శుభ(నటి)

From tewiki
Jump to navigation Jump to search
శుభ
దస్త్రం:Shubha.jpg
జననంశుభ
వృత్తిచలనచిత్ర నటి
క్రియాశీలక సంవత్సరాలు1967-2000
మతంహిందూ మతం
తండ్రివేదాంతం రాఘవయ్య
తల్లిసూర్యప్రభ

శుభ ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో విరివిగా నటించింది. 1970, 80 దశకాలలో పలు సినిమాలలో కథానాయికగా నటించింది.

వ్యక్తిగత జీవితం

ఈమె ప్రముఖ సినిమా నటుడు, దర్శకుడు అయిన వేదాంతం రాఘవయ్యకు, ప్రముఖ నటి సూర్యప్రభకు జన్మించింది. ఈమెకు ఐదుగురు అక్కచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నారు. ఈమె పిన్ని పుష్పవల్లి కూడా ప్రముఖనటి. హిందీ నటి రేఖ కూడా ఈమెకు సమీప బంధువు.

సినిమాలు

ఈమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషాచిత్రాలలో నటించింది. ఈమె ప్రత్యగాత్మ, కె.విశ్వనాథ్, లక్ష్మీదీపక్, పి.చంద్రశేఖరరెడ్డి, దాసరి నారాయణరావు, కె.ఎస్.ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, కె.రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, బాపు, కోదండరామిరెడ్డి, విజయబాపినీడు, వంశీ, ఐ.వి.శశి, కోడి రామకృష్ణ, బి.గోపాల్, క్రాంతికుమార్ తదితర దర్శకుల సినిమాలలో పనిచేసింది.

ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

సంవత్సరము చిత్రము పాత్ర దర్శకత్వం తారాగణం ఇతర వివరాలు
1972 గూడుపుఠాని లక్ష్మీదీపక్ కృష్ణ
1973 పల్లెటూరి బావ కె.ప్రత్యగాత్మ అక్కినేని నాగేశ్వరరావు,లక్ష్మి, నాగభూషణం
1974 అమ్మ మనసు సత్యనారాయణ భార్య కె.విశ్వనాథ్ జయంతి, చలం, భారతి, సత్యనారాయణ
1974 ఓ సీత కథ కె.విశ్వనాథ్ చంద్రమోహన్, కాంతారావు,అల్లు రామలింగయ్య,రమాప్రభ
1974 గౌరి పి.చంద్రశేఖరరెడ్డి కృష్ణ, జమున,రాజబాబు
1974 మాంగల్య భాగ్యం పద్మనాభం పద్మనాభం,భానుమతీ రామకృష్ణ, జగ్గయ్య
1974 సంసారం-సాగరం దాసరి నారాయణరావు ఎస్.వి.రంగారావు,సత్యనారాయణ, గుమ్మడి,జయంతి
1974 సత్యానికి సంకెళ్ళు కె.ఎస్.ప్రకాశరావు కృష్ణ,వాణిశ్రీ,రాజబాబు
1975 అనురాగాలు కె.ఎస్.రామిరెడ్డి నాగభూషణం, రాజబాబు,అల్లు రామలింగయ్య
1975 గాజుల కిష్టయ్య ఆదుర్తి సుబ్బారావు కృష్ణ, జరీనా వహాబ్
1975 చదువు సంస్కారం రాజశ్రీ రంగనాథ్, గుమ్మడి, సత్యనారాయణ
1975 జీవన జ్యోతి కె.విశ్వనాథ్ శోభన్ బాబు ,వాణిశ్రీ,సత్యనారాయణ,రాజబాబు,రమాప్రభ
1975 నాకూ స్వతంత్రం వచ్చింది లక్ష్మీదీపక్ కృష్ణంరాజు,రవికాంత్,జయప్రద,రాజబాబు
1975 పుట్టింటి గౌరవం పి.చంద్రశేఖరరెడ్డి కృష్ణంరాజు, భారతి,ప్రభాకరరెడ్డి,సూర్యకాంతం
1976 జ్యోతి కె.రాఘవేంద్రరావు జయసుధ, మురళీమోహన్, చిడతల అప్పారావు,గిరిబాబు,గుమ్మడి
1977 గంగ యమున సరస్వతి మహేష్ మురళీమోహన్, రోజారమణి, సత్యనారాయణ
1977 తరం మారింది సింగీతం శ్రీనివాసరావు శ్రీధర్, పల్లవి
1977 మొరటోడు నగేష్ సత్యనారాయణ,జయసుధ, ప్రభాకర రెడ్డి
1978 మన ఊరి పాండవులు బాపు కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు, రావుగోపాలరావు
1979 నే నిన్ను మరువలేను విజయ్ రాజ్‌కుమార్, లక్ష్మి డబ్బింగ్ సినిమా
1980 కాళి ఐ.వి.శశి రజనీకాంత్, చిరంజీవి, సీమ
1981 భోగభాగ్యాలు పి.చంద్రశేఖరరెడ్డి కృష్ణ, శ్రీదేవి, నూతన్ ప్రసాద్
1984 రుస్తుం గౌరి ఎ.కోదండరామి రెడ్డి చిరంజీవి, ఊర్వశి
1985 విజేత ఎ.కోదండరామి రెడ్డి చిరంజీవి, భానుప్రియ, శారద, జె.వి.సోమయాజులు
1986 అపూర్వ సహోదరులు మాలిని కె.రాఘవేంద్రరావు బాలకృష్ణ, విజయశాంతి,భానుప్రియ
1986 సిరివెన్నెల కె.విశ్వనాథ్ సర్వదమన్ బెనర్జీ, సుహాసిని, మూన్ మూన్ సేన్
1988 దొంగ కోళ్లు తులసమ్మ విజయబాపినీడు రాజేంద్ర ప్రసాద్, సుమలత, బ్రహ్మానందం
1991 ఏప్రిల్ 1 విడుదల కృపామణి వంశీ రాజేంద్ర ప్రసాద్, శోభన, కృష్ణ భగవాన్
1992 ఘరానా మొగుడు చిరంజీవి తల్లి కె.రాఘవేంద్రరావు చిరంజీవి, నగ్మా, వాణీ విశ్వనాథ్
1993 మెకానిక్ అల్లుడు పార్వతి బి.గోపాల్ అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, విజయశాంతి
1994 సరిగమలు క్రాంతికుమార్ వినీత్, రంభ
1996 మావా బాగున్నావా? కోడి రామకృష్ణ రాజేంద్రప్రసాద్, రంభ, నరేష్,మోహిని
1997 అన్నమయ్య లక్కమాంబ కె.రాఘవేంద్రరావు అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ,కస్తూరి
2003 కబీర్ దాస్ విజయచందర్, జె.వి.సోమయాజులు,ప్రభ

మూలాలు

బయటి లింకులు