సరాలకు ముందే మానవుల పన్నుకు రంధ్రం పెట్టినట్లు సాక్ష్యం లభించింది.[3] చరిత్ర పూర్వ శస్త్రచికిత్స సాంకేతిక పద్ధతులకు సంబంధించిన తుది పరీక్ష ప్రాచీన ఈజిప్ట్, ఇక్కడ లభించిన [[హనువు|కింది దవడ ఎముక]] దాదాపుగా 2650 BCE నాటిది దీనిలోని తొలి పన్ను కుదురుకు కింది భాగాన ఉన్న రెండు రంధ్రాలు పుండుపడిన పన్ను నుంచి చీముకారినట్లు సూచిస్తున్నాయి.

ప్రాచీన ఈజిప్టులో దాదాపు 3500 సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్సకు సంబంధించిన పురాతన పాఠ్యభాగాలు ఉన్నట్లు కనుగొన్నారు. శస్త్రచికిత్స ఆపరేషన్లు నేటి వైద్య చికిత్సకు సరిపోలి ఉండే చికిత్సలో నైపుణ్యం పొందిన పూజారులచేత నిర్వహించబడేవి. ఈజిప్టులో దొరికే పురాతన పత్రంలో ఈ చికిత్సా విధానాలు పొందుపర్చబడ్డాయి. ఇవి రోగి కేస్ ఫైళ్లను వర్ణించిన తొలి చారిత్రక పత్రాలు: న్యూ యార్క్ అకాడెమీ ఆఫ్ మెడిసన్‌లో ఉంచబడిన) ఎడ్విన్ స్మిత్ పురాతన పత్రం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం ఆధారంగా జరిగిన వైద్య విధానాలను పొందుపర్చింది కాగా, ఎబెర్స్ పురాతన పత్రం, ఇంద్రజాలం ఆధారంగా చేసే స్పర్శవైద్యాన్ని వర్ణించింది. వీరి చికిత్సా నైపుణ్యాన్ని తదనంతర కాలంలో హెరోడోటస్ పొందుపర్చారు: "వైద్య అభ్యాసం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఒక్కో వైద్యుడు ఒక వ్యాధిని మాత్రమే పరిశీలించేవాడు. దేశంలో ఎక్కడ చూసినా వైద్యులే ఉండేవారు, కొందరు కంటి చికిత్స చేస్తే, కొందరు పళ్లకు చికిత్స చేసేవారు, మరికొందరు పొత్తికడుపు వైద్యులు కాగా, ఇతరులు శరీర అంతర్గత వ్యాధులకు చికిత్స చేసేవారు."[4]

శస్త్రచికిత్స జ్ఞానాన్ని కలిగిన ఇతర పురాతన సంస్కృతులలో ఇండియా, చైనా మరియు గ్రీస్ కూడా ఉండేవి.

శుష్రుతుడు (శుశ్రుతుడు లేదా శుష్రుతుడు అని కూడా పలుకబడుతుంది) c. 6వ శతాబ్ది BCE, శస్త్రచికిత్స పితామహుడిగా పేరు పొందాడు. ఇతడు ప్రాచీన భారతదేశపు విఖ్యాత శస్త్రవైద్యుడు, శుశ్రుత సంహిత గ్రంథ రచయిత. సంస్కృతంలో రాసిన ఈ పుస్తకంలో ఇతడు 120 శస్త్రచికిత్సా పద్ధతులను, 300 శస్త్రచికిత్సా విధానాలను వర్ణించాడు మరియు మానవ శస్త్రచికిత్సను 8 విభాగాలుగా వర్గీకరించాడు. ఇతడు ప్లాస్టిక్ శస్త్రచికిత్సలను కేటరాక్ట్ ఆపరేషన్లు మరియు సిజేరియన్ అంటే పొట్టకోసి బిడ్డను తీయడం వంటి వాటిని కూడా నిర్వహించేవాడు. ఇతడు ఎనస్థీటిక్స్‌కు సరిపోలి ఉండే మూలికారసాన్ని ఉపయోగించేవాడు. ఇతడు ఆయుర్వేదంలో ధన్వంతరి వైద్యవిధానంలో శస్త్రచికిత్సా నిపుణుడు.[ఉల్లేఖన అవసరం]

హిప్పోక్రేట్స్ ప్రమాణంలో పేర్కొన్నాడు (c. 400 BC) సాధారణ వైద్యులు ఎప్పుడు కూడా శస్త్రచికిత్స చేయరాదు, శస్త్రచికిత్స విధానాలు నిపుణుల చేతే నిర్వహింపబడాలి.

