శుభమస్తు (సినిమా)

From tewiki
(Redirected from శుభమస్తు)
Jump to navigation Jump to search
శుభమస్తు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం భీమనేని శ్రీనివాసరావు
నిర్మాణం ఎం.వి.లక్ష్మి, కూర్పు మోహన్
కథ రఫీ మెకార్టిన్
చిత్రానువాదం కూర్పు మోహన్
తారాగణం జగపతి బాబు
ఆమని
ఇంద్రజ
సంభాషణలు తోటపల్లి మధు
ఛాయాగ్రహణం రాం ప్రసాద్
కూర్పు అకుల భాస్కర్
కూర్పు మోహన్
నిర్మాణ సంస్థ ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్
భాష తెలుగు

శుభామస్తు 1995 లో వచ్చిన కామెడీ చిత్రం. ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఎంవి లక్ష్మి నిర్మించింది. ఇందులో జగపతి బాబు, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించగా, కోటి సంగీతం సమకూర్చాడు.[1] ఇది మలయాళ సినిమా అనియన్ బావా చేతన్ బావాకు రీమేక్.[2]

కథ

ఈ చిత్రం అన్నారావు ( దాసరి నారాయణ రావు ), చిన్నారావు ( సత్యనారాయణ ), వారి డ్రైవర్ ప్రేమచంద్ ( జగపతి బాబు ) ల కథ. వీరి కుమార్తెలు కస్తూరి ( ఆమని ), సరోజ ( ఇంద్రజ ). ఆడపిల్లలిద్దరూ అతడితో ప్రేమలో పడతారు. దీనివలన సోదరులిద్దరూ శత్రువులవుతారు. ప్రేమచంద్‌ను ఎవర్ని పెళ్ళి చేసుకుంటాడనేది ప్రిస్టేజి కారకమౌతుంది.

నటవర్గం

పాటలకు సాలూరి కోటేశ్వరరావు (కోటి) బాణీలు కట్టాడు. టిఎ సౌండ్ ట్రాక్ ఆడియో కంపెనీ ద్వారా పాటలను విడుదల చేసారు.[3]

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "గో గో గో గోపాలా"  ఎస్.పి,. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత 5:05
2. "ఘల్ ఘల్లను"  ఎస్.పి,. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:34
3. "ఓసి మిస్సో"  ఎస్.పి,. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:30
4. "బావిస్తే మామొస్తే"  మురళీ కృష్ణ, రాధిక 4:23
5. "ఈ బంధనాల నందనాన్ని"  ఎస్.పి,. బాలసుబ్రహ్మణ్యం 5:36
మొత్తం నిడివి:
24:08

మూలాలు