పురాతన గ్రీసులో, నొప్పి తగ్గించే దేవుడు అస్క్లెపియస్‌కి అంకితం చేసిన ఆలయాలుండేవి, ఇతడు అస్క్లెపీయియా (Greek: Ασκληπιεία పాటగా కూడా సుపరిచితుడు. అస్క్లెపియన్ Ασκληπιείον ), వైద్య సలహా, రోగనిరూపణ, మరియు స్పర్శవైద్యాల కేంద్రాలుగా పనిచేసేవాడు.[5] ఈ అన్ని మందిరాల్లోనూ, రోగులు "ఎంకోయిమెసిస్‌" (Greek: ενκοίμησις) గా పరిచితమైన ప్రేరేపిత నిద్రలోని స్వాప్నిక స్థితిలోకి ప్రవేశిస్తారు, దీంట్లో వీరు స్వప్నంలోని దేవత నుంచి సలహా పొందవచ్చు లేదా శస్త్రచికిత్స ద్వారా స్వస్థత పొందవచ్చు.[6] ఎపిడారస్, యొక్క అస్క్లెపీయియన్‌లో, 350 BCEనాటికి చెందిన మూడు అతి పెద్ద పాలరాతి ఫలకాలలో సమస్యతో ఆలయానికి వచ్చిన 70 మంది పేర్లు, కేస్ వివరాల చరిత్ర, ఆరోపణలు మరియు స్వస్థత వంటి వివరాలను భద్రపర్చారు. పొత్తికడుపులో కణితిని తెరవడం లేదా బాధకలిగించే ఫారిన్ పదార్థం తొలగించడం వంటి శస్త్రచికిత్సా పరమైన స్వస్థతలు వీటిలో భద్రపర్చారు, వీటిని స్వీకరించదగినంత వాస్తవపూరితమైనవే కాని ఎంకోయిమెసిస్ స్థితిలో ఉన్న రోగి, నల్లమందు వంటి మత్తు పుట్టించే పదార్ధాల సహాయంతో ప్రేరేపించబడతాయి.[7] ప్రతి సంవత్సరం అక్టోబరు 16న ప్రపంచ అనస్థీషియా దినోత్సవంగా జరుపుకుంటారు.[8]

గ్రీక్ దేశానికి చెందిన గాలెన్ ప్రాచీన ప్రపంచంలోని సుప్రసిద్ధుడైన శస్త్రచికిత్సా నిపుణులలో ఒకడు, ఇతడు — మెదడు మరియు కంటి శస్త్రచికిత్స తోసహా — పలు సాహసోపేతమైన ఆపరేషన్లను నిర్వహించాడు. ఇతడు చేసిన ఆపరేషన్లను తర్వాత రెండు వేల సంవత్సరాల వరకు ఎవరూ ప్రయత్నించలేక పోయారు.

చైనాలో, హువా టువో తూర్పు హాన్ మరియు త్రీ కింగ్‌డమ్స్ కాలంలో సుప్రసిద్ధ చైనా శస్త్రవైద్యుడిగా ఉండేవాడు. ఇతడు ఎనస్థీషియా సహాయంతో ఒక మొరటైన, అతి సాధారణ పద్ధతిలో శస్త్రచికిత్స చేసేవాడు.

మధ్య యుగాలలో, శస్త్రచికిత్స ఇస్లామిక్ ప్రపంచంలో అత్యున్నత స్థాయిని చేరుకుంది. అబుల్కసిస్ (అబు అల్-ఖాసిమ్ ఖలాఫ్ ఇబిన్ అల్-అబ్బాస్ అల్-జహ్రావి), ఒక అండలూసియన్-అరబ్ శస్త్రవైద్యుడు మరియు శాస్త్రజ్ఞుడు, కొర్డోబాకి చెందిన జహ్రా శివారులో వైద్య వృత్తి చేస్తూండిన ఇతడు పునరుజ్జీవనయుగం[9] వరకు యూరోపియన్ శస్త్రచికిత్సా విధానాలను రూపు దిద్దిన వైద్య పుస్తకాలను రచించాడు.[unreliable source?]

యూరప్‌లో వృత్తినవలంభించడానికి ముందు పలు సంవత్సరాలు చదువవలసిన సర్జన్లకు డిమాండ్ పెరిగింది; మోంట్‌పెల్లియర్, పడువా మరియు బొలోగ్నా వంటి విశ్వవిద్యాలయాలు ప్రత్యేకించి ఇందుకు పేరుగాంచాయి. మధ్యయుగాలలో అత్యంత ప్రముఖ సర్జన్లకు గై డె ఛౌలియాక్ పేరెన్నిక గన్నది. అతడి చిరూర్గియా మాగ్నా లేదా గొప్ప శస్త్రచికిత్స (1363) పదిహేడవ శతాబ్దం వరకు శస్త్రచికిత్సకారులకు ప్రామాణిక గ్రంథంగా ఉండేది.[10] పదిహేనవ శతాబ్ది నాటికి శస్త్రచికిత్స కేవలం మెడిసిన్ కంటే తక్కువ స్థాయిలో తన స్వంత విషయంగా ఉంటున్న భౌతికశాస్త్రం నుంచి విడిపోయింది. రోగెరియస్ సలెర్నిటానస్ తన చిరుర్గియా పుస్తకాన్ని ప్రచురించేంత వరకు మెడిసిన్ అనేది కళా సంప్రదాయ రూపాన్ని చేపట్టింది, ఈ పుస్తకం ఆధునిక పాశ్చాత్య శస్త్రచికిత్స పాఠ్యగ్రంథాలకు ఆధునిక కాలం వరకు పునాది రాయి వేసింది. పంతొమ్మిదో శతాబ్ది చివరలో, బ్యాచ్‌లర్ ఆఫ్ సర్జరీ డిగ్రీలను (సాధారణంగా ChB), (MB) లతో పాటు బహుకరించడం ప్రారంభమైంది, మాస్టర్‌షిప్ అనేది పైస్థాయి డిగ్రీగా మారింది, సాధారణంగా దీన్ని లండన్‌లో ChM లేదా MS అని సంక్షిప్తీకరించేవారు, దీంట్లో తొలి డిగ్రీగా MB, BS ఉండేది.

బార్బర్-సర్జన్లు సాధారణంగా చెడ్డపేరును కలిగి ఉండేవారు. సహాయక రంగంగా కాకుండా ప్రత్యేక మెడిసిన్‌గా ఇది అకడమిక్ సర్జరీగా అభివృద్ధి చెందనంతవరకు వీరికి చెడ్డపేరు ఉండేది.[11] మైక్రో ఆర్గానిజంల వృద్ధి, హెచ్చింపు వంటి ప్రాథమిక శస్త్రచికిత్స సూత్రాలు హల్‌స్టీడ్స్ సూత్రాలుగా పేరొందాయి.

ఆధునిక శస్త్రచికిత్స

Hieronymus Fabricius, Operationes chirurgicae, 1685

శాస్త్రీయ యుగావిర్భావంతో ఆధునిక శస్త్రచికిత్స శరవేగంగా వ్యాపించింది. ఆంబ్రోయిస్ పారే (కొన్ని సందర్భాలలో "ఆంబ్రోస్"[12] అని పలుకబడుతూ ఉంటుంది) తుపాకి కాల్పుల గాయాలకు చికిత్స చేయడంలో మార్గదర్శకత్వం వహించాడు, నెపోలియన్ యుద్ధాల కాలంలో యుద్ధరంగ వైద్యులే తొలి ఆధునిక శస్త్రవైద్యులు. నౌకారంగంలో ఉండే శస్త్రవైద్యులు తరచుగా బార్బర్ సర్జన్‌లుగా ఉండేవారు, వీరు క్షురకులుగా తమ ప్రధాన ఉద్యోగంతో శస్త్రచికిత్సను కలిపేవారు. ఆధునిక శస్త్రచికిత్స పద్ధతులు పరివర్తనను మూడు ప్రధాన పరిణామాలు అనుమతించాయి - రక్తస్రావం నియంత్రణ, ఇన్‌ఫెక్షన్‌ల నియంత్రణ మరియు నొప్పి నియంత్రణ (అనస్థీషియా).

రక్తస్రావం
ఆధునిక శస్త్ర చికిత్స అభివృద్ధికి ముందుగా, చికిత్సకు ముందు లేదా ఆపరేషన్‌కు ముందుగానే రోగి రక్తస్రావంతో మరణించేవాడు. దహనీకరణ (అత్యధిక ఉష్ణంతో గాయాన్ని నిలువరించడం) విజయవంతమైందే కాని పరిమిత ప్రయోజనం ఉండేది - ఇది విధ్వంసకరమైనంది, బాధాకరమైనది, దీర్ఘకాలంలో ఇది చాలా పేలవమైన ఫలితాలను అందిస్తుంది. లిగాట్యుర్స్ లేదా పలు రక్త నాణేలను ముడి వేయడానికి ఉపయోగించే దారం, ప్రాచీన రోమ్[13] కాలం నాడే తయారు చేయబడింది, దీన్ని 16వ శతాబ్దంలో ఆంబ్రోస్ పారే మరింతగా అభివృద్ధి చేశాడు. ఈ పద్ధతి దహనీకరణ పద్ధతి కంటే ఎంతో మెరుగు పర్చినదే అయినప్పటికీ, సంక్రమణ సోకే ప్రమాదాన్ని నియంత్రించడం సాధ్యపడినంతవరకు ఇది ప్రమాదభరితంగానే ఉంటూ వచ్చింది. రక్త నాణాలను ముడివేసే పద్ధతి ఆవిష్కరించబడేనాటికి సంక్రమణ‌ పూర్తిస్థాయిలో అర్థమయ్యేది కాదు. చివరకు, 20 శతాబ్ది ప్రారంభంలో రక్త గ్రూపులపై పరిశోధన మొట్టమొదటి సమర్థవంతమైన రక్త మార్పిడికి అనుమతించింది.
నొప్పి
అనస్థీషియా ద్వారా ఆధునిక నొప్పి నివారణను ఇద్దరు అమెరికన్ దంత శస్త్రచికిత్సకారులు, హోరేస్ వెల్స్ (1815–1848) మరియు విలియం T. G. మోర్టన్‌లచే కనుగొనబడింది. అనస్థీషియా కనుగొనడానికి ముందుగా, శస్త్రచికిత్స అనేది బాధాకరమైన విధానంతో ఉండేది, రోగుల బాధను తగ్గించడానికి శస్త్రచికిత్సకారులను వీలైనంత వేగంగా చికిత్స చేయమని ప్రోత్సహించేవారు. దీనర్థం, ఆపరేషన్లు చాలావరకు అంగవిచ్ఛేదాలు మరియు శరీరానికి బయట పెరిగిన భాగాల తొలగింపులకు పరిమితం అయ్యేది. 1840ల ప్రారంభంలో, ఈథర్ మరియు క్లోరోఫామ్ వంటి సమర్థవంతమైన మరియు ఆచరణాత్మకమైన అనస్థెటిక్ రసాయనాలను కనుగొనడంతో శస్త్రచికిత్స నాటకీయంగా మార్పు చెందడం మొదలెట్టింది. వీటిని తర్వాత జాన్ స్నో ద్వారా బ్రిటన్ కనుగొన్నది. రోగి బాధను తగ్గించడమే కాకుండా, అనస్థీషియా మానవ శరీరంలోని అంతర్భాగాలలో మరింత క్లిష్టమైన ఆపరేషన్లను అనుమతించింది. పైగా, క్యురేర్ వంటి కండర విశ్రామకాలను కనుగొనడంతో సురక్షితమైన అప్లికేషన్లు అనుమతించబడ్డాయి.
సంక్రమణం
దురదృష్టవశాత్తూ, అనస్థీటిక్స్ వెలుగులోకి రావడంతో మరింతగా శస్త్రచికిత్స ప్రోత్సహించబడింది కాని, ఇది అనుకోకుండా మరింత ప్రమాదకరంగా రోగి ఆపరేషన్ అనంతర సంక్రమణలకు కారణభూతమయ్యింది. సంక్రమణ భావన సాపేక్షికంగా ఆధునిక కాలం అడుగిడినంతవరకు ఎవరికీ పెద్దగా తెలీదు. సంక్రమణపై పోరాడటంలో తొలి పురోగతి 1847లో హంగేరియన్ డాక్టర్ ఇగ్నాజ్ సెమ్మెల్వియస్ ద్వారా సాధ్యపడింది, అవయవ విచ్ఛేదన చేసే గది -డిసెక్టింగ్ రూమ్- నుంచి తాజాగా బయటకు వచ్చే వైద్య విద్యార్థులు మంత్రసానులతో పోలిస్తే ఎక్కువగా ప్రసూతి మరణాలకు కారకులయ్యేవారు. సెమ్మెల్వియస్, హేళనను, వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, ప్రసూతి కేంద్రాలలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ చేతులు కడుక్కుని రావడం తప్పనిసరిగా ఆదేశించాడు, ప్రసూతి మరియు గర్భస్త మరణాలను తగ్గించినందుకు గాను ఇతడు అవార్డు పొందాడు కూడా. అయితే UK లోని రాయల్ సొసైటీ ఇతడి సూచనను తోసిపుచ్చింది. బ్రిటిష్ సర్జన్ జోసెఫ్ లిస్టర్ సంక్రమణలను నిరోధించడానికి సర్జరీ సమయంలో ఫెనాయిల్ ఉపయోగించడంపై ప్రయోగాలు చేస్తున్నప్పుడు లూయిస్ పాశ్చర్ పరిశోధన మరియు మైక్రోబయాలజీలో అతడి ముందంజ కారణంగా గణనీయ పురోగతి సాధ్యపడింది. లిస్టర్ శరవేగంగా సంక్రమణ స్థాయిలను తగ్గించగలిగాడు, రాబర్డ్ కోచ్ యొక్క సాంకేతిక పద్ధతులను ఇతడు ప్రవేశపెట్టడంతో ఈ తగ్గింపు మరింతగా దోహదపడింది (స్టీమ్ స్టెరిలైజర్, ఇది లిస్టర్ మొదట్లో ఉపయోగించిన కార్బోలిక్ యాసిడ్ స్ప్రే కంటే మరింత విజయవంతమైన పద్ధతిగా నిరూపితమైంది), క్రిమిరాహిత్యకారి సామగ్రి, చేతులను బాగా శుభ్రపర్చుకోవడం, తర్వాత ఉపయోగించిన రబ్బర్ తొడుగులను ధరించడం దీనికి తోడ్పడ్డాయి. లిస్టర్ తన పరిశోధనా కృషిని ది లాన్సెట్ (మార్చ్ 1867)లో, యాంటి సెప్టిక్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ ది ప్రాక్టీస్ ఆఫ్ ది సర్జరీ శీర్షికతో సీరీస్‌గా ప్రచురించాడు. ఈ పరిశోధన అద్భుతాలు సృష్టించింది మరియు సంక్రమణ నియంత్రణలో ఇది శీఘ్ర ముందంజకు పునాదులు వేసింది, కేవలం 50 ఏళ్లలోపే ఆధునికి సెప్టిక్ నివారణ ఆపరేషన్ థియేటర్లలో దీన్ని విస్తృతంగా ఉపయోగించారు (లీస్టర్ తన జీవితాంతం యాంటీ సెప్సిస్ మరియు అసెప్సిస్‌పై అదనపు ప్రయోగాలు చేస్తూ పోయాడు.

శస్త్రచికిత్స ప్రత్యేకతలు మరియు ఉప-ప్రత్యేకతలు

 • జనరల్ సర్జరీ
  • కార్డియోథెరాక్టిక్ సర్జరీ
  • కలరెక్టల్ సర్జరీ
  • పిడియాట్రిక్ సర్జరీ
  • ప్లాస్టిక్ సర్జరీ
  • వాస్క్యూలర్ సర్జరీ
  • ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ
  • ట్రౌమా సర్జరీ
  • బ్రెస్ట్ సర్జరీ
  • శస్త్రచికిత్సా అధ్యయనం
  • వినాళగ్రంథి శస్త్రచికిత్స
  • చర్మ శస్త్రచికిత్స
 • చెవి ముక్కు గొంతు అధ్యయన శాస్త్రం
 • గైనకాలజీ
 • నోటి మరియు ముఖం పైదవడ శస్త్రచికిత్స
 • ఆర్తోపెడిక్ సర్జరీ
 • నాడీ శస్త్రచికిత్స (న్యూరో సర్జరీ)
 • అప్తాల్మాలజీ
 • పాద శస్త్రచికిత్స
 • యురాలజీ

మరికొన్ని ప్రత్యేకతలు కొన్ని రకాల శస్త్రచికిత్సా జోక్యం రూపాలు ధరిస్తాయి, ప్రత్యేకించి గైనకాలజీ. అలాగే, కొంతమంది వ్యక్తులు కార్డియాక్ కాథెటెరైజేషన్, ఎండోస్కోపీ, మరియు చెస్ట్ ట్యూబ్స్ లేదా సెంట్రల్ లైన్స్ "సర్జరీ" వంటి చికిత్స/డయాగ్నసిస్ యొక్క గాటు పెట్టే పద్ధతుల గురించి ఆలోచిస్తారు. వైద్యరంగంలోని అనేక విభాగాల్లో, ఈ దృక్పధం పంచుకోబడదు.

వీటిని కూడా చూడండి

 • అనస్థీషియా
 • ASA ఫిజికల్ స్టాటస్ క్లాసిఫికేషన్ సిస్టమ్ లేదా ప్రీ-ఆపరేటివ్ ఫిజికల్ ఫిట్‌నెస్
 • జీవపదార్థం
 • గుండె శస్త్రచికిత్స
 • సర్జికల్ డ్రెయిన్
 • కుహరాంత దర్శనం (ఎండోస్కోపి)
 • హిప్నో సర్జరీ
 • జెట్ వెంటిలేషన్
 • శస్త్రచికిత్స విధానాల జాబితా
 • కనిష్ఠంగా గాటుపెట్టే విధానం
 • ఆపరేషన్ క్రమంలో మరణాల సంఖ్య
 • రోబోటిక్ సర్జరీ
 • శస్త్రచికిత్స ఫలితాల విశ్లేషణ మరియు పరిశోధన
 • శస్త్రచికిత్సతో విడదీయుట
 • అఘాత శస్త్రచికిత్స
 • పునర్నిర్మాణ శస్త్రచికిత్స

నిర్వాహక సంస్థలు

 • అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్
 • అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్తోపెడిక్ సర్జన్స్
 • అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫుట్
 • రాయల్ ఆస్ట్రేలేషియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్
 • రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జన్స్
 • రాయల్ కాలేజ్ ఆఫ్ పిజిషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ కెనడా
 • రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఇన్ ఐర్లండ్
 • రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడింబరో
 • రాయల్ కాలేజ్ ఆఫ్ పిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్‌గౌ
 • రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లండ్

UK మరియు ఐర్లండ్‌లో అర్హతలు

 • రాయల్ కాలేజ్ సర్జన్ల ఫెలోషిప్
 • రాయల్ కాలేజి సర్జన్ల సభ్యత్వం

సూచనలు

 1. వాగ్‌మన్ LD. " పాజ్దూర్ ఆర్, వేగ్మన్ LD, కాంపౌసున్ KA, హాస్కిన్స్ WJ (Eds) కేన్సర్ మేనేజ్‌మెంట్: ఎ మల్టీడిసిప్లినరీ అప్రోచ్. 11 ఎడిషన్‌లో ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్జికల్ ఒంకోలజీ" 2008.
 2. Capasso, Luigi (2002). Principi di storia della patologia umana: corso di storia della medicina per gli studenti della Facoltà di medicina e chirurgia e della Facoltà di scienze infermieristiche (in Italian). Rome: SEU. ISBN 8887753652. OCLC 50485765.CS1 maint: unrecognized language (link)
 3. "Stone age man used dentist drill". BBC News. 6 April 2006. Retrieved 24 May 2010.
 4. హెరోడోటుస్, హిస్టరీస్ 2,84
 5. రిస్సె, G.B. మెండింగ్ బాడీస్, సేవింగ్ సోల్స్: ఎ హిస్టరీ ఆఫ్ హాస్పిటల్స్. ఆక్స్‌ఫర్ట్ యూనివర్శిటీ ప్రెస్, 1990. p. 56 [1]
 6. అస్కిటోపౌలౌ, H., కోన్సోలకి, E., రామౌట్సకీ, I., అనాస్టాసాకి, E. సర్జికల్ క్యూర్స్ బై స్లీప్ ఇండక్షన్ యాజ్ ది అస్క్లెపియిన్ ఆఫ్ ఎపిడారుస్. ది హిస్టరీ ఆఫ్ అనస్తీషియా: ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఫిప్త్ ఇంటర్నేషనల్ సింపోజియమ్, బై జోస్ కార్లోస్ డిజ్, ఎవెలినో ఫ్రాంకో, డగ్లస్ R. బేకన్, J. రూప్రెహ్ట్. జూలియన్ అల్వరాజ్. ఎల్‌సెవియర్ సైన్స్ B.V., ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సీరీస్ 1242(2002), p.11-17. [2]
 7. అస్కిటోపౌలౌ, H., కోన్సోలకి, E., రామౌట్సకీ, I., అనాస్టాసాకి, E. సర్జికల్ క్యూర్స్ బై స్లీప్ ఇండక్షన్ యాజ్ ది అస్క్లెపియిన్ ఆఫ్ ఎపిడారుస్. ది హిస్టరీ ఆఫ్ అనస్తీషియా: ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఫిప్త్ ఇంటర్నేషనల్ సింపోజియమ్, బై జోస్ కార్లోస్ డిజ్, ఎవెలినో ఫ్రాంకో, డగ్లస్ R. బేకన్, J. రూప్రెహ్ట్. ఎల్‌సెవియర్ సైన్స్ B.V., ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సీరీస్ 1242(2002), p.11-17. [3]
 8. ఆంధ్రజ్యోతి, జిల్లా (16 October 2019). "ఆయువు పోసే అనస్థీషియా". చంద్రమౌళి. Archived from the original on 16 October 2019. Retrieved 16 October 2019.
 9. Famousmuslims.com నుంచి జీవిత చరిత్ర 2007 ఏప్రిల్ 16న అందుబాటులోకి వచ్చింది.
 10. పీటర్ ఎల్మెర్, ఓలె పీటర్ గ్రెల్ (2004). "హెల్త్, రోగాలు, యూరప్‌లో సమాజం, 1500-1800: ఒక ఆధార పుస్తకం ". మాంచెస్టర్ యూనివర్శిటీ ప్రెస్. p.8. ISBN 0262081504
 11. Sven Med Tidskr. (2007). "From barber to surgeon- the process of professionalization". Svensk medicinhistorisk tidskrift. 11 (1): 69–87. PMID 18548946.
 12. Levine JM (1992). "Historical notes on pressure ulcers: the cure of Ambrose Paré". Decubitus. 5 (2): 23–4, 26. PMID 1558689. Unknown parameter |month= ignored (help)
 13. మెడికల్ ఇన్నోవేషన్స్ అండ్ వార్ , సైన్స్ మ్యూజియం,లండన్

బాహ్య లింకులు

ky:Хирургия